TE/Prabhupada 0570 - కానీ దానికి ముందు, భార్య భర్త మధ్య వివాదం ఉన్నా కూడా, విడాకుల ప్రశ్నేలేదు



Press Interview -- December 30, 1968, Los Angeles


విలేఖరి: భారతదేశంలో చాలా విడాకులు ఉన్నాయా? ప్రభుపాద: అవును. ఆధునిక, ఆధునికం అని పిలువబడే అబ్బాయిలు, అమ్మాయిలు, వారు విడాకుల కోసము వెళ్తున్నారు. కానీ దానికి ముందు, భార్య భర్త మధ్య వివాదం ఉన్నా కూడా, విడాకుల ప్రశ్నేలేదు. నా జీవితం ఆచరణాత్మకముగా తీసుకోండి. నేను గృహస్తునిగా ఉండేవాడిని. ఇప్పుడు నేను వదిలి వచ్చాను. కాబట్టి ఆచరణాత్మకంగా నేను నా భార్యతో ఏకీభవించలేదు, కానీ విడాకులు అనే కల లేదు. మీరు చూడండి? ఆమె ఏ మాత్రం ఊహించలేదు, నేను ఊహించలేదు. ఇది తెలియదు. ఇప్పుడు అవి పరిచయం చేయబడుతున్నాయి.

విలేఖరి: అవును. పాశ్చాత్య సంస్కృతి.

ప్రభుపాద: ఆ, అవును.

విలేఖరి: భారతదేశంలోనే మీరు చాలా మంది అనుచరులను కలిగి ఉన్నారా?

ప్రభుపాద: అవును. నా వ్యక్తిగతముగా కాదు, కానీ నా ఇతర గురు సోదరులు, ఈ సంప్రదాయం చాలా మంచిది.

విలేఖరి: ఎన్ని, ఎంతమంది.......

ప్రభుపాద: ఓ, లక్షలు. మాకు, ఈ వైష్ణవ తత్వము ఉంది, కృష్ణ చైతన్యము, లక్షలు లక్షలు. దాదాపు అందరు. 80 శాతము ఏ భారతీయుణ్ణి అడిగినా అతడు కృష్ణ చైతన్యము గురించి చాలా విషయాలు మాట్లాడతాడు. అతడు నా శిష్యుడు అయి ఉండకపోవచ్చు, కానీ నాలాంటి అనేక సాధువులు ఉన్నారు. వారు ఈ పనులు చేస్తున్నారు.

విలేఖరి: కలవారు....... మీరు ఒక ప్రామాణిక శిక్షణ పొంది వున్నారా...

ప్రభుపాద: అవును, నేను నా గురు మహారాజు దగ్గర దీక్ష తీసుకున్నాను. అతని, ఇక్కడ, నా ఆధ్యాత్మిక గురువు యొక్క చిత్రపటము.

విలేఖరి: ఓ, నేను చూస్తున్నాను. ప్రభుపాద: అవును. కాబట్టి మీ దేశము ఒక సర్టిఫికెట్ కోరింది. నన్ను శాశ్వత నివాసిగా మార్చటానికి, నేను దీక్ష తీసుకున్నట్లు నా గురు సోదరుల వద్దనుండి సర్టిఫికెట్ తీసుకున్నాను. అంతే. కానీ అయితే, మా దేశంలో, సర్టిఫికెట్ తీసుకునే అవసరం లేదు.

విలేఖరి: మరో మాటలో చెప్పాలంటే, భారతదేశంలో బడికి వెళ్ళే అవసరం లేదా మీరు బడికి లేదా మఠమునకు వెళ్లి నాలుగు సంవత్సరాల పాటు కోర్సు తీసుకునే.....

ప్రభుపాద: లేదు, ఇది మఠం; అవును, ఒక మఠం ఉంది. మాకు సంస్థ ఉంది, గౌడీయ మఠ సంస్ధ. వారికి వందల శాఖలు ఉన్నాయి, అవును.

విలేఖరి: మీరు ఒక ఇవ్వబడిన అధ్యయనం కోసం వెళతారా?

ప్రభుపాద: అవును, అధ్యయనం యొక్క నిర్దేశించిన కోర్సు, ఈ రెండు, మూడు పుస్తకాలు, అంతే. ఎవరైనా చదువవచ్చు. భగవద్గీత మరియు శ్రీమద్భాగవతము లేదా చైతన్య-చరితామృత. మీరు ప్రతిదీ నేర్చుకుంటారు. మీరు చాలా భారీ పుస్తకాలు నేర్చుకోవలసిన అవసరము లేదు. ఎందుకంటే భగవద్గీత చాలా మంచి పుస్తకం, మీరు ఒక్క పంక్తి అర్థం చేసుకోగలిగినా కూడా, మీరు వంద సంవత్సరములు ఉన్నతమునకు వెళతారు. మీరు చూడండి? కాబట్టి నేను చెప్పదలచుకున్నాను అంటే, అర్థవంతమైనది, ఘనమైనది. కాబట్టి మేము ఈ భగవద్గీత యథాతథము ప్రచురించాము. మీ ప్రజలు దీన్ని చదవనివ్వండి, వారు ప్రశ్నించనివ్వండి, ఈ ఉద్యమం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

విలేఖరి: మాక్ మిల్లన్ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు. ప్రభుపాద: అవును, మాక్ మిల్లన్ ప్రచురిస్తుంది