TE/Prabhupada 0484 - ప్రేమ, భావ యొక్క పరిపక్వత



Lecture -- Seattle, October 18, 1968


ప్రభుపాద: ఏమైన ప్రశ్నలు ఉన్నాయా?

జయ-గోపాల: భావ, ప్రేమకు మధ్య తేడా ఏమిటి?

ప్రభుపాద: ప్రేమ, భావ యొక్క పరిపక్వత. కేవలం పండిన మామిడి, ఆకుపచ్చ మామిడి వలె. పండిన మామిడికి కారణము పచ్చి మామిడి పండు . కాని పండిన మామిడిని రుచి చూడడము పండని మామిడి కంటే ఉత్తమము. అదేవిధముగా, భగవంతుని ప్రేమను పొందటానికి ముందు, మీకు వివిధ దశలు ఉన్నాయి. ఉదాహరణకు మామిడి మాదిరిగానే అది వివిధ దశలలో వస్తుంది, అప్పుడు ఒక రోజు అది మంచి పసుపు రంగు వస్తుంది, పూర్తిగా పండినది, మరియు రుచి చాలా బాగుంటుంది. అదే మామిడి. మామిడి మారదు, కాని అది పరిణితి దశకు వస్తుంది. ఈ ... ఉదాహరణ, మామిడి పండు ప్రారంభంలో ఒక పుష్పముగా ఉంటుంది, అప్పుడు క్రమంగా చిన్న పండు అవుతుంది. అప్పుడు క్రమంగా పెరుగుతుంది. అప్పుడు అది చాలా గట్టి పడుతుంది, ఆకుపచ్చగా ఉంటుంది, ఆపై, క్రమంగా, అది కొద్దిగా, కొద్దిగా పసుపుగా మారుతుంది, అది పూర్తిగా పండు అవుతుంది. ఇది ప్రతి దాని యొక్క పద్ధతి. భౌతిక ప్రపంచంలో కూడా, ఆరు పద్ధతులు ఉన్నాయి, చివరి పద్ధతి పతనమవ్వుట.

ఈ మామిడి ఉదాహరణ లేదా ఏదైనా ఇతర విషయము ఉదాహరణకు, మనకు పెరుగుదల అవసరం ఉన్నంత వరకు, కోరుకుంటున్నంత వరకు అంగీకరించాలి, కాని భౌతిక ఉదాహరణ సరైనది కాదు. కేవలం మామిడిలాగా, అది పండినప్పుడు, ఎవరో ఒక్కరు తింటారు, అది సరియైనది. లేకపోతే అది పండిపోతుంది , అది కుళ్ళి పోతుంది ఇది పడిపోతుంది, మరియు అంతమవుతుంది. అది భౌతికము. కాని ఆధ్యాత్మికం అలాంటిది కాదు. అది అంతమవ్వదు. మీరు ఒకసారి పరిపక్వ ప్రేమ దశకు వచ్చినప్పుడు, ఆ పరిపూర్ణ దశ నిరంతరం కొనసాగుతుంది, మీ జీవితం విజయవంతమవుతుంది. Premā pum-artho mahān. ఈ భౌతిక ప్రపంచంలో పరిపూర్ణము అనేక రకాలుగా ఉంటుంది. ఎవరో ఆలోచిస్తున్నారు, "ఇది జీవితం యొక్క పరిపూర్ణత" భౌతిక వ్యక్తులు, వారు ఆలోచిస్తున్నారు, "నేను నా ఇంద్రియాలను చక్కగా అనుభవిస్తే, అది జీవితము యొక్క పరిపూర్ణత. "ఇది వారి దృక్కోణం. వారు నిరాశగా ఉన్నప్పుడు, వారు కనుగొంటారు, లేదా కనుగొనేందుకు ప్రయత్నిస్తారు, ఏదో ఒక్కటి మంచిది. ఆయనకు మార్గనిర్దేశం లేకపోతే, మంచిది ఏమిటంటే - మైథున సుఖము మరియు మత్తు, అంతే. కేవలం బాధ్యతా రహితముగా ఉంటారు. అంతే. ఎందుకంటే మార్గనిర్దేశం చేసే వారు లేరు . ఆయన కనుగొంటున్నారు, ఏదైనా మంచి దాని కోసము శోధిస్తున్నాడు, కాని మార్గనిర్దేశం చేసే వారు లేరు కనుక ఆయన అదే భావముకు వస్తాడు లేదా మైథున సుఖము మరియు మత్తుకు - మర్చిపోవడానికి. ఒక వ్యాపారవేత్త, ఆయన వైఫల్యం చెందిన్నప్పుడు, చాలా గందరగోళం. త్రాగటం ద్వారా ఆయనను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని ఇది కృత్రిమ మార్గం. వాస్తవానికి ఇది పరిష్కారం కాదు. ఎంతకాలం మీరు మర్చిపోగలరు? నిద్ర - ఎంత కాలం మీరు నిద్రపోగలరు? మరలా మేల్కోవాలి, మళ్లీ మీరు అదే స్థితిలో ఉన్నారు. అది మార్గము కాదు. కాని మీరు భగవంతుని ప్రేమ దశకు వస్తే, అప్పుడు సహజంగా మీరు ఈ అర్థంలేనివి అన్నీ మర్చిపోతారు. సహజంగానే. Paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59) మీరు మరింత రుచికరమైనది, మరింత మధురమైనది ఏదైనా కనుగొంటే, మీరు ఈ అర్థంలేని విషయాలను వదిలివేస్తారు, ఏవైతే రుచిగా లేవో. కాబట్టి కృష్ణ చైతన్యము అటువంటి విషయము ఇది మిమ్మల్ని ఈ అర్థంలేని అన్నిటిని మర్చిపోయే ఒక ప్రామాణికతకు తీసుకు వెళ్ళుతుంది. అది వాస్తవమైన జీవితం. Brahma-bhūtaḥ prasannātmā ( BG 18.54) మీరు ఆ స్థితికి వచ్చిన వెంటనే, మీ లక్షణము ఏమిటంటే మీరు ఆనందముగా ఉంటారు. మీరు ప్రతిచోటా ఆనందమును అనుభవిస్తారు. ఒక... అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు కృష్ణుడి సంబంధములో ఈ భౌతిక ప్రపంచమును అంగీకరించినప్పుడు, మీరు ఈ భౌతిక ప్రపంచములో కూడా దేవుడి ప్రేమను రుచి చూస్తారు. వాస్తవమునకు, భౌతిక ప్రపంచము అంటే పూర్తిగా దేవుడిని లేదా కృష్ణుడిని మరచిపోవడము. అది భౌతిక ప్రపంచము లేకపోతే, మీరు కృష్ణ చైతన్యములో పూర్తిగా ఉంటే, మీరు ఆధ్యాత్మిక ప్రపంచం మాత్రమే చూస్తారు, ఈ భౌతిక ప్రపంచంలో కూడా. చైతన్యము - ఇది అంతా చైతన్యం. ఆదే ఉదాహరణ. ఉదాహరణకు రాజు మరియు నల్లి అదే సింహాసనంపై కూర్చుని ఉన్నట్లుగా, కాని నల్లికి తెలుసు "నా పని కేవలము కొంచెం రక్తం పొందడం." అంతే. నేను పాలించాల్సిన అవసరం ఉంది, నేను ఈ దేశం యొక్క పాలకుడిని అని రాజుకు తెలుసు. కావున ఒకే చోట కూర్చొని ఉన్నారు, కాని చైతన్యము భిన్నంగా ఉంటుంది. అదేవిధముగా, మీరు కృష్ణ చైతన్యమునకు మీ చైతన్యాన్ని మార్చుకుంటే, మీరు ఎక్కడ ఉన్నా, మీరు వైకుంఠములో ఉన్నట్లు. ఎక్కడ ఉన్నా, అది పట్టింపు లేదు.