TE/Prabhupada 0595 - మీకు వైవిధ్యం కావాలంటే,అప్పుడు మీరు ఒక లోకము యొక్క ఆశ్రయం తీసుకోవాలి



Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972


కాబట్టి బ్రహ్మ జ్యోతిలో ఇది, కేవలం చిన్- మంత్రా, కేవలం ఆత్మ, ఆత్మలో రకాలు లేవు. ఇది కేవలం ఆత్మ. ఆకాశం లాగానే. ఆకాశం కూడా భౌతికమే. కానీ ఆకాశంలో, వైవిధ్యం లేదు. మీకు వైవిధ్యం కావాలంటే, ఈ భౌతిక ప్రపంచంలో కూడా, అప్పుడు మీరు ఒక లోకము యొక్క ఆశ్రయం తీసుకోవాలి. మీరు భూలోకమునకు రావలి లేదా చంద్ర లోకమునకు లేదా సూర్య లోకమునకు వెళ్ళాలి అదేవిధంగా, బ్రహ్మ జ్యోతి కృష్ణుడి శరీరము నుండి వచ్చే ప్రకాశ కిరణాలు. యస్య ప్రభా ప్రభవతో జగద్-అండ-కోటి (BS.5.40). సూర్యమండలం నుండి వచ్చే ప్రకాశం వలె, సూర్య లోకములో సూర్య దేవుడు ఉన్నాడు అదేవిధంగా, ఆధ్యాత్మిక ప్రపంచములో , బ్రాహ్మన్ తేజస్సు ఉంది నిరాకర బ్రహ్మ జ్యోతిలో, ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. వాటిని వైకుంఠ లోకాలు అంటారు. వైకుంఠ లోకాల్లో అగ్రగణ్యమైనది కృష్ణ లోకము. కాబట్టి కృష్ణుడి శరీరం నుండి, బ్రహ్మ జ్యోతి వెలువడుతుంది. యస్య ప్రభా ప్రభవతో జగద్-అండ-కోటి (BS .5.40). ఆ బ్రహ్మ జ్యోతిలోనే అంతా ఉంది సర్వం ఖల్వ్ ఇదం బ్రహ్మ. భగవద్గీతలో కూడా ఇది చెప్పబడింది, మత్-స్థాని సర్వ-భూతాని నాహం తేషు అవస్ధితః ( BG 9.4) ఆయన తేజస్సులోనే ప్రతిదీ స్థితమై ఉన్నది, బ్రహ్మ జ్యోతి...

మొత్తం భౌతిక ప్రపంచం వలె, అసంఖ్యాకమైన లోకములు, అవి సూర్యరశ్మిలో ఉన్నట్లుగా. సూర్యరశ్మి సూర్య మండలం యొక్క నిరాకార వెలుగు, మరియు సూర్యరశ్మి పై మిలియన్ల లోకాలు ఆధార పడి ఉన్నాయి సూర్యరశ్మి ని బట్టి, అంతా జరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మ జ్యోతి వెలువడటం, కృష్ణుడి శరీరం నుండి వచ్చే కిరణాలు, ప్రతీది ఆ బ్రహ్మ జ్యోతి పై విశ్రమిస్తాయి. వాస్తవానికి, వివిధ రకాల శక్తులు. సూర్యరశ్మి నుండి వివిధ రకాల రంగులు, శక్తులు ఉన్నట్లుగా. అది ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తోంది. మనము ఆచరణాత్మకంగా అనుభవించుట వలె. పాశ్చాత్య దేశాల్లో సూర్యరశ్మి లేనప్పుడు, మంచు ఉన్నప్పుడు, చెట్ల యొక్క అన్ని ఆకులు వెంటనే కింద పడిపోతాయి. దానిని మాఘమాసము అంటారు, ఋతువు. కేవలము కలప ఉండిపోతుంది, చెక్క ముక్క మాత్రమే ఉంటుంది. మళ్లీ, వసంతకాలం ఉన్నప్పుడు, సూర్య రశ్మి అందుబాటులోకి వస్తోంది, అన్నీ ఒకే సమయంలో, ఆకుపచ్చగా మారుతాయి. సూర్యరస్మి ఈ భౌతిక ప్రపంచంలో పని చేస్తున్నట్లుగా, అదే విధముగా భగవంతుని యొక్క అత్యుత్తమమైన శరీర కిరణాలు అన్నీ సృష్టి యొక్క మూలము. యస్య ప్రభా ప్రభవతో జగద్-అండ-కోటి(BS 5.40). బ్రహ్మజ్యోతి వల్ల, మిలియన్ల మిలియన్ల బ్రహ్మాండములు, లేదా లోకాలు, వెలువడుతున్నాయి.