TE/Prabhupada 0384 - గౌరాంగ బోలితే హబేకు భాష్యము



Purport to Gauranga Bolite Habe -- Los Angeles, January 5, 1969


ఇది నరోత్తమ దాస ఠాకూర పాడిన పాట అతను అన్నాడు "ఆరోజు ఎప్పుడు వస్తుంది?" ఆయన చెప్పుతారు, ఆ రోజు ఎప్పుడు వస్తుంది నేను కేవలము చైతన్య మహాప్రభు నామమును కీర్తన చేస్తాను. అప్పుడు నా శరీరము పులకరిస్తుంది Gaurāṅga bolite habe pulaka-śarīra. పులక శరీర అంటే శరీరము పులకరిస్తుంది ఒకరు ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉన్నప్పుడు కొన్ని సార్లు ఎనిమిది రకాల లక్షణాలు ఉంటాయి ఏడ్చటం, ఒక పిచ్చివాడిలా మాట్లాడటం, శరీరము వణకడము ఏ ఇతర వ్యక్తుల మీద శ్రద్ధ లేకుండా నృత్యం చేయటం ఇలాంటి లక్షణాలు కృత్రిమంగా సాధన చేయటము వలన కాకుండా సహజంగానే అభివృద్ధి చెందుతాయి

నరోత్తమ దాస ఠాకూర ఆరోజు కోసం ఎదురు చూస్తున్నాడు కృత్రిమంగా అనుకరించాలని కాదు .అది అతను సిఫార్సు చేయడము లేదు అతను అన్నాడు "ఆ రోజు ఎప్పుడు వస్తుంది?" కేవలము చైతన్య మహాప్రభు పేరును జపించడము వలన నా శరీరం పులకరిస్తుంది? Gauranga bolite habe pulaka - sarira.Hari Hari bolite హరి హరి లేదా హరే కృష్ణ అని జపించిన వెంటనే నా కన్నుల నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి Hari hari bolite nayane ba'be nīra. నీర అంటే నీరు. అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడా చెప్పారు "ఆ రోజు ఎప్పుడు వస్తుంది?" మనం కేవలం కోరుకోవాలి కానీ కృష్ణుడి దయ ద్వారా ఆ దశకి మనం చేరుకోవచ్చు. ఈ లక్షణాలు సహజంగా వస్తాయి కానీ నరోత్తమం దాస ఠాకూర చెప్పుతారు అది సాధ్యం కాదు అని భౌతిక బంధనాల నుండి విముక్తి పొందకుండానే ఆ దశ చేరుకోవటానికి కుదరదు అని అన్నాడు ,

అoదు వలన Ara kabe Nitai-chander,koruna hoibe: ఆరోజు ఎప్పుడు వస్తుంది , నిత్యానంద ప్రభువు యొక్క కరుణ నాకు అందజేయబడుతుంది. Viṣaya chāḍiyā. Āra kabe nitāi-cander koruṇā hoibe, saṁsāra-bāsanā mora kabe tuccha ha'be. Saṁsāra-bāsanā అంటే భౌతిక ఆనందం యొక్క కోరిక Saṁsāra-bāsanā mora kabe tuccha ha'be: ఎప్పుడైతే భౌతిక ఆనందం కొరకు నా కోరిక అల్పమైనది మరియు ముఖ్యమైనది కాదో తుచ్ఛ. తుచ్ఛ అంటే ఒక విలువ లేని వస్తువు: "దానిని పడవేయండి" అదేవిధంగా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది ఎప్పుడైతే ఒకరు నమ్మినప్పుడు “ఈ భౌతిక ప్రపంచం మరియు భౌతిక ఆనందానికి విలువ లేదు " ఇది నాకు జీవితములో నిజమైన ఆనందాన్ని ఇవ్వదు ఈ నమ్మకం చాలా అవసరం. Saṁsāra-bāsanā mora kabe tuccha ha'be. అతడు చెప్పారు “నేను ఎప్పుడూ భౌతిక కోరికల నుండి ముక్తుడను అవుతానో " అప్పుడు వృందావనం యొక్క వాస్తవమైన స్థితిని చూడటం సాధ్యం అవుతుంది Viṣaya chāḍiyā kabe śuddha ha'be mana: ఎప్పుడైతే నా మనసు పవిత్రం చేయబడుతుందో భౌతిక కల్మషాల కల్మషము లేకుండా ఆ సమయంలో బృందావనం అంటే ఏమిటో చూడటం నాకు సాధ్యమవుతుంది వేరొక మాటలో చెప్పాలంటే బలవంతంగా ఎవరు బృందావనమునకు వెళ్లి అక్కడ నివసించలేరు. మరియు అతను ఆధ్యాత్మిక ఆనందము పొందగలడు. లేదు అతను తన మనస్సును అన్ని భౌతిక కోరికల నుండి విముక్తి చేయవలెను. అప్పుడు బృందావనంలో నివసిస్తూ, దాని నివాస ప్రయోజనమును ఆనందించగలరు.

నరోత్తమం దాస ఠాకూర కూడా చెప్పారు Vishaya chadiya kabe ,suddha habe mana ఎప్పుడైతే నా మనసు ఈ భౌతిక ఆనందం యొక్క కల్మషాల నుండి విముక్తమవుతుందో నేను పరిశుద్ధం అవుతాను, అప్పుడు నాకు బృందావనమును వాస్తవముగా చూడగలటం సాధ్యమవుతుంది లేకపోతే అది సాధ్యం కాదు అతడు మళ్ళీ చెప్తారు, బృందావనమునకు వెళ్లటం అంటే రాధాకృష్ణుల యొక్క దివ్యమైన లీలలను అర్థం చేసుకోవటం ఇది ఎలా సాధ్యమవుతుంది? అందుకే అతడు చెప్తారు, rūpa-raghunātha-pade hoibe ākuti. రూప, రూపగోస్వామి, రూపగోస్వామితో మొదలుకొని రఘునాథ దాస గోస్వామి వరకు ఆరుగురు గోస్వాములు ఉన్నారు: Rūpa, Sanātana, Gopāla Bhaṭṭa, Raghunātha Bhaṭṭa, Jīva Gosvāmī, Raghunātha dāsa Gosvāmī. కాబట్టి ఆయన ఇలా అన్నాడు, "rūpa-raghunātha-pade:" రూప గోస్వామి నుండి రఘునాథ దాస గోస్వామి వరకు," పదే, "వారి పాదపద్మముల వద్ద. ఎప్పుడు నేను వారి పాద పద్మముల పట్ల అనురాగమును పెంచుకొనుటకు ఆత్రుత చూపెదను" Rupa-raghunatha-pade, haibe akuti. ఆకూతి, ఆత్రుత. ఆ ఆత్రుత అంటే ఏమిటి? అంటే గోస్వాముల మార్గదర్శకత్వంలో రాధాకృష్ణులను అర్థం చేసుకోవటం తమ స్వంత ప్రయత్నంతో రాధాకృష్ణులను అర్థం చేసుకోటానికి ప్రయత్నించకూడదు. అది అతనికి సహాయం చేయదు. ఎలా అయితే ఈ గోస్వాములు మనకు దిశను చూపించారో, భక్తి రసామృత సింధులా అందువల్ల ప్రతిఒకరు అనుసరించాలి ,ప్రతి పదంలో, పురోగతిని ఎలా సాధించాలి. ఒక భాగ్యవంతమైన రోజు వస్తుంది అప్పుడు మేము అర్థము చేసుకుంటాము రాధాకృష్ణుల మధ్య లీలలు మరియు ప్రేమ వ్యవహారాలు ఏమిటి అని లేకపోతే , మనము సాధారణ అమ్మాయి ,అబ్బాయిల వలె తీసుకుంటే వారి పరస్పరం ఇచ్చిపుచ్చుకొను ప్రేమ పూర్వక భావాలను, మనము తప్పుగా అర్థం చేసుకుంటాము అప్పుడు ప్రకృతి - సహజీయ ఉత్పత్తి అవుతుంది. బృందావన బాధితులము అవుతాము

అందువల్ల నరోత్తమదాస ఠాకూర మనకు దిశను ఇస్తున్నారు ఎలా రాధాకృష్ణులతో సాంగత్యము చేయుటకు, అత్యంత పరిపూర్ణమైన దశను చేరవచ్చు అని. మొదట విషయము ఏమిటంటే, శ్రీ చైతన్య మహాప్రభువు మీద చాలా ఎక్కువగా ప్రేమను కలిగి ఉండాలి. అది మనకు దారి చూపిస్తుంది. ఎందువల్ల అంటే కృష్ణ చైతన్య అవగాహనను మనకు ఇవ్వటానికి ఆయన వచ్చాడు. అందువల్ల మొట్టమొదటిగా శ్రీ చైతన్య మహాప్రభు శరణాగతి పొందాలి . శ్రీ చైతన్య మహాప్రభుకు శరణాగతి పొందితే, నిత్యానంద ప్రభువు ప్రసన్నమవుతాడు. అతన్ని ప్రసన్నం చేయటం ద్వారా మనం భౌతిక కోరికల నుండి దూరం అవుతాము. భౌతిక కోరికలు లేనప్పుడు, మనం బృందావనం లోనికి ప్రవేశించగలుగుతాము. బృందావనంలో ప్రవేశించిన తరువాత, మనం ఆరుగురు గోస్వాములకు సేవ చేయాలనే ఆసక్తి ఉన్నప్పుడు మనం రాధాకృష్ణుల లీలలను అర్థము చేసుకునే స్థితిని చేరుతాము