TE/Prabhupada 0565 - నేను వారికి ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో శిక్షణ ఇస్తున్నాను



Press Interview -- December 30, 1968, Los Angeles


విలేఖరి: నన్ను మిమ్మల్ని కొన్నివిషయాలు అడగనివ్వండి అది మనము ఇటీవలే పెద్ద ఎత్తున చూసాము మనము పిల్లల కోసం యువత ఉపభాగము ప్రారంభించాము. మరియు వాటిలో చాలా ముఖ్యమైనది... నేను ఏమి చెప్పాలి? మనుషుల మధ్య బహుశా అతి గొప్ప విరోధం కలిగించే నిర్దిష్టమైన విషయం, లేదా కనీసం అమెరికన్ పురుషుల మరియు స్త్రీల యొక్క దేవుని ప్రేమ లేదా పది ఆజ్ఞలు పాటించడము, సమస్య, నేను ఎలా ఇది వివరించాలి, సరే, లైంగిక సమస్య. మాకు ఈ దేశంలో నేర్పినారు, మాకు ప్యూరిటన్ నేపధ్యం ఉంది. అది మైథునం చెడ్డ విషయం. నేను భావిస్తున్నాను, మనం ఆశాజనకంగా మనము దాని నుండి బయటకు పడుతున్నాము, కానీ, యువకులు ఎప్పుడైతే, ఒక మనిషి యవ్వన వయస్సు చేరుకుంటే... ఇక్కడ ఈ దేశంలో ఇతర దేశాల నుండి నాకు తెలియదు. అతనికి ఒక భయంకరమైన, స్పష్టంగా ఒక భయంకరమైన సమస్య ప్రారంభమవుతుంది. ఇప్పుడు చెప్పే విషయము అది స్పష్టంగా ఉంది. మనమందరము దీనిని అనుభవించాము.

ప్రభుపాద: అవును, ప్రతిఒక్కరూ.

విలేఖరి: కానీ అది పశ్చిమ చర్చిలకు ఇది అసాధ్యం అని అనిపిస్తుంది యువకులకు ఏదైనా ఇవ్వడానికి పాటించడము ద్వారా అది వారు అర్థం చేసుకోవడానికి మొదటిది వారు ఏమి అనుభూతి పొందుతున్నారో అది ఒక సాధారణ అందమైన విషయం, రెండవది, ఎలా దానిని అధిగమించాలి. మరియు పాశ్చాత్య సంస్కృతిలో ఏమీ లేదు అది బోధించటానికి లేదా ఈ సమస్యను అధిగమించడానికి ఒక యువకునికి సహాయం పడటానికి, ఇది చాలా కష్టమైన సమస్య. మరియు నేను దాని గుండా వెళ్ళాను. మనము అందరము వెళ్ళాము. ఇప్పుడు మీరు మీ సందేశములో, యువకులకు ఏదైనా పాటించడానికి ఇవ్వండి...

ప్రభుపాద: అవును.

విలేఖరి: ... పాటించడానికి, అలా అయితే అది ఏమిటి, ఏమిటి?

ప్రభుపాద: అవును. అవును నేను ఇస్తాను.

విలేఖరి: ఏమిటి?

ప్రభుపాద: నేను నా శిష్యులందరిని వివాహం చేసుకోమని అడుగుతాను. ఈ అబ్బాయిలను ప్రియుడు, ప్రియురాలుతో నివసించడానికి నేను అనుమతించను. లేదు మీరే తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకోవాలి, గొప్ప వ్యక్తి వలె నివసించాలి, మీ భార్యను సహాయకురాలిగా చూడండి, మీ భర్తని మీ జాగ్రత్త, అవసరాలు చూసుకునేవారుగా పరిగణించండి. ఈ విధముగా, నేను వారికి బోధిస్తున్నాను. ఈ అబ్బాయి కేవలం నాలుగు రోజుల ముందు వివాహం చేసుకున్నాడు. ఆయన ప్రొఫెసర్. కాబట్టి నా శిష్యులలో చాలా మందికి పెళ్లి చేయించాను, వారు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఈ అమ్మాయికి వివాహమైనది. గతంలో, వారు స్నేహితురాలు, ప్రియుడు తో నివసిస్తున్నారు. నేను దానిని అనుమతించను. నేను దానిని అనుమతించను.

విలేఖరి: సరే, ఇంకా... నేను మరికొంత ప్రాథమిక స్థాయిలో మాట్లాడుతాను. పద్నాలుగు, పదిహేను, పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా?

ప్రభుపాద: అదే విషయం. వాస్తవానికి, మరొక విషయం ఏమిటంటే,మన అబ్బాయిలను బ్రహ్మచారి అవ్వాలని బోధిస్తాం. బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్య జీవితాన్ని ఎలా గడపాలి.

విలేఖరి: హమ్?

ప్రభుపాద:ఉదాహరణ, హోవార్డ్, బ్రహ్మచారి జీవితాన్ని వివరించండి.

విలేఖరి: అవును, నేను అర్థం చేసుకున్నాను.

హయగ్రీవ: సరే, ఇది ఇంద్రియాలను నియంత్రిస్తుంది మరియు ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో ఆయన మాకు బోధిస్తాడు. సాధారణంగా, ఒక అబ్బాయికి 22, 23, 25 వరకు వివాహం జరగదు.

విలేఖరి: మీరన్నది ఆయన సంస్కృతిలోనా.

ప్రభుపాద: అవును. మేము 16, 17 ఏళ్ళ వయస్సు గల అమ్మాయిని , 24 సంవత్సరాల వయస్సు మించకుండా ఉన్న అబ్బాయిని ఎంచుకుంటాము . నేను వారికి పెళ్లి చేయిస్తాను. మీరు చూడండి? వారి దృష్టిని కృష్ణ చైతన్యముకు మళ్లించటం వలన, వారు మైథునజీవితం పట్ల చాలా తక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. మీరు చూడండి? వారికి ఉన్నత విషయంలో నిమగ్నత లభించింది. Paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59) మీరు చూడండి? మనము ప్రత్యామ్నాయం ఇస్తాము. మేము కేవలం "మీరు దీనిని చేయకూడదు" అని చెప్పము, కాని మేము ఉన్నతమైనది ఇస్తాము. మీరు చూడండి? అప్పుడు సహజముగా "వద్దు" సహజముగా వస్తుంది. మీరు చూడండి?

విలేఖరి: సరైన సమయంలో.

ప్రభుపాద: వెంటనే. మేము ఏదైనా ఉన్నత విషయంలో నిమగ్నత ఇస్తాము.

విలేఖరి: ఇది ఏమిటి?

ప్రభుపాద:మన అబ్బాయిలు అమ్మాయిల్లాగా, వారు అందరూ కృష్ణ చైతన్యం సేవలో నిమగ్నమై ఉన్నారు, ఆలయ పనిలో, పెయింటింగ్ లో, టైపింగ్ లో, రికార్డింగ్ లో, చాలా విషయాలు. మరియు వారు సంతోషంగా ఉన్నారు. వారు సినిమాకి వెళ్ళడం లేదు, వారు క్లబ్బు కు వెళ్ళడం లేదు, వారు త్రాగటం లేదు, వారు ధూమపానం చేయడంలేదు. కాబట్టి ఆచరణాత్మకంగా నేను వారికి శిక్షణ ఇస్తున్నాను ఎలా నియంత్రించాలో మరియు అక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయిలు అమ్మాయిలు, వారు అందరూ అమెరికన్లు వారిని భారతదేశం నుండి దిగుమతి చేయలేదు. ఎందుకు వారు ఇది తీసుకున్నారు? పద్ధతి చక్కగా ఉంది కాబట్టి వారు ఈ పద్ధతిని ఇష్టపడ్డారు కాబట్టి మీరు ఈ పద్ధతిను వ్యాప్తి చేస్తే, ప్రతిదీ పరిష్కరించబడుతుంది.

విలేఖరి: కావున అప్పుడు అది...

ప్రభుపాద: మీరు స్త్రీతో కలవకూడదు లేదా మీరు లైంగిక జీవితం ఆపాలి అని మేము నిషేధించము. మేము అది చెప్పము. కానీ మేము కృష్ణ చైతన్యం క్రింద అన్నింటినీ నియంత్రిస్తాము. వారి లక్ష్యం ఉన్నతమైనది. ఇవన్నీ ద్వితీయ స్థానములో ఉంటాయి. కాబట్టి ఈ విధముగా ప్రతిదీ చక్కగా ఉంది