TE/Prabhupada 0473 - డార్విన్ పరిణామ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనను,ఈ పద్మపురాణం నుండే స్వీకరించాడు



Lecture -- Seattle, October 7, 1968


డార్విన్ పరిణామ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనను ఈ పద్మపురాణం నుండే స్వీకరించాడు. మీరు ఏ తత్వము గానీ, ప్రపంచంలోని ఏ సిద్ధాంతం గానీ, వేద సాహిత్యంలో కనుగొనబడనిది అంటూ వుండదు. ఇది చాలా పరిపూర్ణమైనది,ఇందులో ప్రతిదీ ఉంది. కాబట్టి మానవ పరిణామ సిద్ధాంతం లేదా అంత్రోపాలజీ అని ఏదైతే పిలువబడుతోందో? డార్విన్ యొక్క ఆంత్రోపాలజీ పద్మపురాణములో ఉంది. అది చాలా చక్కగా వర్ణించబడింది. డార్విన్ విభిన్న రకాల జాతుల సంఖ్యను వివరించలేరు, కాని పద్మపురణం ప్రకారం, సముద్రంలో,నీటిలో 900,000 జీవజాతులు ఉన్నాయి. మరియు సముద్ర ఉపరితలాన, ఎప్పుడైతే సముద్రపు నీరు ఎండిపోయినప్పుడు, భూమి బయట పడుతుంది, వెంటనే వృక్షాలు మొదలవుతాయి. అప్పుడు వివిధరకాల మొక్కలు చెట్ల బయటకు వస్తాయి. కాబట్టి jalajā nava-lakṣāṇi sthāvarā lakṣa-viṁśati. రెండు మిలియన్లు, lakṣa-viṁśati, ఇరవై వందల వేల. అంటే రెండు మిలియన్లు? ఏమైనప్పటికీ ... Sthāvarā lakṣa. స్థావర అంటే చరించనివి అని అర్థం. వివిధ రకాల జీవజాతులు ఉన్నాయి. చెట్లు, మొక్కలు, అవి చరించలేవు. ఇతర రకాల జీవరాసులు, ఉదాహరణకు పక్షులు, జంతువులు, మానవులు, వారు చరించగలరు. కాబట్టి స్థావరాలు మరియు జంగమాలు. జంగమాలు అనగా చరించగలిగినవి, స్థావరాలు అనగా చరించలేనివి అని అర్థం. కొండలు, పర్వతాలు, అవి కూడ స్తావరాల జాతికి చెందినవి. అవి కూడ జీవజాతులే. అనేక కొండలు ఉన్నాయి, అవి పెరుగుతున్నాయి. అంటే వాటిలో జీవం ఉంది, కాని రాతి లాంటి తక్కువ దశలో వుంది. కాబట్టి ఈ విధముగా మనము పురోగతిని చెందుతున్నాము. Sthāvarā lakṣa-viṁśati kṛmayo rudra-saṅkhyakāḥ. సరీసృపాలు మరియు కీటకాలు. రుద్ర-సంఖ్యకాః అంటే పదకొండు లక్షలు. అటు తర్వాత సరీసృపాలు,కీటకాల నుండి, రెక్కలు పెరుగుతాయి - పక్షులు. రెక్కలు పెరిగినప్పుడు ... అప్పుడు దానినుండి పక్షి జాతి వస్తుంది. పక్షినాం దశ-లక్షాణాం: పక్షిజాతులు పదిలక్షలు వున్నాయి. ఆపైన పశవః త్రింశా-లక్షాణి, నాలుగు కాళ్ళ జంతువులు, అవి ముప్పై లక్షలు ఉన్నాయి. కాబట్టి తొమ్మిది మరియు ఇరవై,కలిపి ఇరవై తొమ్మిది,ఇంకో పదకొండు,మొత్తం నలభై. ఆ తర్వాత పది లక్షల పక్షి జాతులు,కలిపితే యాభై లక్షలు,వాటికి తోడు ముఫ్ఫై లక్షల జంతుజాతులు,అంతా కలిపితే ఎనభై.ఎనభై లక్షలు. అటుపై... ఎనిమిది మిలియన్లు - మరియు నాలుగు లక్షల మానవ జీవజాతులు. మానవ జీవజాతి గొప్ప పరిమాణంలో లేదు. అందులో కూడా, దాదాపు వారు అనాగరికులు, మరియు చాల కొద్ది మంది ఆర్యుల కుటుంబాలకు చెందినవారు. ఆర్య కుటుంబం - ఇండో-యూరోపియన్ కుటుంబం, వారు కూడ ఆర్యులే - వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఐరోపావాసులు, వారు ఇండో-యూరోపియన్ సమూహానికి చెందినవారు. అమెరికన్లు, వారు కూడా యూరప్ ప్రాంతానికి చెందినవారు. కాబట్టి మానవ సమాజం యొక్క ఈ సమూహం చాలా స్వల్పం గా ఉంది. ఇంకా ఇతర,అనాగరిక సమూహలు చాలా ఉన్నాయి. అందుచేత వేదాంతం ఇలా చెబుతోంది, అథ అథః: ఇప్పుడు మీరు పరిణతిచెందిన మానవ జీవితాన్ని ,అంటే నాగరిక జీవితాన్ని పొందారు, మీ సౌకర్యవంతమైన జీవితానికి కావలిసిన మంచి వసతులను పొందారు. ముఖ్యంగా అమెరికాలో సకల భౌతిక వసతులను మీరు కలిగివున్నారు. మీరు కార్లు కలిగివున్నారు, మీరు మంచి రహదారులు కలిగివున్నారు, మంచి ఆహరం, చక్కని భవంతి, చక్కని దుస్తులు, ఇంకా చక్కని శరీరక లక్షణాలను పొందివున్నారు. సమస్థాన్ని భగవంతుడు మీకు ఎంతో చక్కగా ఒసగాడు.