TE/Prabhupada 0327 - జీవి , ఈ శరీరం లోపల ఉన్నాడు, స్థూల శరీరంసూక్ష్మ శరీరం



Room Conversation -- April 20, 1976, Melbourne


కరోల్ జార్విస్: మీరు మీ పుస్తకాల అమ్మకాల నుండి రోజుకు వేలాది డాలర్లు సంపాదిస్తున్నారని ఇంతకు ముందు నాకు చెప్పారు.

ప్రభుపాద: అవును.

కరోల్ జార్విస్: మీ ఆలోచనలను ఇతర వ్యక్తులకు చెప్పాలని మీరు కోరుకుంటే, మీరు పుస్తకాలను విక్రయిoచటము ద్వారా ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారు ?

ప్రభుపాద: లేకపోతే మీరు దానిని చదవరు. నేను మీకు ఉచితముగా ఇస్తే, మీరు ఆనుకు౦టారు, , ఇది అర్ధంలేనిది. వారు ఉచితముగా ఇస్తున్నారు.

కరోల్ జార్విస్: ఏమైనప్పటికీ వారికి ఉచితముగా ఇవ్వకపోయినా, వాటిని తయారు చేయుటకు అయిన వ్యయాన్ని ధరగా చెల్లించేటట్లు వారికి విక్రయించవచ్చు కదా.

ప్రభుపాద: వారు చెల్లించాల్సినప్పుడు .... వారు చెల్లించినప్పుడు, వారు చూడడానికి ప్రయత్నిస్తారు ఈ పుస్తకాలు ఏమి చెప్తున్నాయి? నన్ను చూడనివ్వండి. మీరు ఉచితముగా పొందితే, మీరు వందల సంవత్సరాల పాటు మీ అలమరాలోనే ఉంచుతారు. కావునా... ఏదిఏమైనప్పటికీ, మేము ఈ పుస్తకాలను ప్రింట్ చేయాలి, ఎవరు వారికి చెల్లిస్తారు? మా దగ్గర డబ్బు లేదు.

కరోల్ జార్విస్: సరే, మిగిలిన డబ్బు ఏమి అవ్వుతుంది, వీధుల్లో సేకరించినది?

ప్రభుపాద: మేము మన ఉద్యమముని పెoచుతున్నాము. మేము కేంద్రాలని ప్రారంభిస్తున్నాము. మేము మరిన్ని పుస్తకాలను ముద్రిస్తున్నాము. ఇవి నా పుస్తకాలు. నేను ఒక భక్తివేదాంత బుక్ ట్రస్ట్ను ఏర్పాటు చేసాను. ఇది నా ఉద్దేశ్యం, సేకరణలో యాభై శాతం పుస్తకాలు పుస్తకాలను మరల ముద్రించడానికి ఖర్చు చేయాలని నేను కోరుకుంటున్నాను యాభై శాతం ఉద్యమం వ్యాప్తి కోసం ఖర్చు చేయాలి. భౌతిక లాభాల గురించి ఎటువంటి ప్రశ్నే లేదు.

కరోల్ జార్విస్: మీ సందేశాము ఏమిటి అని నేను చివరిగా మిమ్మల్ని అడగవచ్చా?

ప్రభుపాద: అవును, ఇది నా సందేశం. ప్రజలు,తాము ఈ శరీరాము అనే అభిప్రాయంలో ఉన్నారు, కానీ వాస్తవం కాదు. ఆత్మ, లేదా వ్యక్తి, అయిన శరీరం లోపల ఉన్నాడు. మీరు మీ చొక్కా కోట్ కాదు. మీరు చొక్కా కోట్ లోపల ఉన్నారు. అదేవిధంగా, జీవి , ఈ శరీరం లోపల ఉన్నాడు, స్థూల శరీరం సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి అహంకారము, స్థూల శరీరం ఈ బౌతిక వస్తువుల యొక్క ఒక కూర్పు, భూమి, నీరు, వాయువు, అగ్ని వలె వి, ఐదు మూలకాలు ఉన్నాయి. మొత్తంగా, ఎనిమిది మూలకాలు. ఇది నాసిరకం శక్తి. ఉన్నతమైన శక్తి ఈ ఎనిమిది మూలకాలలో, ఐదు స్థూల మూడు సుక్ష్మమైనవి. మనము ఆ విషయము గురించి అధ్యయనం చేయాలి. నేను ఆ బాలుడిని అడిగినట్లు, మీరు భారీ యంత్రాన్ని తయారు చేయవచ్చు, ఆకాశంలో ఎగురుతూ, 747, కానీ ఎందుకు మీరు పైలట్ను తయారు చేయరు?