TE/Prabhupada 0590 - పవిత్రత అంటే, నేను తప్పక తెలుసుకోవాలి అది నేను ఈ శరీరం కాదు. నేను జీవాత్మ



Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972


కాబట్టి āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ patanty adhaḥ ( SB 10.2.32) కాబట్టి ఈ ఆనందం కోసం మనము చాలా ప్రణాళికలు చేస్తున్నాము. మన సొంత బుర్ర , అతి చిన్న బుర్ర ప్రకారం, మనము ప్రణాళికలు చేస్తున్నాము. కేవలము, రాష్ట్రంలో కూడా, వారు ప్రణాళికలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా, ప్రతిఒక్కరు, వాణిజ్యపరంగా, అందరూ ప్రణాళిక చేస్తున్నారు. ప్రణాళిక తయారు చేయుట అనగా అర్థం చిక్కుకొనుట ఆయన తప్పకుండా, ప్రణాళిక నెరవేర్చుకోవడానికి వారు మళ్ళీ జన్మ తీసుకోవాలి. Vāsanā. దీనిని వాసనా అని పిలుస్తారు. కాబట్టి మనము వాసనను, కోరికను పవిత్రము చేయాలి. అది అవసరం. మనము పవిత్రము కాకపోతే, అప్పుడు మనము జన్మించాలి, జన్మించడము మరియు మరణించడము, జనన మరణం యొక్క చక్రంలో తిరగాలి. కాబట్టి ఆ కోరిక, ఎలా పవిత్రము చేయవచ్చు? ఆ కోరిక పవిత్రము చేయవచ్చు. Sarvopādhi-vinirmuktaṁ tat-paratvena nirmalam ( CC Madhya 19.170) మనము ఈ హోదాలను విడిచిపెట్టాలి, "నేను బ్రాహ్మణుడిని," "నేను శూద్రుడిని," "నేను క్షత్రియుడిని" నేను "నేను అమెరికన్," "నేను భారతీయుడను," "నేను ఇది..." చాలా హోదాలను గుర్తింపులను. ఎందుకంటే నేను ఆత్మ, కానీ ఇది, నా పై కప్పబడి ఉన్న నా గుర్తింపు కాబట్టి ఈ హోదాతో నన్ను నేను గుర్తిస్తున్నాను, అప్పుడు నేను జననమరణాల్లో తిరిగాల్సి ఉంటుంది. మీరు పవిత్రము చేయవచ్చు. ఇది ఎలా పవిత్రము చేయబడుతుంది? అది భక్తియుక్త సేవ ద్వారా పవిత్రము చేయబడుతుంది. మీరు కృష్ణుడి యొక్క భాగం అంశం అని అర్థం చేసుకున్నప్పుడు, నేను ఎప్పుడైతే అది అర్థం చేసుకుంటానో నేను నిత్యము కృష్ణుడితో సంబంధము కలిగి ఉన్నాను, ఆయన మహోన్నతమైనవాడు, నేను సేవకుడిగా ఉన్నాను " ఆయన సేవలో నన్ను నేను నిమగ్నమైనప్పుడు, ఇది కోరికల పవిత్రీకరణ. కృష్ణ చైతన్యము లేకుండా, ప్రతి ఒక్కరూ భిన్నమైన భౌతిక చైతన్యంతో పనిచేస్తున్నారు. నేను అమెరికన్ ని. అందువలన నేను ఈ విధముగా పని చేయాలి. నేను రష్యన్లతో తప్పకుండా పోరాడాలి. రష్యన్ వారు ఆలోచిస్తున్నాడు "నేను రష్యన్ ని, నేను తప్పక అమెరికన్లతో పోరాడాలి." లేదా చైనా... చాలా గుర్తింపులు. దీన్ని మాయ, భ్రాంతి అని పిలుస్తారు.

కాబట్టి మనము పవిత్రము కావాలి. పవిత్రత అంటే, నేను తప్పక తెలుసుకోవాలి అది "నేను ఈ శరీరం కాదు. నేను జీవాత్మ. "నేను జీవాత్మ గా ఏమి చేస్తున్నాను? నేను ఏమి పని చేస్తున్నా, ప్రస్తుత క్షణంలో, జీవితం యొక్క ఈ శరీర భావనతో చేస్తున్నాను... కానీ దాని గురించి ఏమిటి? జీవాత్మ గా నేను ఏమి చేస్తున్నాను? ఈ జ్ఞానం అవసరం. మనము పవిత్రులైనప్పుడు ఈ జ్ఞానం వస్తుంది.

brahma-bhūtaḥ prasannātmā
na śocati na kāṅkṣati
samaḥ sarveṣu bhūteṣu
mad-bhaktiṁ labhate parām
(BG 18.54)

Mad-bhaktiṁ labhate parām. ఎప్పుడు? ఈ భౌతిక గుర్తింపు నుండి బయటపడిన తరువాత. brahma-bhūtaḥ. బయటపడిన తరువాత, ముందు కాదు. కాబట్టి భక్తి ఒక మూఢనమ్మకం కాదు. భక్తి ... ప్రజలు చెప్తారు, ఎవరైతే బాగా జ్ఞానమును కలిగి లేరో, వేదముల సాహిత్యాన్ని చాలా చక్కగా అధ్యయనం చేయలేనివారు, అందువలన వారు భక్తి తీసుకుంటారు. కాదు. భక్తి, వాస్తవ భక్తి, ఎప్పుడైతే ఒకరు పూర్తిగా బ్రహ్మ-భూతః ఐనప్పుడు ప్రారంభమవుతుంది.

brahma-bhūtaḥ prasannātmā
na śocati na kāṅkṣati
samaḥ sarveṣu bhūteṣu
mad-bhaktiṁ labhate parām
(BG 18.54)

అది, భక్తియుక్త సేవలను నిర్వర్తించే పవిత్రమైన ఆధ్యాత్మిక దశ, భౌతిక గుర్తింపు నుండి బయటపడిన తరువాత. Sarvopādhi-vinirmuktaṁ tat-paratvena nirmalam ( CC Madhya 19.170) దీనిని నిర్మల అని పిలుస్తారు. అది ముక్తి. ఆత్మ శాశ్వతమైనది. ఇది పరిశుభ్రము చేయాలి, భౌతిక కలుషితమును కాబట్టి ఆయన పవిత్రం అయినప్పుడు, అప్పుడు hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate ( CC Madhya 19.170) మన ఇంద్రియాలు పవిత్రము అయినప్పుడు ... ఈ అమెరికన్ చేయి లేదా భారతీయ చేయి కాదు. ఇది కృష్ణుడి చేయి. కృష్ణుడి సేవలో ఈ చేయి వినియోగించబడాలి. దేవాలయమును ఊడ్చటములో, ఆయన ఇలా భావించినట్లయితే, అతడు వేదాంతకారులు అందరి కంటే కూడా చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. కేవలం ఆయనకు ఈ చేయి కృష్ణుడికి చెందుతుంది అని తెలిస్తే, అప్పుడు ఆయన వేదాంతకారులు అందరి కంటే కూడా చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఈ వేదాంతవేత్తలు ... వాస్తవానికి, అందరు భక్తులు, వారు వేదాంతివాదులు. కాని ఆయన వేదాంతము పూర్తిగా తెలుసుకున్నాను అని ఎవరైనా భావిస్తే. వేద అంటే జ్ఞానం అని అర్థం. అంత అంటే అంతిమ అని అర్థం. కాబట్టి వేదాంత అంటే అంతిమ జ్ఞానం. కాబట్టి అంతిమ జ్ఞానం కృష్ణుడు. Vedaiś ca sarvair aham eva vedyaḥ ( BG 15.15) కాబట్టి కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోతే, వేదాంతి అని పిలవబడే అతను, అతడు వేదాంతి అని అనటములో అర్థం ఏమిటి? ఇది అర్థం లేనిది. ఎవరికైతే తెలుసో "కృష్ణుడు దేవాదిదేవుడు మహోన్నతమైనవారు ఆయన నా ప్రభువు. వారు, ఆయన, పరిపూర్ణమైన వేదాంతి, నేను ఆయన శాశ్వత సేవకుడను. "ఇది వేదాంత జ్ఞానం,

చాలా ధన్యవాదాలు హరే కృష్ణ