TE/Prabhupada 0436 - అతను అన్ని సందర్భల్లోనూ చలాకీగా ఉంటాడు,కృష్ణ చైతన్యములో మాత్రమే ఆసక్తి చూపుతాడు



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968



భక్తుడు: శ్లోకము 11, భగవంతుడు పలికెను: "పాండిత్యంతో కూడిన పలుకులను పలుకుతూనే శోకింపదగని దానిని గురించి శోకిస్తున్నావు. పండితుడైన వాడు జీవించి ఉన్నవారి గురించి గానీ లేక మరణించిన వారి గురించిగాని దుఃఖించడు ( BG 2.11) " భాష్యము: "భగవంతుడు వెంటనే గురువు స్థానాన్ని స్వీకరించి తన శిష్యున్ని మందలిస్తూ, పరోక్షంగా అవివేకి అని సంబోదించాడు. భగవంతుడు ఇలా పలికెను, 'నీవు పండితుని వలె మాట్లాడుతున్నప్పటికీ, నిజంగా పండితుని గురించి నీవు ఎరుగవు, శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటో తెలిసిన వ్యక్తి, ఏ దశలోనూ శోకించడు, జీవించి ఉన్న లేదా మరణించిన స్థితిలో కూడా. ' తరువాతి అధ్యాయల్లో వివరించినట్లుగా, జ్ఞానం అంటే భౌతికపదార్థము,ఆత్మ ,ఆ రెండింటిని నియంత్రించేవాని గురించి తెలుసుకోవటం అని అర్థం. రాజకీయలు లేదా సామాజిక పరిస్థితుల కన్న మత సూత్రాలకు మరింత ప్రాముఖ్యత ఇవ్వాలని అర్జునుడు వాదించాడు, కానీ మతపరమైన సూత్రాల కన్నా భౌతికపదార్థం, ఆత్మ మరియు దేవదిదేవుని యొక్క జ్ఞానం ప్రాముఖ్యమైనదని అతనికి తెలియదు. అతనికి ఆ జ్ఞానం కొరవడివున్నందున, అతను చాలా జ్ఞానము కలిగిన మనిషిలా తనను తాను ప్రదర్శించుకోకూడదు. అతను చాలా జ్ఞానము కలిగిన మనిషి కాకపోవడం వలన, ఫలితంగా అతడు శోకింపదగని దాని గురించి శోకిస్తున్నాడు. శరీరం జన్మించింది మరియు నేడో లేక రేపో అంతమొందుతుంది. అందువలన శరీరం ఆత్మ అంత ముఖ్యమైనది కాదు.ఇది తెలిసిన వ్యక్తి వాస్తవమైన పండితుడు. అతనికి భౌతిక శరీరము ఏ దశలోనూ విచారణకు కారణం లేదు. "

ప్రభుపాద: "కృష్ణుడు ఇలా చెప్పాడు,"ఈ శరీరం, మరణించివున్నా లేక సజీవంగా ఉన్నా విలపించటానికి కారణం ఏమీ లేదు". శవానికి,అంటే శరీరం మరణించినప్పుడు, దానికి విలువ లేదు. విలపించడం వలన ఉపయోగం ఏమిటి? మీరు వేలాది సoవత్సరాలు విలపించినా కూడా,ఆ శరీరానికి జీవం రాదు. కాబట్టి,మరణించిన శరీరం గురించి శోకించడానికి ఏ కారణం లేదు. ఇక ఆత్మకు సంబంధించిన విషయానికి వస్తే అది శాశ్వతమైనది. అది మరణించినట్లుగా కనిపించినా, లేదా ఈ శరీరపు మరణంతో, ఆత్మ మరణించదు. అందుచేత ఎందుకు ఒక మనిషి విలపించాలి, "అయ్యో! నా తండ్రి చనిపోయాడు, నా పలానా బంధువు చనిపోయాడు," మరియు ఏడుస్తాడు? అతను చనిపోలేదు.ప్రతి ఒక్కరికీ ఈ జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు అతను అన్ని సందర్భల్లోనూ చలాకీగా ఉంటాడు,మరియు అతను కేవలం కృష్ణ చైతన్యములో మాత్రమే ఆసక్తి చూపుతాడు. సజీవంగవున్నా లేక మరణించినా, శరీరం గురించి విలపించటానికి కారణం ఏమీ లేదు. అది ఈ అధ్యాయంలో కృష్ణుడిచే సూచించబడింది. కొనసగించు.

భక్తుడు: "గతంలో నేను గానీ నీవుగాని ఇక్కడున్న రాజులందరూ గాని వ్యక్తిగతంగా నిలిచి ఉండని సమయం ఏదీ లేదు. భవిష్యత్తుతులో కూడ మనలో ఎవరైనసరే ఉండకుండాపోరు ( BG 2.12) " భాష్యము: "వేదాలలో, కఠోపనిషత్తులో, అలాగే శ్వేతాస్వతర ఉపనిషత్తు లో, ఇలా చెప్పబడింది ..."

ప్రభుపాద: (ఉచ్చరణను సరిదిద్దుట) శ్వేతాస్వతర. అనేక ఉపనిషత్తులు ఉన్నాయి,వాటిని వేదాలు అంటారు. ఉపనిషత్తులు వేదాల ముఖ్యంశాలు. ఎలాగంటే ఒక అధ్యాయంలో ఒక శీర్షిక ఉంటుంది, అదేవిధంగా ఈ ఉపనిషత్తులు వేదాల యొక్క ముఖ్యాంశాలు. 108 పేరెన్నికగన్న ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో తొమ్మిది ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. ఆ తొమ్మిది ఉపనిషత్తులలో, శ్వేతస్వతర ఉపనిషత్తు, తైత్తిరేయ ఉపనిషత్తు, ఐతరెయ ఉపనిషత్తు, ఈశోపనిషత్తు,ముండక ఉపనిషత్తు,మాండుక్య ఉపనిషత్తు, కఠోపనిషత్తు, ఈ ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. ఎప్పుడైనా ఒక విషయం గురించి వాదన ఉన్నప్పుడు, ఈ ఉపనిషత్తుల నుండి ప్రమాణాన్ని సూచించాలి.