TE/Prabhupada 0490 - తల్లి గర్భంలో చాలా నెలలు గాలి చొరబడని పరిస్థితిలో ఉన్నాము



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974


మునుపటి శ్లోకము లో, దీనిని వర్ణించారు dehino 'smin yathā dehe kaumāraṁ yauvanaṁ jarā: ( BG 2.13) మనము ఒక శరీరం నుండి మరొకదానికి వేరొక శరీరమునకు వెళ్ళుతున్నాము. ఎలాగైతే మనము పసి పిల్లవాడి శరీరం నుండి బాలుడి శరీరమునకు, బాలుడి శరీరం నుండి పసి పిల్లవాడి శరీరమునకు అదేవిధముగా, మనము ఈ శరీరము గుండా కూడా వెళ్ళుతున్నాము మరియు ఇంకొక శరీరాన్ని అంగీకరిస్తున్నాము." ఇప్పుడు, బాధ మరియు ఆనందపు ప్రశ్న. బాధ మరియు ఆనందం - శరీరం ప్రకారం. చాలా ధనిక వ్యక్తి కొంచెం సౌకర్యవంతంగా ఉంటాడు. సాధారణ బాధ అసంతృప్తి, ఇది సర్వసాధారణం. ఆ సాధారణ ఏమిటి? Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ( BG 13.9) ఒక కుక్కగా లేదా ఒక రాజుగా జన్మించినా, బాధ అనేది ఒక్కటే. తేడా ఏమిలేదు ఎందుకంటే, ఎందుకంటే కుక్క కూడా తానూ తల్లి గర్భంలో నుంచే వస్తుంది, చాలా నెలలు గాలి చొరబడని పరిస్థితిలో ఉండి, మనిషి, ఆయన రాజు లేదా ఏమైనా గాని, ఆయన కూడా ఆ కష్టమును తీసుకోవాలి. ఏ క్షమాపణ లేదు. మీరు రాజు కుటుంబంలో జన్మించడం వల్ల, ఇది వర్తించదు అని కాదు తల్లి యొక్క గర్భంలో ఇమిడి ఉండటము ఆ బాధ తక్కువా, మరియు ఎందుకంటే ఆయన ఒక కుక్క యొక్క తల్లి గర్భంలో జన్మిస్తుండటము వలన, అందువలన ఆయన జన్మ గొప్పది. కాదు. రెండు ఒక్కటే అదేవిధముగా, మరణ సమయంలో ... మరణ సమయంలో గొప్ప బాధ ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలేయడం చాలా కష్టముగా ఉంటుంది. బాధ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. ఆయన తట్టుకోలేక: "ఈ శరీరాన్ని ముగిస్తాను."

కాబట్టి ఎవరు ఈ శరీరమును వదలాలి అని కోరుకోరు, కాని బాధ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ శరీరమును బలవంతంగా వదిలి వేయవలసి వస్తుంది. దీనిని మరణం అంటారు. భగవద్గీతలో మీరు కనుగొంటారు, అది mṛtyuḥ sarva-haraś ca aham. కృష్ణుడు "నేను మరణం" అని చెబుతున్నాడు. మరణం యొక్క అర్థం ఏమిటి? మరణం అంటే "నేను ఆయన నుండి ప్రతిదీ తీసుకుంటాను. ముగుస్తుంది నేను తన శరీరాన్ని తీసుకుంటాను, నేను తన అనుబంధమును తీసుకుంటాను, తన దేశమును తీసుకుంటాను, నేను తన సమాజమును తీసుకుంటాను, నేను తన బ్యాంకు బ్యాలన్సు ను తీసుకుంటాను, అంతా ముగిసిపోతుంది. " Sarva-haraḥ. సర్వ అంటే ప్రతిదీ. అందరూ కూడబెట్టుకుంటారు గొప్ప బ్యాంకు నిలువను, గొప్ప ఇల్లు, గొప్ప కుటుంబం, గొప్ప మోటారు కారు ... కాని మరణంతో, ప్రతిదీ పూర్తవుతుంది. కాబట్టి అది గొప్ప బాధ. కొన్నిసార్లు వ్యక్తులు ఏడుస్తారు. మీరు మరణ సమయంలో కనుగొంటారు, కోమాలో, ఆయన కన్నులనుండి, కన్నీరు వస్తుంది ఆయన ఆలోచిస్తున్నాడు, "నేను చాలా చక్కగా చేశాను చాలా సౌకర్యవంతంగా జీవించడానికి, ఇప్పుడు నేను ప్రతిదీ కోల్పోతున్నాను. "గొప్ప బాధ. అలహాబాదులో ఒక స్నేహితుడు నాకు తెలుసు. ఆయన చాలా ధనికుడు. ఆయనకు కేవలం యాభై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి. అందువలన ఆయన అర్థిస్తున్నాడు, ఏడుస్తూ, డాక్టర్, డాక్టర్, మీరు నాకు కనీసం నాలుగు సంవత్సరాలు జీవించడానికి ఇవ్వగలరా? నేను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను. నేను దానిని పూర్తి చేయాలని కోరుకుoటున్నాను. " డాక్టర్ ఏమి చెయ్యగలరు? "ఇది సాధ్యం కాదు, సార్. మీరు బయటకు వెళ్ళక తప్పదు కాని ఈ మూర్ఖ ప్రజలు, వారికి తెలియదు. కాని మనము సహించాలి. మనము సహించాలి. ఇక్కడ సూచించబడింది, "మీరు ఈ భౌతిక శరీరం పొందారు కనుక, తల్లి గర్భంలోనే జీవించటాన్ని, మీరు సహించాలి" అప్పుడు బయటకు వస్తారు. అప్పుడు నేను మాట్లాడలేను. ఉదాహరణకు నేను చిన్న పిల్ల వాడను, ఒక పురుగు నన్ను కుడుతుంది అని అనుకుందాం. నేను చెప్పలేను "అమ్మ" - ఎందుకంటే ఆ సమయంలో నేను మాట్లాడలేను, "ఏదో నా వెనుక కుడుతుంది." నేను ఏడ్చేస్తాను, తల్లి ఆలోచిస్తుంది "పిల్లవాడు ఆకలితో ఉన్నాడు, వాడికి పాలు ఇస్తాను." (నవ్వు) ఇది ఎంత కష్టమో చూడండి ... నాకు ఏదో కావాలి, నేను వేరే ఏదో ఇవ్వబడ్డాను. అది సత్యము. ఎందుకు పిల్ల వాడు ఏడుస్తున్నాడు? వాడు అసౌకర్యంగా ఉన్నాడు. అప్పుడు, ఈ విధముగా, నేను పెరుగుతాను. అప్పుడు నేను పాఠశాలకు వెళ్లాలని అనుకోవడం లేదు. నేను పాఠశాలకు బలవంతముగా పంపబడుతాను. అవును. కనీసం, నేను ఆ విధముగా ఉన్నాను (నవ్వు) నాకు పాఠశాలకు ఎన్నడూ వెళ్లాలని ఉండేది కాదు. నా తండ్రి చాలా దయ కలిగి ఉన్నారు. అది సరే. ఎందుకు నీవు పాఠశాలకు వెళ్ళడం లేదు? నేను చెప్పేవాడిని "నేను రేపు వెళ్తాను". "అయితే సరే." కాని నా తల్లి చాలా జాగ్రత్తగా ఉండేది. బహుశా నా తల్లి కొంచెము కఠినంగా ఉండకపోతే, నేను ఎటువంటి విద్యను సంపాదించేవాడిని కాదు. నా తండ్రి చాలా సున్నితమైనవాడు. కాబట్టి ఆమె నన్ను బలవంతంగా పంపేది. ఒక వ్యక్తి నన్ను పాఠశాలకు తీసుకువెళ్లేవాడు. వాస్తవమునకు, పిల్లలు పాఠశాలకు వెళ్లాలని కోరుకోరు. వారు ఆడుకోవటానికి ఇష్టపడతారు. పిల్లల ఇష్టానికి వ్యతిరేకముగా, ఆయన పాఠశాలకు వెళ్ళవలసి ఉంటు౦ది. అప్పుడు పాఠశాలకు వెళ్ళడమే కాదు, తరువాత అక్కడ పరీక్ష ఉంటుంది