TE/Prabhupada 0611 - మీరు సేవా భావమును కోల్పోయిన వెంటనే, ఈ ఆలయం ఒక గొప్ప గిడ్డంగి క్రింద అవుతుంది



Lecture on SB 1.7.27 -- Vrndavana, September 24, 1976


కాబట్టి కనీసము మనం భారతీయులము, మనము అలాంటి శిక్షణ పొందాము. శిక్షణ మాత్రమే కాదు, మనము భక్తులుగా జన్మించాము. భారతదేశంలో జన్మించిన ఎవరికైనా, అది ప్రత్యేక సదుపాయం. వారు పూర్వ జన్మలో, వారు అనేక తపస్సులను, చాలా తపస్సులను చేశారు. దేవతలు కూడా, వారు ఈ అవకాశాన్ని పొందడానికి, భారతదేశంలో జన్మ తీసుకోవాలని కోరుకుంటారు. కావున భారతదేశములో... భారతదేశం అంటే ఈ లోకము అని ఆలోచించవద్దు, భరతవర్ష. మంచి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆలోచించరాదు - ఇక్కడ ఒక రాతి విగ్రహం ఉన్నది అని మనము భావిస్తే, అది చాలా రోజులు కొనసాగదు. ఇది ఉండదు... Galagraha. ఇంకా విగ్రహము ఉండదు, కానీ galagraha. ఉదాహరణకు నేను ఈ ఆలయాన్ని స్థాపించాను. ఇప్పుడు, నా మార్గంలో, నా శిష్యులు విగ్రహాన్ని పూజిస్తున్నారు. విగ్రహము అంటే భగవంతుడు యొక్క రూపం అంటే, రూప. అయితే నియంత్రణ సూత్రాలను పాటించక పోతే అప్పుడు నా మరణం తరువాత అది గలాగ్రహ, భారం, మా దుష్టుడైన గురు మహారాజు ఈ ఆలయాన్ని స్థాపించారు, మనము ఆరాధించాలి, ఉదయన్నే నిద్ర లేవాలి, అన్నీ ఇబ్బందులు. "ఇది ఉంటుంది... అది గలాగ్రహ అని పిలువబడుతుంది, ఒక భారం, "ఆయన మనకు ఒక భారాన్ని ఇచ్చాడు." ఇది ప్రమాదం. అప్పుడు ఈ గొప్ప ఆలయం తప్పుగా నిర్వహించబడుతుంది, మీరు కనుగొంటారు "ఇది పతనము అవుతుంది" "ఇది అపవిత్రమైనది," ఎటువంటి శ్రద్ధ లేదు. ఇది మన... దీనిని గలాగ్రహ అని పిలుస్తారు: "దుష్టుడు మనకు భారాన్ని ఇచ్చాడు."

ఇది చాలా కష్టము. మనము కోల్పోతే..., మనము ఆ భావమును కోల్పోయినట్లయితే "ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ ఆయనకు ఒక అవకాశము ఉన్నది ఆయనకు సేవ చేయటానికి Sākṣād-dharitvena samasta-śāstraiḥ... అది కాదు. Śrī-vigrahārādhana-nitya-nānā-śṛṅgāra-tan-mandira-mārjanādau. సాధ్యమయినంత త్వరగా... అందువల్ల మనం చాలా అప్రమత్తంగా ఉన్నాము, "ఎందుకు మీరు ఇది చేయలేదు? ఎందుకు మీరు దీనిని చేయలేదు? ఎందుకు...?" భక్తియుక్త సేవా భావన కోల్పోయిన వెంటనే, ఈ దేవాలయం ఒక భారం అవుతుంది. ఇది మార్గం. ఇది ఒక గొప్ప ఆలయం. నిర్వహించడానికి, ఇది ఒక గొప్ప భారం అవుతుంది. కాబట్టి వారు భారం అనుభవిస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా విరిగిపోయినట్లయితే వారు పట్టించుకోరు. సరే, మనము సంపాదించిన ధనమును, మనము మొదట తిందాము ఇది పరిస్థితి. విగ్రహ మరియు గలాగ్రహ. మీరు అర్థం చేసుకోవాలి. మనం దానిని మరచిపోతే "ఇక్కడ కృష్ణుడు వ్యక్తిగతంగా ఉంటాడు. మనము ఆయనకు చాలా చక్కగా స్వాగతము చెప్దాము. మనము ఆయనకు చక్కని ఆహారాన్ని ఇవ్వాలి, చక్కని దుస్తులు, చక్కని..." అప్పుడు అది సేవ. అనే భావన వచ్చిన వెంటనే "ఇక్కడ ఒక రాయి విగ్రహము ఉన్నది" - వారు కొన్నిసార్లు చెప్తారు "విగ్రహారాధన" అని - మనము ఆయనకి దుస్తులు అలంకరణ చేయాలని, ఆయనకి ఇవ్వాలని..., అన్నీ ఇబ్బందులు. అప్పుడు ముగిసిపోతుంది పూర్తయ్యింది. ప్రతిచోటా అది వచ్చింది. నేను అనేక ప్రదేశములలో చుసాను. నాసిక్లో చూసినట్లు, అనేక పెద్ద దేవాలయాలు, పుజారీ లేడు, కుక్కలు మలము చేస్తున్నాయి. వారు పాటించటము లేదు అది మాత్రమే కాదు. పాశ్చాత్య దేశాలలో కూడా చర్చిలు మూసివేయబడుతున్నాయి. పెద్ద పెద్ద చర్చ్ లు, లండన్లో నేను చుసాను చాలా గొప్ప, పెద్ద పెద్ద చర్చిలు, కానీ వాటిని మూసివేశారు. అదివారం సమావేశం జరుగుతున్నప్పుడు, సంరక్షకుడు, ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఎవరో వృద్ధ మహిళ, వారు వస్తారు. ఎవరు రారు. మనము కొనుగోలు చేస్తున్నాము. మనము చాలా చర్చిలను కొనుగోలు చేసాము. ఎందుకంటే ఇప్పుడు అది నిష్ప్రయోజనమైనది. ఇది నిరుపయోగం. మన లాస్ ఏంజిల్స్ లో మనము కొనుగోలు చేశాము, అనేక ఇతర వాటిని. టొరొంటోలో ఇటీవల మనము కొనుగోలు చేసాము. పెద్ద పెద్ద చర్చిలు. కానీ వారు మనకు విక్రయించరు. ఒక చర్చి, పూజారి ఇలా అన్నాడు, "ఈ చర్చికి నేను నిప్పంటిస్తాను, అయినప్పటికీ నేను భక్తివేదాంత స్వామికి ఇవ్వను."(నవ్వు) ఈ టొరాంటో చర్చి కూడా ఆ విధముగా ఉన్నది మెల్బోర్న్ లో, షరతు ఏమిటంటే, అమ్మకానికి షరతు ఉంది, మీరు ఈ చర్చి భవనమును కూల్చ వలసి ఉంటుంది. మనము అడిగాము "ఎందుకు?" ఆయన చెప్పాడు, "ఇప్పుడు ఆలయం గా ఉపయోగిస్తాము అంటే, అప్పుడు మేము మీకు ఇవ్వము." వారు నిరాకరించారు. అది నీకు తెలుసు? అందువల్ల వారు దానిని ఇష్టపడలేదు "ఈ కృష్ణ చైతన్యము ఉద్యమము మన చర్చిలను కొనుగోలు చేసి, రాధా-కృష్ణ అర్చామూర్తిని ప్రతిష్ట చేస్తారు" వారికి అది ఇష్టం లేదు. కానీ అది జరగడములేదు.

కాబట్టి పాశ్చాత్య దేశాలలోని చర్చిలు మాత్రమే కాదు; ఇక్కడ కూడా. మీరు సేవా భావమును కోల్పోయిన వెంటనే, ఈ ఆలయం ఒక గొప్ప గిడ్డంగి క్రింద అవుతుంది, అంతే. దేవాలయం అనేది లేదు. కాబట్టి మనము ఆ సేవను స్పూర్తిని కాపాడుకోవాలి. అందువలన మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము - "ఎందుకు తాజా పుష్పం లేదు?" మీరు అనుకుంటే, "ఇక్కడ ఒక రాతి విగ్రహము ఉంది. తాజా పువ్వు లేదా పాత పువ్వు అంటే అర్థం ఏమిటి? మనము పువ్వును ఇవ్వాలి. అంతే." కానీ భావన లేకపోతే , "ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, తాజా పుష్పం ఇవ్వాలి." ఉదాహరణకు నేను ఒక ప్రాణము ఉన్న మనిషిని, మీరు నాకు తాజా పుష్పం ఇస్తే, మీరు కొంత చెత్తను తీసుకువస్తే, నీవు నాకిచ్చిన యెడల నేను సంతోషించెదనా? మీరు భావిస్తున్నారా? కాబట్టి ఈ భావన కోల్పోవడము ప్రారంభంలో కూడా ఉంటుంది ఈ విగ్రహాన్ని కొన్ని చెత్త, చెత్త పుష్పంతో మనము సంతృప్తి పరచుదాము. ఆయన నిరసన చెప్పాడు. "అవును, ఆయన నిరసన చేయడు. కానీ మీ జీవితం పూర్తి అవుతుంది. నిరసన ఆ విధముగా ఉంటుంది. భావం, bhāva, budhā bhāva-samanvitāḥ ( BG 10.8) కోల్పోయిన వెంటనే ... ఎవరు కృష్ణుడిని పూజింపగలరు? భావము ఉన్నప్పుడు, sthāyi-bhāva ఉన్నప్పుడు. ఇది భక్తి-రసామృత-సింధులో చర్చించబడింది, భావ అంటే ఏమిటి. కానీ మీకు భావన లేకుంటే, మీరు భౌతికముగా ఉంటారు (ఖచ్చితమైనది), కనిష్ట-అధికారి. కేవలం నాటకము. ఒక నాటకము చాలా రోజులు జరగదు. నాటకము చాలా త్వరలో పూర్తి అవుతుంది