TE/Prabhupada 0348 - హరే కృష్ణ, మంత్రమును కేవలం యాభై సంవత్సరాలు జపము చేస్తే, ఖచ్చితముగా పరిపూర్ణుడు అవ్వుతా



Lecture on BG 7.14 -- Hamburg, September 8, 1969


ఇంగ్లీష్ అబ్బాయి: ఈ జీవితంలో దీనిని సాధించవచ్చా? దీనిని? వ్యక్తులు పతనము అవ్వడము సాధ్యమా? ప్రభుపాద: ఒక సెకనులో సాధ్యము, మీరు తీవ్రముగా ఉంటే. ఇది కష్టం కాదు. కృష్ణ-భక్తి ... Bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate: ( BG 7.19) అనేక జన్మల తరువాత, ఒకరు, తెలివి ఉన్నా వారు, తెలివైన, పూర్తిగా జ్ఞానము కలిగిన, తెలివైనవాడు, అయిన నాకు శరణాగతి పొందుతాడు, "అని కృష్ణుడు చెప్పారు. నేను తెలివైన వ్యక్తి అయితే, అప్పుడు నేను దాన్ని చూస్తాను అది జీవితం యొక్క లక్ష్యంగా ఉంటే, చాలా జన్మలా తరువాత, కృష్ణుడికి శరణాగతి పొందాలి, ఎందుకు నేను వెంటనే శరణాగతి పొందాకూడదు? ఇది బుద్ధి. ఇది వాస్తవం అయితే, ఒక్కరు ఈ స్థానమునకు వస్తే, అనేక జన్మలు జ్ఞానాన్ని పెంపొందించుకున్నా తరువాత, వెంటనే ఎందుకు దానిని అంగీకరించకూడదు? ఇది వాస్తవము అయితే నేను చాలా జన్మలు ఎందుకు వేచి ఉండాలి?

దానికి కొంచము తెలివి అవసరం. దీనికి అనేక జన్మలు అవసరం లేదు. దీనికి కొంచము బుద్ధి అవసరం. ఈ కృష్ణ చైతన్యమును తీవ్రముగా తీసుకోండి; మీ సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పుడు, మీరు దీనిని నమ్మకపోతే, అప్పుడు వాదనకు రండి. తత్వము తెలుసుకోవాడానికి రండి, తర్కము చేయడానికి రండి. వాదిస్తూ వెళ్ళండి. పుస్తకాలు వాల్యూమ్లు ఉన్నాయి. ఒప్పుకోనేందుకు ప్రయత్నించండి. మీరు దీనిని నేర్చుకోవచ్చు. ప్రతి దానికి సమాధానం భగవద్గీతలో ఉంది. మీరు మీ కారణాలతో, మీ వాదనలతో దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది తెరిచి ఉంది. (విరామం) ఉదాహరణకు అర్జునుడి వలె . అర్జునుడికి భగవద్గీతను భోధించారు, ఎంత సమయములో? దాదాపు, అరగంటలోపు. ఎందుకంటే అయిన చాలా తెలివైనవాడు . ఈ భగవద్గీతను, ప్రపంచంలోని ప్రజలు చదువుతున్నారు. చాలా బాగా జ్ఞానవంతులైన పండితులు, తెలివైనవారు, వారు చదువుతున్నారు. వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, విభిన్న వివరణలు ఇస్తున్నారు. వేల కోలది ఎడిషన్లు, వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ అర్జునుడు తెలివైనవాడు; అయిన అరగంటలో అర్ధం చేసుకున్నాడు.

దీనికి సాపేక్ష బుద్ధి అవసరం. అంతా, ఈ ప్రపంచం సాపేక్షంగా ఉంది. సాపేక్షత నియమం. అది శాస్త్రీయమైనది. ప్రొఫెసర్ ఐన్స్టీన్ సిద్ధాంతం? సాపేక్ష సిద్ధాంతం? ఇది సాపేక్షంగా ఉంది. ఎవరైనా వెంటనే, ఒక్క నిమిషములో కృష్ణ చైతన్యమును పొందవచ్చు, అనేక జన్మలా తరువాత కూడా కృష్ణ చేతన్యమును కొంత మంది పొందలేరు . ఇది సాపేక్షంగా ఉంది. మీకు తగినంత బుద్ధి ఉంటే, వెంటనే దీనిని అంగీకరించవచ్చు. తక్కువ తెలివితేటలు ఉంటే, అది సమయం తీసుకుంటుంది. "చాలా సంవత్సరాల తరువాత సాధ్యమవుతుంది." అని మీరు చెప్పలేరు అది చెప్పలేము. ఇది సాపేక్షంగా ఉంది. అంతా సాపేక్షంగా ఉంది. ఒక మానవునికి, ఇక్కడ నుండి ఇక్కడకు, ఒక అడుగు; ఒక చిన్న సూక్ష్మజీవికి, ఇక్కడ నుండి ఇక్కడకు పది మైళ్ళు, అయినకి పది మైళ్ళు. ప్రతిదీ సాపేక్షంగా ఉంటుంది. ఈ ప్రపంచం సాపేక్ష ప్రపంచం. ఇన్ని సంవత్సరాల తరువాత కృష్ణ చైతన్యములోకి వస్తారని సూత్రము లేదు. లేదు అలాంటి సూత్రము లేదు. కొందరు కృష్ణ చైతన్యమును లక్షలాది, జన్మల తరువాత కూడా పొందలేరు, కొందరు ఒక్క క్షణములోనే కృష్ణ చేతన్యమును పొందగలరు. కాని అవతలి అంచులలో, ఈ జీవితంలో మనము కృష్ణ చైతన్యములో పరిపూర్ణత సాధించ గలము మనము తీవ్రముగా తీసుకుంటే. ముఖ్యంగా మీరు అందరు యువకులు. మీరు కనీసం మరో 50 సంవత్సరాల పాటు మీరు జీవిస్తారని మేము ఆశిస్తున్నాము. , అది తగినంత సమయం. తగినంత. తగినంత కంటే ఎక్కువ. తగినంత కంటే ఎక్కువ. హరే కృష్ణ, హరే కృష్ణ, అని కేవలం యాభై సంవత్సరాలు జపము చేస్తే, అయిన ఖచితముగా పరిపూర్ణుడు అవ్వుతాడు దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కేవలము అయిన ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపము చేస్తే, దాని గురించి ఎటువంటి సందేహం లేదు.