TE/Prabhupada 0447 - దేవుడు గురించి కల్పనలు చేసుకొనేే అభక్తులతో కలవకూడదు జాగ్రత్తగా ఉండండి



Lecture on SB 7.9.2 -- Mayapur, February 12, 1977


మనం లక్ష్మి-నారాయణ యొక్క పాత్రను అధ్యయనం చేసినట్లైతే, అప్పుడు మనము దరిద్ర-నారాయణ లేదా ఇది లేదా అది, ఇటువంటి పదాలను తయారు చేయటం మానివేస్తాము. కాబట్టి మనము ఈ పాషండిని అనుసరించకూడదు.

yas tu nārāyaṇaṁ devaṁ
brahmārudrādi-daivataiḥ
samatvena vikṣeta
sa pāṣaṇḍi bhaved dhruvam
(CC Madhya 18.116)

పాషండి అంటే రాక్షసుడు, లేదా అభక్తుడు. Abhaktā hīna cara. దేవుడు_గురించి_కల్పనలు చేసుకొనేే_అభక్తులతో_కలవకూడదు_జాగ్రత్తగా_ఉండండి. వారు వాస్తవమునకు దేవుడిని నమ్మరు. ఈ పాషండి అంటే దేవుడుపై నమ్మకం లేనివారు. వారు దేవుడే లేరని నమ్ముతారు, కాని వారు చెప్తారు, అవును, దేవుడు ఉన్నాడు, కాని దేవునికి తల లేదు, తోక లేదు, నోరు లేదు, ఏమీ లేదు మరి అప్పుడు దేవుడు అంటే ఏమిటి? కాని ఈ మూర్ఖులు నిరాకారా అని చెప్తున్నారు. నిరాకారా అనగా దేవుడు లేడని అర్థం. దేవుడు లేడని కపటము లేకుండా చెప్పండి. మీరు ఎందుకు అంటున్నారు "అవును, దేవుడు ఉన్నాడు, కాని ఆయనకు తల లేదు, తోక లేదు, కాలు లేదు? కాబట్టి అక్కడున్నది ఏమిటి? కాబట్టి ఇది మరొక మోసం. నాస్తికుడిగా ఉన్నవారు, వారు కపటము లేకుండా చెప్తారు, "నాకు దేవుడు మీద నమ్మకం లేదు. అక్కడేమి లేదు..." అది మనము అర్థం చేసుకోగలము. కానీ, ఈ దుష్టులు, మూర్ఖులు వారు అంటారు "దేవుడు ఉన్నాడు, కాని నిరాకారా." నిరాకారా అనగా దేవుడు లేడని అర్థం, కాని కొన్నిసార్లు ఈ పదం నిరాకారం అని వాడబడుతుంది. కానీ నిరాకారం అంటే దేవుడికి ఏ ఆకారం లేదని కాదు. ఆ నిరాకారం అంటే అర్థం అది ఈ భౌతిక ఆకారం కాదు. Iśvaraḥ paramaḥ kṛṣṇah-sac-cid-ānanda vigrahaḥ (Bs. 5.1). ఆయన శరీరం సచ్చిదానంద sac-cid-ānanda. అది ఈ భౌతిక ప్రపంచం లోపల చూడడానికి పూర్తిగా అసాధ్యం. మన శరీరం సత్ కాదు; అది అసత్. నేను ఇప్పుడు కలిగి వున్న ఈ శరీరము లేదా మీరు పొందిన, ఇది ఈ ప్రాణము ఉన్నంత కాలము ఉంటుంది... మరియు ప్రాణము పోయినప్పుడు, ఇది శాశ్వతముగా సమాప్తమైపోతుంది. మీరు మళ్లీ ఈ శరీరాన్ని పొందరు. అందువలన అసత్.

అయితే కృష్ణుడి శరీరం అలాంటిది కాదు కృష్ణుడి శరీరం అదే, సత్; ఎల్లప్పుడూ అదే. కృష్ణుడు యొక్క మరొక నామము నరాకృతి. మన శరీరం కృష్ణుడి శరీరం యొక్క అనుకరణ, అంతే కాని కృష్ణుడి శరీరం మన శరీరం యొక్క అనుకరణ కాదు. కాదు. కృష్ణుడు తన శరీరమును కలిగి ఉన్నాడు, నరాకృతి, నర-వపు. ఈ విషయాలు అక్కడ ఉన్నాయి. కానీ ఆ వపు ఈ అసత్ వలె కాదు. మన శరీరం అసత్. ఇది ఉండదు. ఆయన శరీరం సత్- చిత్- ఆనందం. మన శరీరం అసత్ నిరానందం- కేవలం వ్యతిరేకం. ఇది ఉండదు, మరియు ఎటువంటి జ్ఞానం లేదు, అచిత్, మరియు అందులో ఏం ఆనందం లేదు. ఎల్లప్పుడూ మనము సంతోషంగా ఉండము. కాబట్టి నిరాకరా అంటే ఇటువంటి శరీరం అని కాదు. ఆయన శరీరం విభిన్నంగా ఉంటుంది. Ānanda cinmāyā rasa pratibhavitabhis (Bs. 5.37). ఆనంద చిన్మయ. Aṅgāni yasya sakalendriya vṛtti-manti paśyanti pānti kalayanti ciraṁ jaganti (Bs. 5.32). ఆయన అంగాని, అంగాని, శరీర భాగములు, సకలేంద్రియ-వృత్తి-మంతి అని వర్ణించబడ్డాయి. నేను నా కళ్ళతో చూడగలను. నా యొక్క, నా యొక్క ఈ ప్రత్యేక ధర్మం , శరీరం యొక్క ఈ భాగం చూడటానికి ఉంది. కానీ కృష్ణుడు: సకలేంద్రియ -వృత్తి-మంతి - ఆయన కేవలం చూడటమే కాదు, కానీ ఆయన తినగలడు కూడా. అది దాని అర్థము. చూడటం ద్వారా, మనము తినలేము, కానీ మనము అర్పించేది ఏదైనా, కృష్ణుడు చూస్తే ఆయన తింటాడు కూడా. Aṅgāni yasya sakalendriya-vṛtti-manti. కాబట్టి మన శరీరంతో కృష్ణుడి శరీరంను ఎలా పోల్చవచ్చు? కానీ avajānanti māṁ mūḍhāḥ ( BG 9.11) ఎవరైతే మూర్ఖులు ఉన్నారో, వారు అనుకుంటారు "కృష్ణుడికి రెండు చేతులు, రెండు కాళ్ళు వున్నాయని అందువలన నేను కూడా కృష్ణుడిని, నేను కూడా" కాబట్టి మూర్ఖులు, పాషండుల ద్వారా తప్పుదారినపడవద్దు. శాస్త్రంలో అక్కడున్నది తీసుకోండి, ప్రామాణికుల నుండి నేర్చుకోండి ఆనందంగా ఉండండి.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ శ్రీల ప్రభుపాద