TE/Prabhupada 0519 - కృష్ణ చైతన్యము ఉన్న వ్యక్తులు, వారు అసాధ్యమైన, అవాస్తవమైన వాటి కొరకు కాదు



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుని యొక్క స్వభావం ఏమిటి? అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు భగవంతుడు లేడని కొందరు చెప్తారు, భగవంతుడు చనిపోయినట్లు కొందరు చెప్తారు. ఇవి అన్ని సందేహాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ కృష్ణుడు అన్నాడు అసంశయ అన్నాడు. మీరు నిస్సందేహంగా ఉంటారు. మీరు అనుభూతి చెందుతారు, మీరు సంపూర్ణముగా తెలుసుకుంటారు, అక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఆయన అన్ని శక్తులకు మూలం. ఆయన భగవంతుడు, మొదటి వాడు. ఈ విషయాలు మీరు ఏ సందేహం లేకుండా నేర్చుకుంటారు. మొదటి విషయము, మనము ఆధ్యాత్మిక జ్ఞానం లో పురోగతి చెందడము లేదు, సందేహాముల వలన, సంశయః. ఈ సందేహాలు వాస్తవ జ్ఞానమును తెలుసుకోవడము ద్వారా తొలగించబడతాయి, నిజమైన సాంగత్యము ద్వారా, నిజమైన పద్ధతులను అనుసరించడం ద్వారా, సందేహాలను తొలగించవచ్చు. కాబట్టి కృష్ణ చైతన్యము ఉన్న వ్యక్తులు, వారు అసాధ్యమైన, అవాస్తవమైన వాటి కొరకు కాదు. కాదు వారు నిజానికి భగవంతుని కోసము పురోగతి సాధిస్తున్నారు.

ఇది బ్రహ్మ సంహితలో చెప్పబడింది, cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-lakṣāvṛteṣu surabhīr abhipālayantam (Bs. 5.29). చింతామణి ధామము, గోలోక వృందావనం అని పిలువబడే ఒక లోకము ఉంది. కాబట్టి ఆ ధామములో... ఇది భగవద్గీతలో చెప్పబడినట్లుగా, మద్ ధామ. ధామ అంటే తన నివాసం. కృష్ణుడు ఇలా అంటున్నాడు, "నాకు నా నిర్దిష్టమైన ధామము ఉంది" ఎలా మనము తిరస్కరించవచ్చు? ఆ నివాసం ఎలా ఉంది? ఇది కూడా భగవద్గీతలో మరియు అనేక ఇతర వేదముల సాహిత్యములలో వివరించబడింది. Yad gatvā na nivartante tad dhāma paramaṁ mama ( BG 15.6) ఇక్కడ, ఏ ధామము, మీరు వెళ్ళే ఏ లోకమైనా... అయితే... స్పుత్నిక్ ద్వారా కాదు, సహజ జన్మ ద్వారా కూడా. మీరు వెళ్ళే ఏ లోకమైనా... ఉదాహరణకు మనము ఈ లోకములో ఉన్నట్టుగానే. కానీ మనము ఈ లోకము నుండి తిరిగి వెళ్ళాలి. మీరు ఇక్కడ ఉండడానికి అనుమతించబడరు. మీరు అమెరికన్లు, అది సరైనది; కానీ ఎంతకాలం మీరు అమెరికన్గా ఉంటారు? ఈ ప్రజలు, వారు అర్థము చేసుకోరు. మీరు మరొక ప్రదేశమునకు, ఇతర గ్రహాలల్లోకి తిరిగి వెళ్లాలి. కాదు, నేను ఇక్కడే ఉంటాను, నేను నా వీసా లేదా నేను నా శాశ్వత పౌరసత్వాన్ని కలిగి వున్నాను అని మీరు చెప్పలేరు. లేదు ఇది అనుమతించబడదు. ఒక రోజు మరణం వస్తుంది, "దయచేసి నిష్క్రమించండి." లేదు, సర్, నాకు చాలా పనులు ఉన్నాయి. "లేదు మీ పనులన్నిటిని వదిలేయండి, వచ్చేయండి. మీరు చూడండి? కానీ మీరు కృష్ణ లోకమునకు వెళితే, కృష్ణుడు ఇలా చెబుతున్నాడు, yad gatvā na nivartante, మీరు తిరిగి రావలసిన అవసరము లేదు Yad gatvā na nivartante tad dhāma paramaṁ mama ( BG 15.6)

ఇది కూడా కృష్ణుడి ధామము, ఎందుకనగా ప్రతిదీ భగవంతునికి, కృష్ణునికి చెందుతుంది. ఎవరూ యజమాని కాదు ఈ వాదన "ఈ భూమి, అమెరికా మాకు చెందుతుంది, యునైటెడ్ స్టేట్స్," ఇది తప్పుడు వాదన. ఇది మీకు చెందదు, ఎవరికీ చెందదు కొన్ని సంవత్సరాల క్రితము, నాలుగు వందల సంవత్సరాల క్రితము, అది భారతీయులకు, రెడ్ ఇండియన్స్ కు చెందుతుంది, ఏదో ఒక విధముగా, మీరు ఇప్పుడు ఆక్రమించారు ఇతరులు ఇక్కడకు వచ్చి ఆక్రమించరని ఎవరు చెప్పగలరు? కాబట్టి ఇవి అన్ని తప్పుడు వాదనలు, వాస్తవానికి, ప్రతిదీ కృష్ణుడికి చెందుతుంది. కృష్ణుడు చెప్తాడు sarva-loka-maheśvaram ( BG 5.29) నేను అన్ని లోకముల యొక్క మహోన్నతమైన యజమాని, నియంత్రికుడిని, అన్ని లోకములకు. అందువల్ల ప్రతిదీ ఆయనకు చెందుతుంది. కానీ కృష్ణుడు ప్రతిదీ ఆయనకు చెందుతుంది అని చెప్తారు. అందువల్ల ప్రతిదీ ఆయన ధామము, ఆయన నివాసము, ఆయన ఇల్లు. ఎందుకు మనము ఇక్కడ మారాలి? కానీ ఆయన yad gatvā na nivartante tad dhāma paramam ( BG 15.6) చెప్తాడు