TE/Prabhupada 0603 - కానీ ఈ మృదంగము ఇంటి నుండి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళుతుంది



Lecture on SB 1.16.8 -- Los Angeles, January 5, 1974


యమరాజు యొక్క కర్తవ్యము ఈ జీవి ఎంత పాపము చేసాడో చూసి, ఆయనకు తగిన శరీరాన్ని ఇవ్వడము. Karmaṇā daiva-netreṇa ( SB 3.31.1) మీరు మీ మరణం తర్వాత, మనలో ప్రతి ఒక్కరికి తీర్పు ఇవ్వబడుతుంది. అయితే, ఆయన కృష్ణ చైతన్యమును తీవ్రంగా తీసుకుంటే, అప్పుడు మార్గం సహజముగా ఉంటుంది. సహజముగా మీరు భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళతారు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళుతారు. తీర్పు అనే ప్రశ్నే లేదు. తీర్పు అనేది నేరస్తులకు, దుష్టులకు ఎవరైతే కృష్ణ చైతన్యములో లేరో కానీ మీరు కృష్ణ చైతన్యవంతులైతే, ఈ జీవితంలో మీరు కృష్ణ చైతన్యమును పూర్తి చేయలేక పోయినప్పటికీ, మీరు పతనము అయినా కూడా, ఇప్పటికీ, మీకు మరొక అవకాశం మానవ శరీరం ఇవ్వబడుతుంది, మీరు మొదలు పెడతారు ముగించిన చోటు నుండి, మీరు పతనమైన స్థానము నుండి మొదలు పెడతారు. అంటే...

అందువలన svalpam apy asya dharmasya trāyate mahato bhayat. మీరు కృష్ణ చైతన్యమును తీసుకుంటే, అది చాలా తీవ్రంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తే, నియమాలు మరియు నిభందనలు పాటించడము మరియు హరే కృష్ణ కీర్తన చేయడము. అంతే. ఐదు విషయాలు. అక్రమ మైథునము వద్దు, ఏ జూదము వద్దు, మాంసం తినడం వద్దు ... మనము మైథునము నిషేధించము, కానీ అక్రమ మైథునము చాలా పాపము. అత్యంత పాపమైనది. దురదృష్టవశాత్తు, వారు అలాంటి మూర్ఖులు, మరొకరితో మైథునము, మరొకరితో మైథునము, మరొకరితో మైథునము ... అది మాయ యొక్క భ్రమ, ప్రభావము. కానీ మీరు కృష్ణుడితో ఉంటే... Mām eva ye prapadyante māyām etāṁ taranti te ( BG 7.14) మీరు కృష్ణుడి కమల పాదములను చాలా గట్టిగా పట్టుకొని ఉంటే, అప్పుడు మీరు పతనమవ్వరు. కానీ మీరు బ్రహ్మచారి అని పిలవబడే వానిగా నటిస్తే, గృహస్తుడు అని పిలవబడే వానిగా, సన్యాసి అని పిలవబడే వానిగా నటిస్తే, అప్పుడు మీరు పతనము అవుతారు. మేము ఎదుర్కొంటున్నాము. అప్పుడు మీరు పతనము అవుతారు. కృష్ణుడు అపరాధిని, ఒక నకిలీ భక్తుని సహించడు. మాయా చాలా బలంగా ఉంది. వెంటనే ఆయనని బంధిస్తుంది: "రండి, నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావు? మీరు ఈ సమాజంలో ఎందుకు ఉన్నారు? బయటపడండి. "ఇది యమరాజా యొక్క కర్తవ్యము. అయితే మీరు కృష్ణ చైతన్యములో ఉన్నట్లయితే, యమరాజు మిమ్మల్ని ముట్టుకోడు. మీరు కృష్ణ చైతన్యమును ప్రారంభించిన చోటనే మీ మరణం నిలిపివేయబడింది. మీ మరణం నిలిపివేయబడింది. ఎవరూ మరణించడానికి సిద్ధంగా లేరు. అది వాస్తవము. మీరు చెప్పవచ్చు, నేను చెప్పవచ్చు, "కాదు, నేను మరణం గురించి భయపడను" అని అనవచ్చు. అది మరొక మూర్ఖత్వము. అందరూ మరణం గురించి భయపడతారు, ఎవరూ చనిపోవాలని కోరుకోరు. అది వాస్తవము. కానీ మీరు ఆ విషయాన్ని గూర్చి తీవ్రముగా ఉంటే, "నేను నా మరణాన్ని, మరణిస్తున్న పద్ధతిను నిలిపివేస్తాను", అది కృష్ణ చైతన్యము.

అందువల్ల ఇది సలహా ఇవ్వబడుతుంది, aho nṛ-loke pīyeta hari-līlāmṛtaṁ vacaḥ ( SB 1.16.8). ఓ మానవ సమాజం, మీకు ఈ శరీరం వచ్చింది. కేవలం కృష్ణ -కథ యొక్క అమృతమును త్రాగటం కొనసాగించండి. ఇది ఇక్కడ సూచించబడింది. Aho nṛ-loke.. ముఖ్యంగా ఇది మానవ సమాజం, మానవ సమాజంలో సూచించబడింది. ఇది కుక్కలకు లేదా పిల్లులకు సూచించబడలేదు. అవి చేయలేవు. వాటికి సామర్థ్యం లేదు. అందువలన ఇది nṛ-loke అని చెప్పబడినది. Nāyaṁ deho deha-bhājāṁ nṛ-loke. ఐదవ స్కందములో మరో శ్లోకము: nāyaṁ deho deha-bhājāṁ nṛ-loke, kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye ( SB 5.5.1) ఇది భాగవతము. పోలికే లేదు. శ్రీమద్-భాగవతం వంటి సాహిత్యం విశ్వం అంతటా లేదు. పోలికే లేదు. ఏ పోటీ లేదు. ప్రతి పదం మానవ సమాజము మంచి కొరకు ఉంది. ప్రతి పదం, ఒక్కొక్క మరియు ప్రతి పదం. అందువల్ల మనము పుస్తక పంపిణికి చాలా ప్రాముఖ్యత ఇస్తాము. ఏదో ఒకవిధముగా లేదా మరొక విధముగా, పుస్తకము ఒక వ్యక్తి చేయిలోకి వెళ్ళితే, ఆయన ప్రయోజనము పొందుతాడు. కనీసం ఆయన చూస్తాడు, ", వారు చాలా ఖరీదు తీసుకున్నారు, దీనిలో ఏమి ఉన్నదో చూద్దాము." ఆయన ఒక శ్లోకమును చదివితే, ఆయన జీవితం విజయవంతమవుతుంది. ఒక శ్లోకము, ఒక పదం. ఇది అటువంటి మంచి విషయాలు. అందువలన మనం చాలా నొక్కిచెప్పాము, "దయచేసి పుస్తకాలను పంపిణి చెయ్యండి, పుస్తకం పంపిణి చెయ్యండి, పుస్తకం పంపిణి చెయ్యండి." బృహత్ మృదంగ. మనము కీర్తన చేస్తూ మన మృదంగమును వాయిస్తున్నాము. ఇది ఈ గదిలోనే లేదా కొంచం దూరము వినబడుతుంది. కానీ ఈ మృదంగము ఇంటి నుండి ఇంటికి వెళ్ళుతుంది, దేశము నుండి దేశమునకు, సమాజము నుండి సమాజమునకు, ఈ మృదంగము.

ఈ సలహా ఇచ్చారు. నృ లోకే nṛ-loke మానవ సమాజంలో మానవ శరీరము. మనము వదలివేయము. ఇది అమెరికన్ సమాజం లేదా "ఇది యూరోపియన్ సమాజం," "ఇది భారతీయ సమాజం..." కాదు, అందరూ మానవులు అందరూ మానవులు. ఆయన ఏమిటి అని పట్టింపు లేదు. అందరూ మానవులు. సభ్యత కలిగిన వ్యక్తుల గురించి ఏమి మాట్లాడాలి, సభ్యత లేని వారు, అనార్యా. వారు కూడా భాగవతములో వివరించబడ్డారు. Kirāta-hūṇāndhra-pulinda-pulkaśā ābhīra-śumbhā yavanāḥ khasādayaḥ ( SB 2.4.18) ఈ పేర్లు ఉన్నాయి. Kirāta. కిరాట అంటే నల్లజాతి, ఆఫ్రికన్లు. వారిని కిరాటా అని పిలుస్తారు. Kirāta-hūṇa āndhra. హునా, ఉత్తర ధ్రువంలో ఉన్న దేశం లేదా సమాజము, రష్యన్, జర్మని కంటే పైన, వారిని హునా అని పిలుస్తారు. మనకు తెలియదు చాలా ఉన్నాయి. Khasādayaḥ, మంగోలియన్లు. Khasādayaḥ అంటే తగినంత మీసాలు గడ్డము పెంచుకోరు అంతే. ఈ మంగోలియన్ సమూహం Kirāta-hūṇāndhra-pulinda-pulkaśā ābhīra-śumbhā yavanāḥ khasādayaḥ. యవన, మ్లేచ్ఛులు, యవనులు, అంటే మహమ్మదీయులు మరియు ఇతరులు. కాబట్టి వారు కూడా చేర్చబడ్డారు. Nṛ-loke. ఎందుకంటే ఇది Nṛ-loka. ప్రతి మనిషి. పైపై, బాహ్యంగా, ఈ దేశం ఆ దేశం కంటే మెరుగైనది కావచ్చు. అది సత్యము. ఆర్యులు మరియు అనార్యులు. విభాగాలు ఉన్నాయి: సభ్యత తెలిసిన వారు, సభ్యత తెలియని వారు, విద్యావంతులు, నిరక్షరాస్యులు; సంస్కృతి కలిగిన వారు, సంస్కృతి లేని వారు నల్లని వారు తెల్లని వారు; ఇది మరియు అది. ఇవి.... బాహ్యంగా ఇవి ... కానీ వ్యత్యాసం శరీరం వలన ఉంది