TE/Prabhupada 0586 - వాస్తవమునకు ఈ శరీరమునుఅంగీకరించటము అంటే నేను మరణిస్తానని కాదు



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972


అందువలన మనము ఈ జీవితంలో ఏదైనా ప్రణాళికను చేయాలి, నా, ఈ భౌతిక శరీరం, ఈ స్థూల శరీరం నాశనమవుతుంది, అది చనిపోతుంది, కాని నా ఆలోచన, సూక్ష్మ శరీరంలో, మనస్సులో అది ఉంటుంది. మరియు అది నా మనస్సులో ఉన్ననందున, నా కోరికను నెరవేర్చటానికి నేను మరొక శరీరాన్ని అంగీకరించాలి. ఇది ఆత్మ యొక్క పునర్జన్మ చట్టం. అందువలన ఆత్మ , తన ప్రణాళికతో, ఆయన మరొక స్థూల శరీరంలోకి బదిలీ అవుతాడు. మరియు ఆత్మతో పాటు, పరమాత్మ , దేవాదిదేవుడు. Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo mattaḥ smṛtir jñānam apohanaṁ ca ( BG 15.15) కాబట్టి పరమాత్మ , దేవాదిదేవుడు, ఆయనకి బుద్ధి ఇస్తాడు: ఇప్పుడు మీరు ఈ ప్రణాళికను అమలు చేయాలని కోరుకుంటారు. ఇప్పుడు మీరు సరైన శరీరాన్ని పొందారు కనుక మీరు దాన్ని చెయ్యవచ్చు. కాబట్టి అందువలన మనం కొంత మందిని గొప్ప శాస్త్రవేత్తగా లేదా చాలా మంచి మెకానిక్ గా చూస్తాము. దీనికి అర్థం పోయిన జన్మలో ఆయన మెకానిక్, ఆయన కొన్ని ప్రణాళికలు చేసిఉన్నాడు. ఈ జీవితంలో ఆయన అవకాశం పొందుతాడు, ఆయన తన కోరికను నెరవేర్చుకుంటాడు. ఆయన ఏదో కనిపెడతాడు చాలా ప్రసిద్ధి చెందుతారు, ప్రముఖ వ్యక్తి అవుతాడు. ఎందుకంటే కర్మవాదులు, వారికి మూడు విషయాలు కావాలి: లాభా- పూజ-ప్రతిష్ట. వారు కొంత భౌతిక లాభం కావాలని కోరుకుంటున్నారు వారు కొంత భౌతిక ఆరాధనను కోరుకుంటారు, లాభా-పూజ-ప్రతిష్ట, మరియు స్థిరత్వం. ఇది భౌతిక జీవితం. ఒకదాని తరువాత మరొకటి, మనము పొందడానికి ప్రయత్నిస్తున్నాము కొన్ని భౌతిక లాభాలు, కొంత భౌతిక ఆరాధనను, భౌతిక కీర్తిని. అందువలన మనం వివిధ రకాల శరీరాలను కలిగి ఉన్నాము. ఇది జరగుతూ ఉంది. వాస్తవమునకు ఈ శరీరమును అంగీకరించటము అంటే నేను మరణిస్తానని కాదు. నేను అక్కడ ఉన్నాను. సూక్ష్మ రూపంలో, నేను అక్కడ ఉన్నాను. న జాయతే న మ్రియతే. అందువల్ల అక్కడ జన్మించడము మరియు మరణించడము అనే ప్రశ్నే లేదు. ఇది శరీరం యొక్క రూపాంతరం మాత్రమే. Vāsāṁsi jīrṇāni yathā vihāya ( BG 2.22) ఇది తరువాతి శ్లోకము లో వివరించబడుతుంది:

vāsāṁsi jīrṇāni yathā vihāya
navāni gṛhṇāti naro 'parāṇi
tathā śarīrāṇi vihāya jīrṇāny
anyāni saṁyāti navāni dehī
(BG 2.22)

దేహి, జీవి, కేవలం దుస్తులు మారుస్తున్నాడు. ఇవి దుస్తులు. ఈ శరీరము దుస్తులు. ఇప్పుడు ప్రశ్న... ఉదాహరణకు ఆత్మకు ఎలాంటి రూపం లేదని కొంత చర్చ జరగినది. ఇది ఎలా వీలు అవుతుంది? ఈ శరీరం నా దుస్తులు అయితే, నాకు రూపం లేకుండ ఎలా ఉంటుంది? దుస్తులకు రూపం ఎలా వచ్చింది? నా కోటు లేదా చొక్కా ఒక రూపం కలిగి ఉంది ఎందుకంటే నా శరీరం ఒక రూపం కలిగి ఉంది. నాకు రెండు చేతులున్నాయి. కాబట్టి నా దుస్తులు, నా కోటుకు కూడా రెండు చేతులున్నాయి. నా చొక్కా కూడా రెండు చేతులతో ఉంది. కాబట్టి ఇవి దుస్తులు అయితే, ఈ శరీరం, ఇది భగవద్గీత లో వివరించబడింది - vāsāṁsi jīrṇāni yathā vihāya ( BG 2.22) - కాబట్టి ఇవి దుస్తులు అయితే, అప్పుడు నాకు ఒక రూపం ఉండాలి. లేకపోతే ఎలా ఈ దుస్తులు తయారు చేయబడినవి? ఇది చాలా తార్కిక ముగింపు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. నాకు నా సొంత రూపం లేకపోతే, దుస్తులకు ఎలా రూపం వచ్చింది? జవాబు ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? వాస్తవమునకు జీవి చేతులు కాళ్లు లేకుండా ఎలా ఉంటుంది? ఈ శరీరం నా దుస్తులు అయితే... ఉదాహరణకు మీరు ఒక దర్జీ దగ్గరకు వెళ్తారు. ఆయన నీ చేయి యొక్క కొలత, మీ కాలు యొక్క, మీ ఛాతి యొక్క కొలతను తీసుకుంటాడు. అప్పుడు మీ కోటు లేదా చొక్కా తయారు చేయబడుతుంది. అదేవిధముగా, మీరు ఒక ప్రత్యేకమైన దుస్తులను పొందినప్పుడు, నేను నా రూపం, ఆధ్యాత్మిక రూపం పొందానని భావించవలసి ఉంది. ఈ వాదనను ఎవరూ తిరస్కరించలేరు. మనము మన వాదన అని పిలిచే దానిని ప్రక్కన ఉంచి, మనము కృష్ణుడి యొక్క ప్రకటనను అంగీకరించాలి. ఎందుకంటే... ఆయన ప్రామాణికం.