TE/Prabhupada 0563 - కుక్కకు ఒక చెడ్డ పేరు ఇచ్చి మరియు దానిని ఉరి తీయండి



Press Interview -- December 30, 1968, Los Angeles


విలేఖరి: నన్ను అడగనివ్వండి... నాకు నా అభిప్రాయం ఉంది, కానీ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు ఏమి అనుకుంటున్నారు నేటి యువత ఎందుకు తూర్పు ఆధారిత ధర్మముల వైపు మరింత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు?

ప్రభుపాద: ఎందుకంటే మీరు వారిని సంతృప్తి పరచడంలో విఫలమయ్యారు.

విలేఖరి: మీరు ఏమి చెప్తున్నారు?

ప్రభుపాద: మీరు వారిని సంతృప్తి పరచడంలో విఫలమయ్యారు. మీ ఈ భౌతిక జీవన విధానం వారిని ఇక సంతృప్తి పరచదు. ఒక దశలో, ప్రారంభంలో, పేదరికములో ఉన్నప్పుడు ఆయన "డబ్బు మరియు స్త్రీ మరియు మంచి ఇంటిని గురించి ఆలోచించవచ్చు, మంచి కారు, నాకు సంతృప్తి ఇవ్వగలదు. "వారు వీటి కొరకు ప్రయత్నిస్తారు కానీ ఆ ఆనందం తర్వాత, వారు చూస్తారు", ఏ సంతృప్తి లేదు." ఎందుకంటే పదార్థము మీకు సంతృప్తి ఇవ్వదు. కాబట్టి మీ పరిస్థితి, ముఖ్యంగా అమెరికాలో, మీకు ఆనందం కోసం తగినంత ఉన్నాయి. మీకు తగినంత ఆహారం ఉంది, మీకు తగినంతమంది స్త్రీలు ఉన్నారు, మీకు తగినంత వైన్ ఉంది, మీకు తగినంత ఇల్లు ఉంది - ప్రతిదీ తగినంత. ఇది చూపిస్తుంది భౌతికసంతృప్తి ఒకరికి సంతృప్తి ఇవ్వదు అని. భారతదేశం కన్నా మీ దేశంలో గందరగోళం మరియు అసంతృప్తి ఎక్కువగా ఉంది, అది పేదరికములో ఉన్నది అని చెప్పబడుతున్నది. మీరు చూడండి? కానీ మీరు ఇప్పటికీ భారతదేశంలోనే చూస్తారు, అయితే వారు పేదరికంతో బాధపడుతున్నప్పటికి, ఎందుకంటే వారు పాత సంస్కృతిని కొనసాగిస్తున్నారు కనుక, వారు కలవరపడరు. అవును. వారు నెమ్మదిగా చనిపోతున్నారు, కానీ వారు సంతృప్తిగా చెందివున్నారు. "అయితే సరే." మీరు చూడండి? ఎందుకు? ఎందుకంటే వారు కొంత రవ్వంత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకోవాలి. అది వారికి సంతోషమును ఇస్తుంది. ఏ ఆశ లేదు. ఈ ప్రజలు అందరూ, వారు చీకటిలో ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు. వారికి లక్ష్యము లేదు. కానీ మీరు ఆధ్యాత్మికంగా ఉన్నపుడు, నీవు ఏమి చేస్తున్నావు, నీవు ఎక్కడికి వెళ్తున్నావు, నీ భవిష్యత్తు ఏమిటి అని నీకు తెలుసు? అంతా స్పష్టంగా ఉంది. మీరు చూడండి?

విలేఖరి: నేను దీని పైన క్లుప్తంగా చెప్తాను. మరో మాటలో చెప్పాలంటే, మీరు అనుకుంటున్నారు పాశ్చాత్య-ఆధారిత చర్చి, అది ఒక యూదుల ప్రార్థన ప్రదేశము లేదా ఒక చర్చి కావచ్చు, ప్రస్తుతము విఫలమైంది... మీరు వారి సందేశము ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా లేదని లేదా వారి సందేశాన్ని సరిగా ప్రచారము చేయడములో విఫలమయ్యారని మీరు చెబుతున్నారా?

ప్రభుపాద: కాదు. విషయము ఏమిటంటే ఈ పాశ్చాత్య చర్చిలు, ఉదాహరణకు క్రైస్తవ ధర్మము వలె, ఈ సువార్తలు మాట్లాడబడే ఎంతో కాలము నుండి పురాతన మనిషికి, మీరు చూడండి? జెరూసలేం. ఈ ప్రజలు ఎడారిలో నివసిస్తున్నారు, వారు చాలా అధునాతనంగా లేరు. కాబట్టి ఆ సమయంలో... అయితే, బైబిల్లో లేదా పాత నిబంధనలో, భగవంతుడు ఉన్నాడు అనే భావన, ఆలోచన ఉంది, అది అంతా మంచిది. కానీ వారు... ఉదాహరణకు ఈ ప్రకటన లాగా, "భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు." అది వాస్తవము. ఇప్పుడు ఆ వ్యక్తులకు వాటిలో పురోగతి చెందని వారు... ఇప్పుడు, ప్రస్తుత సమయంలో, ప్రజలు శాస్త్రీయంగా అభివృద్ధి చెందినారు. సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవాలని వారు కోరుకుంటున్నారు. మీరు చూడండి? ఆ వివరణ అక్కడ లేదు, చర్చి కూడా వారికి ఇవ్వలేదు. మీరు చూడండి. అందువలన వారు సంతృప్తి చెందలేదు. కేవలం అధికారికముగా చర్చికి వెళ్ళటము మరియు ప్రార్థన చేయటము, వారికి నచ్చడము లేదు. దానితో పాటు, ఆచరణాత్మకంగా, వారు మతపరమైన సూత్రాలను పాటించరు. పాత నిబంధనలో ఉన్నట్లుగా, నేను చెప్పేది, పది కమాండ్మెంట్స్, శాసనాలు, నిబంధనలు "నీవు చంపకూడదు" అని కమాండ్మెంట్ ఉంది. కానీ క్రిస్టియన్ ప్రపంచంలో చంపే వ్యవహారం చాలా ప్రముఖమైనది. వారు చాలా తరచుగా కబేళాను నిర్వహిస్తున్నారు, వారు జంతువులు ఆత్మను కలిగి ఉండవని, అవి అనుభూతి చెందవని ఒక సిద్ధాంతమును తయారు చేశారు, - ఎందుకంటే వారు చంపవలసి ఉంటుంది. "కుక్కకు ఒక చెడ్డ పేరు ఇచ్చి మరియు దానిని ఉరి తీయండి." జంతువు ఎందుకు అనుభూతి చెందదు? ఎందుకు మీరు ఈ పాపములను చేస్తున్నారు? కాబట్టి పూజారి తరగతి వారు, వారు కూడా చెప్పరు, వారు చర్చించరు, ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా, పది కమాండ్మెంట్స్ కు అవిధేయత చూపిస్తున్నారు. కాబట్టి మత సూత్రం ఎక్కడ ఉంది? మీరు మీ గ్రంథం యొక్క సూత్రాలను అంగీకరించకపోతే అంటే మీరు మీ మతాన్ని చక్కగా అనుసరిస్తున్నారని దీని అర్థమా? మీరు సృష్టించలేనిది ఎలా మీరు చంపుతారు? అది స్పష్టంగా పేర్కొనబడినది, "నీవు చంప కూడదు." జవాబు ఏమిటి? ఎందుకు చంపుతున్నారు? జవాబు ఏమిటి? మీరు ఎలా సమాధానము ఇస్తారు?

విలేఖరి: మీరు నన్ను అడుగుతున్నారా?

ప్రభుపాద: అవును.

విలేఖరి: సరే, అవును, స్పష్టంగా ఉంది "నీవు చంపకూడదు" అనేది ఒక సూత్రము అది సనాతనమైనది మరియు ఇది సరి అయినది, కానీ మనిషి వాస్తవమునకు దీని యందు ఆసక్తి కలిగి లేడు...

ప్రభుపాద: వారు ధర్మము పట్ల ఆసక్తి కలిగి లేరు. ఇది కేవలం నటించడము, చూపెట్టుకోవడము కోసము. అప్పుడు వారు ఎలా ఆనందముగా ఉంటారు? మీరు నియమ నిబంధనలను పాటించకపోతే, అప్పుడు మీ ధర్మము ఎక్కడ ఉంది?

విలేఖరి: నేను మీతో వాదించటం లేదు. నేను మీతో పూర్తిగా అంగీకరిస్తున్నాను నేను మొత్తం అంగీకారములో ఉన్నాను. ఇది ఏ మాత్రము సరి అయినది కాదు. "నీవు చంప కూడదు" నీవు నా యెదుట ఏ ఇతర భగవంతుళ్లను పూజించకూడదు, నీవు నీ పొరుగువాని గాడిద కొరకు ఆశపెట్టుకొనకూడదు. నీ తండ్రిని మరియు నీ తల్లిని గౌరవించు, అవి సుందరమైన ధర్మములు, కానీ వాటిని కుడా పాటించరు

ప్రభుపాద: "నీ పొరుగువాని భార్యను నీవు అపహరించకూడదు."

విలేఖరి: భార్యను, ఆశించ కూడదు.

ప్రభుపాద: కాబట్టి ఎవరు అనుసరిస్తున్నారు?

విలేఖరి: ఎవరూ అనుసరించడము లేదు. చాలా కొద్ది మంది మాత్రమే.

ప్రభుపాద: మీరు చూడండి? కాబట్టి వారు ధర్మముగా ఉన్నారని మీరు ఎలా ఆశిస్తారు. ధర్మము లేకుండా, మానవ సమాజం జంతు సమాజం.

విలేఖరి: సరే, కానీ ఈ విషయాన్ని నన్ను అడగనివ్వండి. ఈ క్రమములోనే...

ఇప్పుడు నేను మిమ్మల్ని అడగటం లేదు...

ప్రభుపాద: దానిని తీసుకోండి. తీసుకోండి. విలేఖరి: ధన్యవాదాలు