TE/Prabhupada 0469 - నష్టపోయామా లేదా విజయవంతమైనామా, కృష్ణుడిపై ఆధారపడి ఉంటుంది. కానీ పోరాటం అక్కడ ఉండాలి



Lecture on SB 7.9.9 -- Mayapur, March 1, 1977


కాబట్టి మన ఉద్యమం ఆచరణాత్మక కార్యకలపాలపై ఆధారపడి ఉoది. నీవు ఏదైనా ప్రతిభను కలిగి ఉoటే, మీకు ఉన్న కొద్ది పాటి శక్తితో, మీకు ఉన్న విద్యతో ... మీరు దేనిని నేర్చుకోవలసిన అవసరము లేదు. మీ దగ్గర ఏమి ఉన్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు కృష్ణుడికి సేవ చేయవచ్చు. మీరు మొదట ఏమైనా నేర్చుకుని ఆ తరువాత మీరు సేవ చేయాలి అని కాదు ఈ సేవ చేయడమే నేర్చుకోవడం. మీరు ఎంత ఎక్కువ సేవ చేయడానికి ప్రయత్నిస్తే, మీరు అంత అభివృద్ధి చెందుతారు, ఎలా అనుభవజ్ఞుడైన సేవకుడు అవ్వాలి అనే దానిలో . మనకు ఏ అదనపు మేధస్సు అవసరం లేదు. లేకపోతే ... ఉదాహరణకు gaja-yūtha-pāya. ఏనుగు, ఏనుగుల రాజు, ఆయన సంతృప్తిగా ఉన్నాడు. ఆయన ఒక జంతువు. ఆయన ఒక బ్రాహ్మణుడు కాదు. ఆయన ఒక వేదాoతి కాదు. బహుశా చాలా గొప్ప, కొవ్వు గల జంతువు, (నవ్వులు) అయినప్పటికీ, ఆయన ఒక జంతువు. హనుమంతుడు జంతువు. అలాంటివి అనేక విషయలు ఉన్నా,యి. జఠాయువు ఒక పక్షి. ఎలా వారు సంతృప్తి పరిచారు? జఠాయువు రావణుడితో పోరాడారు. నిన్న మీరు చుశారు. రావణుడు సీతాదేవిని అపహరిస్తున్నాడు, పక్షి అయిన జఠాయువు, ఎగురుతూ వెళుతున్నాడు. రావణుడికి యంత్రం లేకుండా ఎగరడము ఏలానో తెలుసు. ఆయన చాలా, చాలా భౌతికముగా శక్తివంతమైనవాడు. అందువల్ల జఠాయువు ఆకాశంలో ఆయనపై దాడి చేశారు: "ఎవరు నీవు? నీవు సీతను తీసుకొనిపోతున్నావు. నేను నీతో యుద్ధం చేస్తాను." కాబట్టి రావణుడు చాలా శక్తివంతమైనవాడు. ఆయన జఠాయువును ఓడించాడు, కాని జఠాయువు పోరాడాడు. అది ఆయన సేవ. ఓడిపోయినా పర్వాలేదు. అదేవిధముగ, మనము పోరాడాలి. కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నవారితో, వారితో పోరాటంలో మన శక్తి కొలది మనము పోరాడాలి. మనము ఓడిపోయినా పట్టించుకోవలసిన అవసరము లేదు. ఆది కూడ సేవ. కృష్ణుడు సేవను చూస్తాడు. నష్టపోయామా లేదా విజయవంతమైనామా, కృష్ణుడిపై ఆధారపడి ఉంటుంది. కానీ పోరాటం అక్కడ ఉండాలి. Karmaṇy evādhikāras te mā phaleṣu kadācana ( BG 2.47) అది అర్థం. మీరు కృష్ణుడి కోసం నిజయితీగా, తెలివిగా పని చేయాలి, విజయమా లేదా ఓటమా, అది పట్టింపు లేదు. జఠాయువు రావణుడితో పోరాడటములో ఓడిపోయాడు. ఆయన రెక్కలు కత్తిరించబడ్డాయి. రావణుడు చాలా బలముగా ఉన్నాడు. భగవంతుడు రామచంద్రుడు, జఠాయువు తన భక్తుడు కనుక ఆతని అంత్యక్రియలను చేశారు. ఇది పద్ధతి, మనము అదనముగా ఏదో తెలుసుకోవాలి అని కాదు. మనకు ఎoత సామర్ధ్యం ఉన్నదో దానితో, భగవంతునికి సేవ చేయాలని నిర్ణయించుకుందాము. మీరు చాలా ధనికులు లేదా చాలా అందముగా ఉండాలి, చాలా శారీరకముగా బలముగా ఉండాలి. అటువంటిది ఏదీ లేదు. Sa vai puṁsāṁ paro dharmo yato bhaktir adhokṣaje ahaituky apratihatā ( SB 1.2.6) ఏ పరిస్థితిలో అయిన మీ భక్తియుక్త సేవ నిలిపివేయబడకూడదు. అది సూత్రం అయి ఉండాలి, మనము ఎట్టి పరిస్థితులలో ఆపము, ఎట్టి పరిస్థితులలో. కృష్ణుడు చిన్న పువ్వును, కొద్దిగా నీటిని కూడ స్వీకరించడానికి కూడా సిద్ధముగా ఉన్నారు. Patraṁ puṣpaṁ phalaṁ toyaṁ ( BG 9.26) ఆయన చెప్పలేదు, "నాకు చాలా విలాసవంతమైన , రుచికరమైన వంటకాలు ఇవ్వండి, అప్పుడు నేను చేస్తాను ..." ఆయన సంతృప్తి చెందుతారు. లేదు. వాస్తవమైన అవసరము భక్తి. Patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati. ఇది వాస్తవమైన అవసరం - bhaktyā. Bhaktyā mām abhijānāti yāvān yaś ca... ( BG 18.55)

అందువల్ల మనము మన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి, కృష్ణుడి మీద ప్రేమను . Premā pumartho mahān, చైతన్య మహాప్రభు సలహా ఇచ్చారు. ప్రజలు dharma artha-kama mokṣa, కోసము ఉన్నారు, కాని చైతన్య మహప్రభు అన్నారు, "కాదు, మీరు ముక్తిని పొందినప్పటికీ, మోక్షం, ఇది కృష్ణుడి అనుగ్రహమును పొందటానికి అర్హత కాదు. " Prema pumartho mahan. Pancama-puruṣartha. ప్రజలు చాలా ధర్మముగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అది మంచిది. అప్పుడు ఆర్థిక. ధర్మ అర్థ. అర్థ అంటే ఆర్థికముగా చాలా ధనవంతుడు, సంపన్నమైవాడు. అప్పుడు కామ, చాలా అనుభవజ్ఞుడు ఇంద్రియ తృప్తిలో. ఆపై ముక్తి. ఇది సాధారణ కోరిక. కాని భాగవతము చెప్పుతుంది, "కాదు, ఈ విషయాలు అర్హతలు కావు." Dharmaḥ projjhita-kaitavo 'tra ( SB 1.1.2)