TE/Prabhupada 0366 - మీరు, అందరూ, గురువులు అవ్వండి కాని అర్థం లేనివి మాట్లాడకండి



Lecture on SB 6.1.21 -- Honolulu, May 21, 1976


చైతన్య మహాప్రభుచే తాజాగా అంగీకరిoచబడినది: kṛṣṇas tu bhagavān svayam ( SB 1.3.28) Yāre dekha tāre kaha kṛṣṇa-upadeśa ( CC Madhya 7.128) చైతన్య మహాప్రభు యొక్క, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రచారాము, ఈ ప్రచారం ఏమిటి? అయిన చెప్పుతారు "మీరు ప్రతి ఒక్కరూ గురువు అవ్వండి." అయినకు మూర్ఖపు నకిలీ గురువు అవసరము లేదు, కానీ వాస్తవమైన గురువును అయిన కోరుకుంటున్నారు. ప్రజలు చీకటిలో ఉన్నందున, లక్షలాది గురువుల మనకు కావలి వారికి జ్ఞానాన్ని కల్పించడానికి. అందువలన చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యము, "మీరు ప్రతి ఒక్కరు గురువు అవ్వండి" అని అన్నారు. Āmāra ājñāya guru haya tāra ei deśa. మీరు దూర ప్రాంతాలకు వెళ్ళ వలసిన అవసరము లేదు. మీరు ఎక్కడ ఉన్నా, మీరు బోధిoచండి; గురువు అవ్వండి. ఇది పట్టింపు లేదు. Ei deśa. అయిన చెప్పాడు, Ei deśa మీకు అర్హత ఉంటే, మీరు ఇతర దేశానికి వెళ్ళవచ్చు, కానీ అది అవసరం లేదు. ఏ గ్రామంలోనైనా, మీరు ఏ దేశాములోనైనా లేదా పట్టణములోనైనా , మీరు గురువు అవ్వండి. ఇది చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యము. Āmāra ājñāya guru haya tāra ei deśa. ఈ దేశం, ఈ ప్రదేశము. , "కానీ నాకు ఏ అర్హత లేదు, నేను గురువుగా ఎలా ఉండవచ్చు?" అర్హత అవసరం లేదు. "ఇంకా నేను గురువు అవచ్చా?" అవును. ఎలా? Yāre dekha tāre kaha kṛṣṇa-upadeśa: ( CC Madhya 7.128) మీరు ఎవరిని కలుసుకున్నా, మీరు కేవలం కృష్ణుడు చెప్పినట్లు బోధిoచండి. అంతే. మీరు గురువు అవుతారు. " ప్రతి ఒక్కరు గురువుగా మారడానికి చాలా ఆత్రుతగా ఉంటారు, కానీ దుష్టుడికి గురువు ఎలా అవ్వాలో తెలియదు. సరళమైన విషయము చాలా మంది గురువులు ఈ దేశము లోకి భారతదేశం నుండి వస్తారు, అందరు దుష్టులు, కానీ వారు కృష్ణుడు ఉపదేశించినది ఏమి ప్రచారము చేయరు. మొదటిసారిగా ఇది కృష్ణ చైతన్యముతో మొదలైంది. లేకపోతే అందరు దుష్టులు, వారు ఏదో భోధించారు, కొంత ధ్యానం, ఇది, అది, అంత మోసం .

కృష్ణుడు చెప్పిన దానిని నిర్దేశిస్తాడు వాస్తవమైన గురువు. ఇది మీరు మీ ఉపదేశమును తయారు చేయడము కాదు. కాదు అది చైతన్య మహాప్రభు. తయారీ అవసరం లేదు. సూచన ఇప్పటికే ఉంది. మీరు చెప్పవలసినది కేవలము, "యధాతధముగా చెప్పవలెను." అంతే. చాలా కష్టమైన పనా? తండ్రి ఇలా అన్నాడు, "ఇది మైక్రోఫోన్." ఒక పిల్ల వాడు చెప్పగలడు "తండ్రి ఇది మైక్రోఫోన్ అని అన్నారు." అయిన గురువు అవుతాడు. ఇబ్బంది ఎక్కడ ఉంది? ప్రామాణికుడైన, తండ్రి, అయిన అన్నారు "ఇది మైక్రోఫోన్." పిల్లవాడు దానిని మాత్రమే చెప్పవలేను "మైక్రోఫోన్ ఇది". అదేవిధంగా, కృష్ణుడు చెప్పాడు"నేను దేవాదిదేవుడిని." నేను కనుక చెప్పితే , "కృష్ణుడు దేవాదిదేవుడు అని," కష్టం ఎక్కడ ఉంది, నేను కృష్ణుడిని లేదా దేవాదిదేవుడిని అవ్వటానికి నేను ఇతరలను మోసగించకపోతే? అది మోసం. కానీ సరళమైన సత్యమును నేను చెప్పినట్లయితే, "కృష్ణుడు భగవంతుడు, దేవాది దేవుడు. అయిన ప్రతి దాని యొక్క యజమాని. అయినను ఆరాధించాలి ".అప్పుడు నాకు కష్టం ఎక్కడ ఉంది?

అది మన లక్ష్యం. కృష్ణ చైతన్యఉద్యమానికి వచ్చిన వారందరు ఇది మా అభ్యర్థన, మీరు, అందరూ, గురువు అవ్వండి కాని అర్ధం లేనివి మాట్లాడకండి. ఇది అభ్యర్థన. కేవలం కృష్ణుడు చెప్పినది మాట్లాడండి. అప్పుడు మీరు బ్రహ్మణుడు అవుతారు. మీరు గురువు అవ్వుతారు, ప్రతిదీ అవ్వుతారు.

ధన్యవాదాలు.