TE/Prabhupada 0614 - మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పతనమయితే పది లక్షల సంవత్సరాలు వేచి ఉండాలి



Lecture on SB 7.9.1 -- Mayapur, February 8, 1976


బ్రహ్మదేవుడు నుండి దేవతల జాబితా మొదలవుతుంది. ఆయన, దేవతలు మరియు ఇతర జీవులు అందరి యొక్క వాస్తవ తండ్రి. అందువలన ఆయనను ప్రజాపతి అని పిలుస్తారు లేదా పితామహ, తాత. ప్రజాపతి అని పిలుస్తారు. ఆయన ప్రతి దాని యొక్క మూలం. డార్విన్ యొక్క సిద్ధాంతం, ఒక మూర్ఖపు సిద్ధాంతం, జీవితం లేదని, అయితే వేదముల జ్ఞానం ప్రకారం ఉత్తమ జీవితం ఉన్నది. బ్రహ్మ అక్కడ నుండి జీవితం మొదలవుతుంది, క్రమముగా వారు అధోగతి చెందుతారు, భౌతిక కాలుష్యం వలన. జీవితం లేదని కాదు. తక్కువ జీవన స్థాయి నుండి వ్యక్తి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు అది తప్పుడు సిద్ధాంతం. వాస్తవిక సిద్ధాంతం అనేది జీవితము అత్యంత ఉన్నతమైన వ్యక్తి అయిన భగవంతుడు బ్రహ్మ నుండి ప్రారంభమవుతుంది, ప్రజా-పతి నుండి . కాబట్టి ఏ పవిత్రమైన విషయములో అయిన వారు ముందు ఉంటారు, ఎందుకంటే మీరు మీ జీవితములో తక్కువ స్థితిలో దేవుడిని చేరుకోలేరు. మీరు చూడండి? తక్కువ స్థాయి జీవితము అంటే పాపపు ప్రతిచర్య (పాపఫలము). ఆ పరిస్థితిలో మీరు దేవుడిని చేరుకోలేరు. Paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān ( BG 10.12) (ప్రక్కన) ఎవరు మాట్లాడుతున్నారు Pavitraṁ paramaṁ bhavān. కృష్ణుడు మహోన్నతమైన పవిత్రమైన వారు, pavitraṁ paramam. పరమమ్ అంటే మహోన్నతమైనది. కాబట్టి ఆయన అపవిత్రముగా ఉన్నప్పుడు ఎవరు కృష్ణుడిని సమీపించ లేరు. అది సాధ్యం కాదు. ఉదాహరణకు కొందరు దుష్టుల వలె, వారు చెప్తారు, మీరు ఏమి తింటారు, మీరు ఏమి చేస్తున్నారు అనే దానికి పట్టింపు లేదు, . మీ ఆధ్యాత్మిక పురోగతికి ఎటువంటి ఆటంకము లేదు. " ఈ అవివేకులు, ఈ మూర్ఖులు, మొత్తం ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు మహోన్నతమైన వ్యక్తిని అర్థం చేసుకోనే విషయములో వ్యక్తులు తక్కువ స్థాయి వ్యక్తుల వలె ప్రవర్తించ వచ్చు. లేదు. అది సాధ్యం కాదు. Paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān ( BG 10.12)

మీరు మహోన్నతమైన పవిత్రమైన వ్యక్తిని చేరుకోవాలంటే, మీరు పవిత్రముగా మారాలి. లేకపోతే అవకాశం లేదు. అగ్ని అవ్వకుండా, మీరు అగ్నిలోకి ప్రవేశించలేరు. అప్పుడు మీరు కాల్చివేయబడతారు. అదేవిధముగా, మీరు కూడా బ్రహ్మణ్ అయినప్పటికీ ... పర-బ్రహ్మణ్ యొక్క భాగం కూడా బ్రహ్మణ్. అహం బ్రహ్మాస్మి. ఇది మన గుర్తింపు. కాని ఏ రకమైన బ్రహ్మణ్? కాని బ్రహ్మణ్ యొక్క చిన్న కణము, సూక్ష్మ కణము. ఉదాహరణకు కణము మరియు మొత్తం అగ్ని వలె . అవి రెండు అగ్నినే, కాని అగ్ని కణము కణముగానే ఉంటుంది, మరియు గొప్ప అగ్ని గొప్ప అగ్ని గానే ఉంటుంది. కణము గొప్ప అగ్నిగా మారలేదు. ఆయన అలా కావాలని కోరుకుంటే, ఆయన పడిపోతాడు. అప్పుడు ఎంతైతే చిన్న కాంతి ఉందో, అగ్ని, అది ఆరిపోతుంది. కణము గర్వము వలన గొప్ప అగ్నిగా మారాలని ప్రయత్నిస్తే, అప్పుడు ఆయన క్రింద పడిపోతాడు. Āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ patanty adhaḥ ( SB 10.2.32) Āruhya kṛcchreṇa, తీవ్రమైన తపస్సులు, నిష్ట ద్వారా, మీరు నిరాకార బ్రహ్మణ్ వరకు వెళ్ళవచ్చు, కానీ మీరు మళ్ళీ పతనము అవుతారు. అది సత్యము. చాలామంది వ్యక్తులు, వారు మహోన్నతమైన బ్రహ్మణ్ ఉనికిలో విలీనం కావడానికి ప్రయత్నిస్తున్నారు, కాని ఫలితము వారు పతనమవుతున్నారు. వారు పతనము అయ్యి తీరాలి. ఇది సాధ్యం కాదు. Āruhya kṛcchreṇa paraṁ padaṁ tataḥ patanty adho anādṛta-yuṣmad-aṅghrayaḥ ( SB 10.2.32) కృష్ణుడి యొక్క కమల పాదాలను పూజించుటకు జాగ్రత్త తీసుకోక పోవడము వలన, వారు పతనమవ్వుతారు. కాబట్టి మనము కృష్ణుడి కంటే సమానంగా లేదా ఎక్కువ కావడానికి ప్రయత్నించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు దుష్టులు ఉన్నారు, వారు చెప్తారు "అటువంటి మరియు అటువంటి దుష్టుడు కృష్ణుడి కన్నా గొప్పవాడు" నాకు వారి పేరును పేర్కొనటము ఇష్టము లేదు. ఆ దుష్టులు, వారు "అరబిందో కృష్ణుడి కన్నా గొప్పవాడు" అని చెప్తారు. వారు అలా అంటారు. నీకు అది తెలుసా? ఈ విధముగా, ప్రపంచం, దుష్టులు మరియు మూర్ఖులతో నిండిపోయింది. మనము ... చాలా జాగ్రత్తగా మరియు తెలివిగా మనము ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందవలసి ఉంటుంది. దీనిని చాలా అల్పమైనదిగా తీసుకోకండి. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పతనము ఉంటుంది, మరియు ఒకసారి పతనమయితే పది లక్షల సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటుంది అని అర్థము. కృష్ణ చైతన్యమును పూర్తి చేయడానికి మీరు ఈ మానవ రూపాన్ని పొందారు, కాని మీరు తీవ్రముగా లేకపోతే, అప్పుడు మళ్ళీ మిలియన్ సంవత్సరాలు వేచి ఉండవలసి ఉంటుంది.

అందువలన మన కర్తవ్యం tāṅdera caraṇa sevi, bhakta-sane vās. మనము భక్తులతో నివసిస్తూ, ఆచార్యుల సేవలో నిమగ్నమవ్వాలి. Ācāryaṁ māṁ vijānīyān nāvamanyeta karhicit ( SB 11.17.27) ఆచార్యుడు అంటే కృష్ణుడే అని అర్థం చేసుకోవాలి. ఆయనని నిర్లక్ష్యం చేయవద్దు. Yasya deve parā bhaktir yathā deve tathā gurau (ŚU 6.23). ఇవి ప్రకటనలు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు ఇక్కడ కూడా. brahmādaya, గొప్ప, గొప్ప దేవతలు, వారు భగవంతుడిని శాంతి పరచలేక పోయారు ఆయన కోపంగా ఉన్నాడు. Evaṁ surādayaḥ sarve brahma-rudra-puraḥ sarāḥ. గొప్ప, గొప్ప వ్యక్తులు, rudra, na upaitum. Na upaitum aśakan manyu. వారు ఆయనను శాంతింప చేయలేకపోయారు, మరియు saṁrambhaṁ sudurāsadam. Sudurāsadam, చాలా, చాలా కష్టము. ఒకసారి మనల్ని కృష్ణుడు నిషేధిస్తే, మళ్ళీ ఉన్నత స్థాయికి రావడము చాలా చాలా కష్టము. Mūḍhā janmani janmani ( BG 16.20) జన్మ జన్మలకి మనము నిషేధించ బడుతాము అది మనకు శిక్ష. కావున కృష్ణుడిని సంతోషపెట్టకుండా ఉండేది ఏదీ చేయవద్దు. కేవలం భగవంతుడు యొక్క సేవలో మీరే నిమగ్నము అవ్వండి. చాలా సులభమైన విషయము. Man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) కేవలం ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచించండి. ఎవరి గురించి, దేని గురించి ఆలోచించవద్దు. Sarvopādhi-vinirmuktam ( CC Madhya 19.170) Anyābhilāṣitā-śūnyam (Brs. 1.1.11). కృష్ణుడి కోసం మీ సేవను కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇరవై నాలుగు గంటల సాంగత్యము ఉన్నది, దానిని అనుసరించడానికి ప్రయత్నించండి. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. అది మీ జీవితాన్ని విజయవంతం చేస్తుంది.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ శ్రీల ప్రభుపాద. (ముగింపు)