TE/Prabhupada 0528 - రాధారాణి కృష్ణుడి యొక్క ఆనంద శక్తి



Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971


నేడు రాధాష్టమి, శ్రీమతి రాధారాణి ఆవిర్భవించిన రోజు కృష్ణుడు జన్మించిన పదిహేను రోజుల తరువాత, రాధారాణి ఆవిర్భవించినది. (విరామం) రాధారాణి కృష్ణుడి యొక్క ఆనంద శక్తి. Rādhā-kṛṣṇa-praṇaya-vikṛtir hlādinī-śaktiḥ. భగవంతుడు, దేవాదిదేవునికి చాలా రకాల శక్తులు ఉన్నాయి, ఇది వేదముల సాహిత్యంలో ధృవీకరించబడింది. Parāsya śaktir vividhaiva śruyate ( CC Madhya 13.65) భాష్యము. Na tasya kāryaṁ karaṇaṁ ca vidyate. దేవాదిదేవుడికి వ్యక్తిగతంగా చేయడానికి ఏమీ లేదు. Na tasya kāryam. ఆయనకు చేయడానికి ఏమీ లేదు. ఉదాహరణకు ఈ భౌతిక ప్రపంచంలోనే మనము చాలా గొప్ప మనిషిని చూస్తాము రాజకీయ నాయకుడు లేదా వ్యాపార నాయకుడు; వ్యక్తిగతంగా, ఆయన చేయవలసినది ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకి చాలా మంది సహాయకులు, కార్యదర్శులు ఉంటారు , వ్యక్తిగతంగా ఆయనకు చేయడానికి ఏమీ ఉండదు. అదేవిధముగా, దేవాదిదేవుడు, పూర్తిగా ఆరు విభూతులతో ఉంటారు, ఎందుకు ఆయన ఏదో చేయవలసి ఉంటుంది? లేదు. ఆయనకు అనేక సహాయకులు ఉన్నారు. Sarvataḥ pāṇi-pādas tat. భగవద్గీతలో: "ఆయన ప్రతిచోటా, ఆయన చేతులు కాళ్ళు కలిగి ఉన్నాడు." మీరు కృష్ణుడిని కనుగొంటారు, ఆయనకు చేయడానికి ఏమీ ఉండదు. కేవలం ఆయన గోపీకలు మరియు రాధారాణితో ఆనందములో నిమగ్నమయ్యాడు. ఆయన రాక్షసులను చంపడములో నిమగ్నమై లేడు. కృష్ణుడు రాక్షసులను చంపినప్పుడు, ఆయన వాసుదేవ కృష్ణుడు; ఆయన వాస్తవ కృష్ణుడు కాదు. కృష్ణుడు తనను తాను విస్తరిoచుకుంటాడు. మొదటి విస్తరణ బలదేవ. బలదేవుని నుండి - సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ద, వాసుదేవ. అందుచే వాసుదేవునిగా ఆయన మధుర మరియు ద్వారకలో లీలలు చేస్తాడు. కాని కృష్ణుడు ఆయన వాస్తవ లక్షణంలో, ఆయన వృందావనములో ఉంటాడు. బెంగాల్ లోని గొప్ప కల్పనా రచయితలలో ఒకరు బంకించంద్ర ఛటర్జీ, ఆయన కృష్ణుడిని తప్పుగా అర్థం చేసుకున్నాడు, వ్రందావన యొక్క కృష్ణుడు, ద్వారకా కృష్ణుడు, మరియు మధురా కృష్ణుడు, వారు వేర్వేరు వ్యక్తులు అని కృష్ణుడు ఒక్కరే, కాని ఆయన మిలియన్లు ట్రిలియన్ల రూపాల్లో తనను తాను విస్తరించవచ్చు. Advaitam acyutam anādim ananta-rūpam ādyaṁ purāṇa-puruṣam (Bs. 5.33). అద్వైత. అనంత-రూపము అయినప్పటికీ, ఇప్పటికీ, అతడు ādyaṁ purāṇa-puruṣam, advaita. అటువoటి వ్యత్యాసం లేదు.

కాబట్టి ఈ కృష్ణుడు, ఆయన ఆనందించాలని కోరుకున్నప్పుడు, ఆయన ఏ విధమైన ఆనందం కలిగి ఉంటాడు? ఇది శ్రీ జీవ గోస్వామిచే చర్చించబడింది. కృష్ణుడు Paraṁ Brahman. Brahman, Paramātmā, then Paraṁ Brahman. సంపూర్ణ వాస్తవము, మూడు వేర్వేరు లక్షణాలు. కొంత మంది పరమ సత్యమును నిరాకార బ్రహ్మణ్ గా సాక్షాత్కారము పొందుతున్నారు. జ్ఞానులు, సంపూర్ణ సత్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు, మానసిక కల్పన ద్వారా, తన సొంత జ్ఞానం ద్వారా, ఆయన పరమ సత్యమును నిరాకార బ్రహ్మణ్ గా సాక్షాత్కారము పొందుతున్నారు. ధ్యానం, యోగము ద్వారా పరమ సత్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు, పరమ సత్యమును వారు పరమాత్మగా సాక్షాత్కారము పొందుతున్నారు. పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడై ఉన్నాడు. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61) ఆ లక్షణము, పరమాత్మ లక్షణము. Aṇḍantara-sthaṁ paramānu-cayāntara-sthaṁ govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. ఆ పరమాత్మ లక్షణం కృష్ణుడి యొక్క ఒక్క విస్తరణ. ఇది భగవద్గీతలో చెప్పబడింది,athavā bahunaitena kiṁ jñātena tavārjuna ekāṁṣena viṣṭabhyāham. Ekāṁṣena. కృష్ణుడు మరియు అర్జునుడు, కృష్ణుడి యొక్క వివిధ శక్తుల ఉనికి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అందువలన ఆయన పదవ అధ్యాయంలో వివరించారు, "నేను ఇది. వాటిలో, నేను ఇది. వాటిలో... "ఆ విధముగా ఆయన ముగించాడు "నేను ఎంత వరకు వెళ్ళవలెను ? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుట ఉత్తమము, కేవలము నాలో ఒక్క స్వాoశ భాగము, ఈ విశ్వంలో ప్రవేశించడం ద్వారా, మొత్తం దృశ్యజగత్తు వ్యక్తమవుతుంది. " Ekāṁṣena sthito jagat ( BG 10.42) జగత్. ఈ భౌతిక ప్రపంచం కృష్ణుడి యొక్క ఒకే ఒక్క స్వాoశ భాగం మీద ఉంటుంది. కృష్ణుడు ప్రవేశిస్తాడు, aṇḍāntara-sthaṁ paramānu-cayāntara-stham, ఆయన ఈ విశ్వంలో ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశించకుండా, ఈ విశ్వం వ్యక్తమవ్వదు. ఉదాహరణకు ఈ శరీరము లోపల ఆత్మ ప్రవేశించకుండా , ఈ శరీరము జీవిoచి ఉండదు. ఆత్మ వెలుపలికి వెళ్ళిన వెంటనే , వెంటనే శరీరం పనికిరానిది అవ్వుతుంది. ఏదేమైనా, శరీరము ప్రధానమంత్రి కావచ్చు లేదా ఏమైనా కావచ్చు, ఆత్మ ఈ శరీరం నుండి వెలుపలికి వచ్చిన వెంటనే, అది ఒక పైసా కూడా విలువ చేయదు. అదేవిధముగా, ఈ విశ్వంలో కృష్ణుడు ప్రవేశిoచి నందు వలన, అందుచే విశ్వం విలువను కలిగి ఉన్నది. లేకపోతే అది కేవలం పదార్ధపు ముద్ద; దానికి విలువ లేదు. Ekāṁṣena sthito jagat