TE/Prabhupada 0358 - ఈ జీవితంలో మనం ఒక పరిష్కారం చేసుకుందాము, ఇక వద్దు. ఇకపై మళ్ళీ రాకుండా ఉందాము



Lecture on BG 7.14 -- Hamburg, September 8, 1969


ఇప్పుడు, మనం ఎలా మరణిoచాలి? పిల్లులు కుక్కల లాగా? అప్పుడు ఈ మానవ రూపం యొక్క ఉపయోగం ఏమిటి? పిల్లులు కుక్కలు, వాటికీ శరీరం ఉన్నాది. అవి కూడా మరణిస్తాయి. నాకు శరీరం ఉన్నాది. నేను కూడా మరణాన్నిస్తాను. నేను పిల్లులు కుక్కలు వలె మరణిoచడము కోసం ఉద్దేశించ బడ్డానా? అప్పుడు నేను ఏ విధమైన మానవుడుని నేను? కాదు శాస్త్రము చెప్పుతుంది labdhvā su-durlabham idaṁ bahu-sambhavānte చాలా, వివిధ రకాల శరీరాల పరిణామం తరువాత ... మీరు పరిణామ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నారు. ఇది ఖచితముగా డార్విన్ సిద్ధాంతం వలె కాదు, కానీ పరిణామ పద్ధతి ఉంది. అది వేద సాహిత్యంలో అంగీకరించబడింది. అధమ జంతువు జన్మ స్థాయి నుండి ఉన్నాత జంతువుల జన్మ స్థాయి వరకు. ఈ మానవ జీవన విధానమును అర్థం చేసుకోవాలి. అనేక జన్మల తరువాత చాలా అధమ జన్మల నుండి మనము ఈ మానవ రూపమునకు వచ్చాము. Labdhvā su-durlabham. ఇది చాలా అరుదైనది. జీవశాస్త్రవేత్తలుగా ఉన్నవారు, మీరు లెక్కించండి, అక్కడ ఎన్ని రకాల జీవులు ఉన్నాయి అని మీరు లెక్కించండి. 8,400,000 జీవము ఉన్నా జాతులు ఉన్నాయి. అందులో, మానవులు చాలా చిన్న పరిమాణంలో ఉన్నారు. 8,400,000 లో, మానవులు 400,000 రకముల జాతులు ఉన్నారు; ఇతర జంతువులతో పోలిస్తే, చాలా చిన్న పరిమాణం. అందులో, అనేక మంది అనాగరికులు ఉన్నారు. వారు దాదాపు జంతువులు. తరువాత నాగరికత కలిగిన మానవులు ఉన్నారు. ఉదాహరణకు మనలాగా. వారిలో, వారికి తెలియదు ... చాలామoదికి, ఆధ్యాత్మిక జీవితo అంటే ఏమిటో వారికి తెలియదు. Manuṣyāṇām. ఇది కూడా భగవద్గీతలో చెప్పబడింది: manuṣyāṇāṁ sahasreṣu ( BG 7.3) అనేక వేలమంది మనుషులలో, సమస్యల పరిష్కారం కోసం ఒక వ్యక్తికి ఆసక్తి ఉంటుoది. అందరికి కాదు. ప్రతి ఒక్కరూ, సమస్య ఏమిటో కుడా వారికి తెలియదు. వారు దానిని పట్టించు కోరు. వారు అనుకుంటున్నారు, "సరే, సమస్య ఉండనివ్వoడి. మనము ఈ జీవితాన్ని పొందాము, మనము ఇంద్రియాలను ఆనందిద్దాము. " వారు దాదాపు జంతువులు. కానీ సమస్యను ఎలా పరిష్కరించాలో అని అలోచన కలిగిన వారు, వారు నిజానికి మానవులుగా అంగీకరించబడ్డారు. ఇతరులు, వారు కనీసము మానవులు కూడా కాదు. వారు దాదాపు జంతువులు.

మీరు ఈ అవకాశాన్ని పొందారు. ఈ శరీరమును సరిగా ఉపయోగించుకోవాలి, సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దానికి. మనము జన్మ మరణ చక్రం యొక్క తరంగాలలో మనము ఉంటే, వివిధ రకాల శరీరములు , ఆది చాలా మంచి మేదస్సు కాదు. అది మేదస్సు కానే కాదు. ఈ మానవ శరీరాన్ని సమస్యకు పరిష్కారం ఎలా చేయాలి అనే దానికి ఉపయోగించాలి. అది వేదముల నాగరికత. వారు సమస్యలు, వాస్తవమైన సమస్యల పరిష్కారంపై మరింత ప్రాదాన్యము ఇస్తారు. భౌతిక జీవన మార్గాము అంటే సమస్యలను పెంచుకోవడము సృష్టించుకోవడము అంతే అది పరిపూర్ణ మానవ నాగరికత కాదు. ఖచ్చితమైన మానవ నాగరికత అంటే మీరు చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చొని, తత్వపరంగా ఆలోచించవలసి ఉంటుంది, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? నేను ఎక్కడ జ్ఞానాన్ని పొందుతాను? ఇది మానవ రూపం. మొత్తం వేదముల సూచన ఆ విధంగా ఉంటుంది. మీరు సమస్యను పరిష్కరిoచడానికి ఇప్పుడు ఈ రకమైన జీవితాన్ని ఉపయోగించుకోండి. చనిపోకండి, మరణానికి ముందు మీరు ఒక పరిష్కారం చేయండి పిల్లులు కుక్కల వలె చనిపోవద్దు. లేదు. ఎవరు ప్రయత్నిస్తారో ... వేదము చెప్పుతుంది, etad viditvā yaḥ prayāti sa brāhmaṇaḥ: సమస్యలకు ఒక పరిష్కారం చేయడానికి ప్రయత్నించిన తరువాత చనిపోయే వ్యక్తి, అతడు బ్రాహ్మణుడు. పిల్లులు, కుక్కల వలె చనిపోయేవాడు, అయినను కృపణా అని అంటారు. కృపణా అంటే చాలా తక్కువ తెలివి గల వ్యక్తి.

మనం పిల్లులు కుక్కల వలె చనిపోకూడదు. మనము బ్రహ్మణుడి వలె చనిపోవాలి. ఒక జీవితంలో ఈ పరిష్కారం చేయలేకపోయినా కూడా, అప్పుడు మీరు తదుపరి జీవితములో అవకాశం పొందుతారు. మన దగ్గరకు వచ్చిన ఈ అబ్బాయిలు అందరి వలె, వారు వారి చివరి జీవితంలో కూడా ప్రయత్నించారు అని అర్థం చేసుకోవాలి ఈ సమస్య పరిష్కారం కోసం, కానీ అది పూర్తి కాలేదు. మరొక అవకాశం వచ్చినది. ఈ విషయాలు భగవద్గీతలో పేర్కొనబడ్డాయి. ఇప్పుడు, ఈ జీవితం, మీరు నిర్ణయించుకోవాలి. కృష్ణ చైతన్యములోకి వచ్చి దీక్ష తీసుకొని ప్రారంభించిన వారు, వారు పట్టుదలతో ఉండాలి, ఈ జీవితంలో మనం ఒక పరిష్కారం చేసుకుoద్దాము, ఇక వద్దు ఇకపై మళ్ళీ రాకుండా ఉందాము. మన పట్టుదల అలా ఉండాలి. ఈ కృష్ణ చైతన్యము ఉద్యమం ఈ ప్రయోజనము కోసం ఉన్నాది, జీవితం యొక్క అన్ని సమస్యలకు పరిష్కారం చేసుకొని భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటానికి, తిరిగి భగవంతుని దగ్గరకు వెళ్ళటానికి, ఎక్కడ మనకు శాశ్వతమైన, ఆనందకరమైన జ్ఞానం లభిస్తుందో. ఇది కృష్ణ చైతన్యము యొక్క మొత్తం సారంశము.