TE/Prabhupada 0569 - స్వామిజీ, నాకు దీక్ష ఇవ్వండి. నేను వెంటనే చెప్తాను మీరు నాలుగు సూత్రాలు అనుసరించాలి



Press Interview -- December 30, 1968, Los Angeles


హయగ్రీవ: శంఖం. విలేఖరి: నేను ఒక షూఫర్(పొట్టేలు కొమ్ము) అని అనుకున్నాను.

ప్రభుపాద: అంటే ఏమిటి? విలేఖరి: ఒక షూఫర్. ప్రభుపాద: షూఫర్?

విలేఖరి: అది యూదుల రామ్ యొక్క కొమ్ము. (పొట్టేలు కొమ్ము)

ప్రభుపాద: ఈ శంఖం, ధ్వని పవిత్రంగా భావించబడుతుంది. అవును. వాస్తవానికి ఈ ధ్వనిని శంఖం చేస్తుంది, అవును కాబట్టి భగవంతునికి ప్రార్ధన చేసిన తర్వాత, మనము ఈ శంఖమును ఊదుతాము

విలేఖరి: నేను వాస్తవమునకు ప్రధాన ప్రశ్న అడిగాను అని అనుకుంటున్నాను. ప్రధాన ప్రశ్నకాదు , కానీ నేను తెలుసుకోవాలనే విషయము, మళ్ళీ, ఎందుకు ఇది, వ్యక్తుల గురించి మహర్షి వలె , నన్ను దూరము చేసినది మరియు చాలా మందిని నా కుమార్తె కొంతకాలము ఆ రకమైన విషయములో చాలా నిమగ్నమైనది, ఆమె భయంకరముగా భ్రమకు లోనైనది.

ప్రభుపాద: అవును. మానసిక శాస్త్రం ఏమిటంటే మీ ప్రజలు, పాశ్చాత్య ప్రజలు అందరు, ముఖ్యంగా యువకులు, వారు ఏదో దేనికొరకో కాంక్షిస్తున్నారు, మీరు చూడండి? కానీ కష్టం ఏమిటంటే... ఉదాహరణకు నా లాగానే. ఎవరైనా వచ్చి, "స్వామిజీ, నాకు దీక్ష ఇవ్వండి." నేను వెంటనే చెప్తాను మీరు ఈ నాలుగు సూత్రాలను అనుసరించాలి, ఆయన వెళ్ళిపోతాడు. ఈ మహర్షి, ఆయన ఎలాంటి నియమాలు పెట్టలేదు, మీరు చూసారా? ఉదాహరణకు ఒక వైద్యుడు లాగానే, ఆయన ఇలా చెప్పినట్లయితే "మీకు నచ్చినది మీరు చేయవచ్చు. మీరు నా ఔషధమును తీసుకోండి, మీరు నయమవుతారు. "ఆ వైద్యుడిని చాలా మంది ఇష్టపడతాడు. మీరు చూడండి

విలేఖరి: అవును. ఆయన చాలా మందిని చంపుతాడు, కానీ ఆయనని చాలా మంది ఇష్టపడతారు

ప్రభుపాద: అవును. (నవ్వు) ఒక వైద్యుడు, ఎవరైతే చెప్పుతాడో ", మీరు దీన్ని చేయకూడదు, మీరు దీన్ని చేయలేరు, మీరు తినకూడదు," ఇది ఒక ఇబ్బంది. కాబట్టి వారికి ఏదో కావాలి. అది సత్యము. కానీ అదే సమయంలో, వారికి చాలా చౌకగా కావాలి. కాబట్టి మోసగాళ్ళు వచ్చి వారిని మోసం చేసారు. వారు అవకాశాన్ని పొందుతారు. "ఈ ప్రజలు మోసం చేయబడాలని కోరుకుంటున్నారు.మనము ప్రయోజనమును పొందుదాము మీరు చూడండి. లేకపోతే, వారు ప్రకటన ఇస్తున్నారు "నీవు భగవంతుడవు, అందరు భగవంతులే. మీకు మీరే అర్థము చేసుకోండి, మీరు మర్చిపోయారు. మీరు ఈ మంత్రాన్ని తీసుకుంటే, మీరు భగవంతుడిగా తయారవుతారు, మీరు శక్తివంతము అవుతారు. మీకు ఇష్టం అయినది ఏదైనా, మీరు నియంత్రించవచ్చు. ఇంద్రియాల నియంత్రణ అవసరము లేదు. మీరు త్రాగవచ్చు, మీరు నిరంతరంగా లైంగిక జీవితం కలిగి ఉండవచ్చు, మీకు నచ్చినట్లు ఉండవచ్చు. " ఇలాంటి వారిని వ్యక్తులు ఇష్టపడతారు. "ఓ, కేవలం పదిహేను నిమిషాలపాటు ధ్యానం చేస్తే, నేను భగవంతుని అవుతాను, నేను ముప్పై-ఐదు డాలర్లు మాత్రమే చెల్లించాలి. " చాలామంది లక్షలమంది ప్రజలు సిద్ధంగా ఉంటారు, "ఓ, నన్ను ప్రయత్నించనివ్వండి." నా ఉద్దేశ్యం, మీ దేశంలో ముప్పై-ఐదు డాలర్లు కాదు... కానీ అంత, ముప్పై ఐదును మిలియన్ తో గుణిస్తే, అది ముప్పై-ఐదు మిలియన్ డాలర్లు అవుతుంది. (నవ్వుతూ) మనము ఇక్కడ కష్టపడుతున్నాము ఎందుకంటే మనము మోసము చేయలేము. మీరు వాస్తవమునకు కోరుకుంటే, మీరు ఈ నియమాలను అనుసరించాలి. మనము వారిని అనుమతించలేము, ఆజ్ఞ ఏమిటంటే "నీవు చంప కూడదు" నేను చెప్తాను, అవును, మీరు చంపవచ్చు, జంతువుకు ఎటువంటి భావము లేదు, ఆ జంతువుకు ఆత్మ లేదు. " ఈ విధముగా మనము మోసము చేయలేము. మీరు చూడండి.

విలేఖరి: కేవలం సరిగ్గా అదే దాని గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను . ఇది సిగ్గు పడవలసిన ఒక రకమైన విషయము, నేను చెప్పినట్లు, చాలా మంది పిల్లలను దూరము చేసినది, చాలా మంది యువకులను నిరుత్సాహపరిచినది ఎందుకంటే ... ప్రభుపాద: కాబట్టి మాకు సహాయం చెయ్యడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యమం చాలా బాగుంది. ఇది మానవాళికి సహాయం చేస్తుంది. ఇది మీ దేశం, మొత్తం మానవ సమాజమునకు సహాయం చేస్తుంది. ఇది ఒక వాస్తవమైన ఉద్యమం, ఏ మోసము లేదు, వంచన లేదు. ఇది ప్రామాణికమైనది. నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే...

విలేఖరి: ప్రామాణికము అని ఎవరు చెప్పినారు?

ప్రభుపాద: కృష్ణుడి నుండి ప్రామాణికత పొందింది.

జర్నలిస్ట్: ప్రజలకు ప్రచారము చేయటానికి భారతదేశంలో ప్రభుత్వము తరపున ఒక లైసెన్సింగ్ సంస్థ ఉందా... మీరు ఎలా ఇక్కడ చెప్పగలుగుతారు?

ప్రభుపాద: ఇటువంటిది లేదు కాబట్టి భారతదేశంలో చాలా చర్చిలు ఉన్నాయి, వారు చాలా సాధువుగా ఉండాలి. కాబట్టి కేవలం ఒక సాధువుకు శిష్యుడు కావడము కావలసిన యోగ్యతాపత్రం. ఉదాహరణకు మీ దేశంలో వలె, వివాహము చేసుకొనుటకు సర్టిఫికేట్ అవసరం. భారతదేశంలో ఇప్పటికీ, ఏ సర్టిఫికేట్ లేదు. అబ్బాయిలు అమ్మాయిలు, వారు కూర్చుంటారు, బంధువులు, పూజారి మరియు పెద్ద వారి ముందు. వారికి వివాహము చేస్తారు. నేను అది చేస్తున్నాను. సర్టిఫికేట్ లేదు. కానీ వారి సంబంధము జీవితకాలం ఉంటుంది. సర్టిఫికేట్ ఏమి చేయగలదు? ఆ వేడుక చాలా బాగుంటుంది, భార్య "జీవితాంతము నా భర్త" అని తీసుకుంటుంది భర్త భార్యను "ఆమె జీవితాంతము కోసం నా సహచరి." అని తీసుకుంటాడు, వారు వేరు కాలేరు. సర్టిఫికేట్ జారీ చేసినట్లు భారతదేశ చరిత్రలోనే లేదు. లేదు అయినప్పటికీ, వారి సంబంధము చాలా బాగుంటుంది, అది జీవితాంతము. ఇప్పుడు, వారు పాశ్చాత్యీకరించబడ్డారు, ముఖ్యంగా నేను బాధ పడుతున్నాను మన పాశ్చాత్య నాయకులు అని పిలువ బడే వారు వారు ఈ హిందూ కోడ్ బిల్లును ప్రవేశ పెడుతున్నారు, ఈ వివాహ సర్టిఫికేట్, ఇది మరియు అది. కానీ గతంలో అవి ఉనికిలో లేవు