TE/Prabhupada 0355 - నేను విప్లవాత్మకమైనవి మాట్లాడు చున్నాను



Lecture on SB 5.5.1-8 -- Stockholm, September 8, 1973


Kāmān అంటే జీవితం యొక్క అవసరాలు. మీ జీవితంలోని మీ అవసరాలను మీరు చాలా సులభంగా పొందవచ్చు. పొలము పండించడం ద్వారా, మీరు ధాన్యాలు పొందుతారు. ఆవు ఉంటే, మీరు పాలు పొందుతారు. అంతే. అది సరిపోతుంది. కానీ నాయకులు ప్రణాళిక చేస్తున్నారు, వారు తమ వ్యవసాయ పనితో సంతృప్తి చెందినట్లయితే, కొంత ధాన్యాలు పాలు, అప్పుడు కర్మాగారంలో ఎవరు పని చేస్తారు? అందువల్ల మీరు సరళమైన జీవితాన్ని గడకుండా మీకు పన్నులు వేస్తారు - ఇది పరిస్థితి. మీరు కోరుకున్నప్పటికీ, ఆధునిక నాయకులు మిమ్మల్ని అనుమతించరు. కుక్కలు, పందులు, గాడిదల వలె మీరు పని చేయమని వారు బలవంతము చేస్తారు. ఇది పరిస్థితి.

అయినప్పటికీ, మనము అలాంటి అనవసరమైన కష్టము నుండి దూరంగా ఉండాలి. నేను విప్లవాత్మకమైనవి మాట్లాడటం వలన ప్రభుత్వము నాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవచ్చు. అవును. కానీ అది వాస్తవం. మీరు ఎందుకు పని చేయాలి? దేవుడు పక్షులకు, జంతువులకు, మృగములకు, చీమలకు ఏర్పాటు చేసాడు, నేను దేవుడి భక్తుడను అయితే, అయిన నాకు ఆహారము ఇవ్వాడా? నేను ఏమి తప్పు చేశాను? ఆ విషయములో ఆందోళన చెందకండి. మీరు జీవితంలో మీ అవసరాలన్నీ తీర్చ బడుతాయి, కానీ మీరు కృష్ణ చైతన్యంలో స్థిరoగా ఉండండి పట్టుదలతో. ఈ వెర్రి నమ్మకాల వలన ఆందోళన చెందకండి.

ధన్యవాదాలు.