TE/Prabhupada 0337 - ఈ ఆనందం బాధ అని పిలవబడే వాటి గురించి ఆలోచిస్తూ మీ సమయం వృథా చేసుకోవద్దు



Lecture on CC Madhya-lila 20.103 -- Washington, D.C., July 8, 1976


మనము పోరాడవల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. ఇది జీవితము కోసం యుద్ధము అని పిలుస్తారు. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా, వారు పిలుస్తారు ... ఇది చాలా ప్రశాంతమైన పరిస్థితి కాదు. అదే ప్రశ్న సనాతన గోస్వామిచే అడగబడింది, మనుగడ కోసం ఎందుకు పోరాడాలి? ఎందుకు సులభమైన జీవితం, ప్రశాంతమైన జీవితం లేదు? ఎందుకు కొoదరు బయిట వ్యక్తులు, వారు మనకు వ్యతిరేకతను ఇస్తున్నారు? నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, కాని వ్యతిరేకత ఉంది. ఇది జీవితము కోసం యుద్ధము. ఈ ప్రశ్న అక్కడ ఉండాలి: ఎందుకు? ఒక ఈగతో కూడ మనము పోరాడవలసి ఉంది. నేను ఈగకు ఏమి హాని చేయకుండా, కుర్చున్నాను, కానీ అది దాడి చేస్తుంది ఇబ్బంది పెడుతుంది. చాలా ఉన్నాయి. మీరు ఏ అపరాధము లేకుండా కూర్చుంటే ... మీరు వీధిలో ప్రయాణిస్తున్నట్లుగా, ఏ అపరాధము లేదు, కానీ ఒక ఇంటిలో ఉన్నాఅన్ని కుక్కలు మొరగటము ప్రారంభిస్తాయి: మీరు ఇక్కడకు ఎందుకు వస్తున్నారు? మీరు ఇక్కడకు ఎందుకు వస్తున్నారు? అది మొరిగటానికి కారణం ఉండదు, కానీ అది కుక్క అవ్వటము వలన, దాని కర్తవ్యము "నీవు ఎందుకు వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు?" అదేవిధంగా, ప్రస్తుతము ఒక ప్రదేశం నుండి మరొక దానికి వెళ్ళడానికి మనకు స్వేచ్ఛ లేదు. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది: "ఎందుకు మీరు వస్తున్నారు? ఎందుకు మీరు వస్తున్నారు?" చాలా ప్రదేశాల్లో ప్రవేశించడానికి మనల్ని నిరాకరించారు. మనము విమానం నుండి క్రిందకు దిగుటకు నిరాకరించబడ్డాము. "లేదు, మీరు ప్రవేశించలేరు. వెనక్కి వెళ్ళిపోoడి." నేను తిరిగి వెళ్ళవలసి వచేది. చాలా నష్టాలు. Padaṁ padaṁ yad vipadāṁ na teṣām ( SB 10.14.58) ఈ భౌతిక ప్రపంచంలో, మీరు శాంతిగా జీవించలేరు. శాంతియుతముగా ఉండలేరు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. శాస్త్రం చెప్తుంది, padaṁ padaṁ yad vipadām: ప్రతి దశలో ప్రమాదం ఉంది. ఈ చిన్నా జంతువుల నుండి కాదు, మానవ సమాజం నుండి, వారి స్వభావం పై, మనకు నియంత్రణ లేదు. ఈ విధంగా, మనము ఈ బౌతిక ప్రపంచంలో సంతోషంగా లేము, దాని గురించి అడిగేటట్లు మనము ఉన్నత స్థానము రావాలి, ఎందుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది మానవ జీవితం. అది మానవ జీవితం.

ఎలా విచారణ చేయాలి? సంతోషంగా ఎలా ఉండాలి? జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? సనతనా గోస్వామి ... సనతనా గోస్వామి మాత్రమే కాదు, అతను మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనకు తెలియదు, మనకు తెలియదు. చైతన్య మహాప్రభు యొక్క దయ వలన మరియు చైతన్య మహాప్రభు యొక్క సేవకుల దయతో, వ్యక్తికి జ్ఞానోదయం కలుగుతుంది ... జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, మనుగడ కోసం యుద్ధము ఎందుకు ఉంది, ఎందుకు మరణం ఉంది. నాకు చనిపోవాలని లేదు; ఎందుకు జన్మ ఉంది? నేను తల్లి గర్భంలోకి ప్రవేశించి చాలా రోజులు మూటకట్టిన స్థితిలో ఉండటానికి ఇష్టపడను. నేను వృద్ధుడిని కావాలని అనుకోవటము లేదు; కానీ ఈ విషయాలు నాపై అమలు చేయబడ్డాయి. అందువలన మన కర్తవ్యము, వాస్తవ కర్తవ్యము, ఈ ప్రశ్నలను ఎలా పరిష్కరించాలి అని, ఆర్థిక అభివృద్ధి కోసం ఏర్పాట్లు చేయటము కాదు. మనకు నిర్దేశించిన ఆర్ధిక అభివృద్ధి, అది మనకు లభిస్తుంది. సంతోషం లేదా దుఃఖం, మనము దాన్ని పొందుతాము. మనo దుఃఖము కోసము ప్రయత్నిoచడo లేదు, కానీ అది వస్తుంది. ఇది మనపై అమలు చేయబడుతుంది. అదేవిధంగా, మీరు పొందవలసిన చిన్న ఆనందం అది కూడా వస్తుంది. అది శాస్త్రము యొక్క సలహా. కృత్రిమంగా కొంత ఆనందాన్ని పొందడానికి మీ సమయాన్ని వృథా చేయవద్దు. మీకు ఉద్దేశించబడిన ఆనందం ఏమైనప్పటికీ, ఆది సహజముగా మీకు వస్తుంది. ఆది ఎలా వస్తుంది? Yathā duḥkham ayatnataḥ. అదే విధంగా. మీరు బాధ కోసం ప్రయత్నించకపోయినా, అది మీకు వస్తుంది. అదేవిధంగా, మీరు ఆనందం కోసం ప్రయత్నించక పోయినా, మీకు ఉద్దేశించబడినది ఏదైనా, మీరు పొందుతారు.

ఈ ఆనందం బాధ అని పిలవబడే వాటి గురించి ఆలోచిస్తూ మీ సమయం వృథా చేసుకోవద్దు. జీవితం యొక్క లక్ష్యమేమిటో అర్థం చేసుకోవడానికి మీ విలువైన సమయాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించండి ఎందుకు చాలా సమస్యలు ఉన్నాయి, ఎందుకు మీరు జీవితము కోసం పోరాడటాము చేయాలి. ఇది మీ కర్తవ్యము ... ఇది కృష్ణా చైతన్యము ఉద్యమం, సమస్యను అర్థం చేసుకోవడానికి మనము ప్రజలను ప్రేరేపిస్తున్నాం. ఇది ఒక వర్గపు ఉద్యమం లేదా మత ఉద్యమం అని పిలవబడేది కాదు. ఇది విద్యా సాంస్కృతిక ఉద్యమం. ప్రతి మనిషి జీవితం యొక్క లక్ష్యం అర్థం చేసుకోవాలి. మనుగడ కోసం పోరాటాము ఎందుకు అని ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి, ఏదైనా పరిష్కారము ఉంటే, ఏదైనా పద్ధతి ఉంటే మనం శాంతిగా నివసించవచటానికి, ఏమీ ఆటంకాలు లేకుండానే. ఇవి మానవ జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు, ఒక వ్యక్తిని సంప్రదించాలి ... సనాతన గోస్వామి లాగా, అయిన మంత్రి, విద్యావంతుడు, మంచి జీవితమును కలిగి ఉన్నారు, కానీ అయిన చైతన్య మహాప్రభువుని సమీపించారు అందువల్ల మనము శ్రీ చైతన్య మహాప్రభువును లేదా అయిన ప్రతినిధిని సంప్రదించాలి, శరణాగతి పొందాలి. Tad viddhi praṇipātena ( BG 4.34) మార్గం సవాలు చేయుట కాదు, "మీరు నాకు దేవుడుని చూపించగలరా?" ఇవి సవాళ్లు. ఈ విధంగా కాదు. దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు, కాని మొదట మీ కళ్ళను దేవుణ్ణి చూడడానికి తయారు చేసుకోండి, అప్పుడు మీరు సవాలు చేయoడి, "నీవు నాకు దేవుడుని చూపించగలరా?" ఈ వైఖరి మనకు సహాయం చేయదు. శరణాగతి కావలెను. Tad viddhi praṇipātena. ఇది శాస్త్రం యొక్క ఉత్తర్వు. మీరు ఈ శాస్త్రమును, ఆద్యాత్మిక శాస్త్రమును, tad viddhi - దానిని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిoచండి - praṇipātena, చాలా వినయంతో. సనాతనా గోస్వామిలాగా, చాలా వినయంతో శరణాగతి పొందిన విధముగా.