TE/Prabhupada 0443 - నిరాకారత్వం అనే ప్రశ్నే లేదు



Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968


ప్రభుపాద:తర్వాత చదవండి.

భక్తుడు: "జీవునికి గల శాశ్వత వ్యక్తిత్వం వాస్తవము కాకపోతే, అప్పుడు జీవుని యొక్క భవిష్యత్తు అస్తిత్వం గురించి కృష్ణుడు ఇంతగా నొక్కి చెప్పేవాడు కాదు. "

ప్రభుపాద: అవును.మనం వ్యక్తిగతంగా నిలిచిలేనటువంటి సమయం లేనే లేదు అని చెప్పాడు, మరియు భవిష్యత్తులో కూడా మనము వ్యక్తిగతంగా నిలిచి ఉండనటువంటి సమయం ఉండబోదు. ప్రస్తుత విషయానికి వస్తే, మనమందరమూ వ్యక్తిగత ఆత్మలము.అది మీకు తెలుసు. కాబట్టి,వ్యక్తిత్వం కోల్పోయే అవకాశం ఎక్కడ ఉంది? నిరాకారంగా ఎలా వుంటాడు? లేదు. అందుకు అవకాశం లేదు. ఈ శూన్యవాదం,నిరాకారవాదం, అనేవి విరుద్ధమైన కృత్రిమ మార్గములు, అవి భౌతిక జీవితపు కలవరపెట్టే విభిన్న మార్గాలు. అవన్నీ ప్రతికూలమైనవే. అవి సానుకూలమైనవి కావు. సానుకూలమైన విషయం ఏంటంటే, కృష్ణుడు చెప్పినట్లుగా, tyaktvā dehaṁ punar janma naiti mām eti kaunteya ( BG 4.9) ఈ భౌతిక కష్టాలని వదిలిపెట్టిన తర్వతే, ఎవరైనా నా దగ్గరకు రాగలరు. ఎలాగంటే ఈ గదిని విడిచిపెట్టిన తర్వాతే, మీరు మరొక గదిలోకి ప్రవేశించగలరు. మీరు ఈ గదిని విడిచిపెట్టిన తర్వాత, నేను ఆకాశంలో నివసించగలను అని చెప్పలేరు. అదేవిధంగా, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, మీరు ఆధ్యాత్మిక రాజ్యంలో కృష్ణుడికి వద్దకు చేరినప్పుడు, మీ వ్యక్తిత్వం అలానే ఉంటుంది, కానీ మీకు అక్కడ ఒక ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. ఎప్పుడైతే మీకు ఒక ఆధ్యాత్మిక శరీరం లభిస్తుందో అప్పుడు ఎటువంటి కలవరాలు ఉండవు. ఎలాగైతే మీ శరీరం జలచరాల యొక్క శరీరం నుండి భిన్నంగా ఉంటుంది. ఆ జలచరాలు, నీటిలో ఇబ్బందిపడవు, ఎందుకంటే వాటి శరీరము అలా తయారయి వుంటుంది. అవి అక్కడ శాంతిగా జీవించగలవు. మీరు ఉండలేరు. అదేవిధంగా, చేపలు, మీరు వాటిని నీటి నుండి బయటకు తీసుకువస్తే, అవి బ్రతకలేవు. అదేవిధంగా, మీరు ఆత్మస్వరూపులు కాబట్టి , ఈ భౌతిక ప్రపంచంలో మీరు శాంతిగా జీవించలేరు. ఇది మీకు అన్య ప్రదేశం. కానీ మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించిన వెంటనే, మీరు శాశ్వతమైన, ఆనందకరమైన, జ్ఞానమయమైన, జీవితాన్ని పొందుతారు. మరియు వాస్తవమైన శాంతియుత జీవితాన్ని పొందుతారు. Tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) కృష్ణుడు ఇలా చెప్పాడు, "ఈ దేహన్ని విడిచిపెట్టిన తర్వాత, అతను కలవరపట్టే ఈ భౌతిక ప్రపంచానికి తిరిగిరాడు ." మామేతి, "అతను నన్ను చేరతాడు." ఇక్కడ నన్ను అంటే భగవద్రాజ్యం,ఆయన సామాగ్రి, ఆయన సహచరులు, ప్రతిదీ. ఎవరో ఒక ధనవంతుడు లేదా ఒక రాజు "సరే, నీవు నా దగ్గరకు రా" అని చెప్తే, దాని అర్థం అతను నిరాకారం అని కాదు. ఒక రాజు "రమ్ము...." అని పిలిచినట్లయితే, అంటే అతను తన రాజభవనాన్ని కలిగి వున్నాడు, అతను తన కార్యదర్శిని కలిగివున్నాడు, అలాగే అతను తన చక్కని భవంతిని కలిగివున్నాడు, ప్రతిదీ ఉంది. అలాంటప్పుడు ఎలా అతను నిరాకారుడు అవుతాడు? కానీ అతను "నన్ను చేరతాడు." అని అంటున్నాడు. ఈ "నన్ను" అంటే ప్రతిదీ అని అర్థం. ఈ "నన్ను" అంటే నిరాకారత్వాన్ని అని అర్థం కాదు. మరియు మనం బ్రహ్మ సంహిత నుండి సమాచారాన్ని పొందివున్నాము, lakṣmī-sahasra-śata-sambhrama-sevyamānaṁ... surabhīr abhipālayantam (Bs. 5.29). కాబట్టి భగవంతుడు నిరాకారుడు కాదు. అతను ఆవులను పాలిస్తున్నాడు, అతను వందల వేలది లక్ష్ములతో కూడివుంటాడు, అతని స్నేహితులు, అతని సామాగ్రి, అతని రాజ్యం, అతని ఇల్లు, ప్రతిదీ ఉంది. కాబట్టి నిరాకారత్వం అనే ప్రశ్నే లేదు.