TE/Prabhupada 0618 - ఈ బాలుడు నాకన్నా ఎక్కువ పురోగమించాడు అని ఆధ్యాత్మిక గురువు చాలా ఆనందించాడు



Lecture on CC Adi-lila 7.91-2 -- Vrndavana, March 13, 1974


ఒక శిష్యుడు ఆధ్యాత్మిక పురోగతిలో పరిపూర్ణంగా మారినప్పుడు, ఆధ్యాత్మిక గురువుకి చాలా, చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఆ "నేను ఒక అర్థంలేని వాడిని, కానీ ఈ బాలుడు, అతను నా ఆదేశాన్ని పాటించాడు మరియు గెలుపును కూడా పొందాడు. అదే నా గెలుపు." ఇది ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశయం. తండ్రి వలె. ఇది ఇటువంటి సంబంధము. ఎలా అంటే... ఎవరు కూడా తనకంటే ఇతరులు ఉన్నతంగా ఎదుగుటకు ఇష్టపడరు. అది స్వభావం. మత్సరత - ఎవరైనా ఏ విషయంలో అయినా ముందుకు సాగినా నేను అతనిపై అసూయ పడేవాడిని కానీ ఆధ్యాత్మిక గురువు లేదా తండ్రి, అతను అసూయపడడు. అతను చాలా, చాలా సంతోష పడతాడు, “ఈ బాలుడు నా కంటే ఉన్నత స్థితికి ఎదిగాడు.” ఇది ఆధ్యాత్మిక గురువు యొక్క స్థితి . అందువల్ల కృష్ణుడు, చైతన్య మహాప్రభు వ్యక్తపరుస్తారు, అతను (అస్పష్టముగా ఉన్నది) దీని “ద్వారా ..., నేను ఎప్పుడైతే జపం చేస్తానో నృత్యం చేస్తానో పారవశ్యంతో ఏడుస్తానో కాబట్టి నా ఆధ్యాత్మిక గురువు ఈ విధంగా నాకు కృతజ్ఞత చెప్తారు: bhāla haila, 'ఇది చాలా మంచిది." Pāile tumi parama-puruṣārtha: "ఇప్పుడు మీరు జీవితంలో ఉన్నతమైన విజయాన్ని సాధించారు." Tomāra premete: "నీవు చాలా పురోగతి పొందావు, āmi hailāṅ kṛtārtha, నేను చాలా ఋణ పడి ఉన్నాను." ఇది పరిస్థితి.

అప్పుడు అతడు ప్రోత్సహిస్తాడు, nāca, gāo, bhakta-saṅge kara saṅkīrtana: ఇప్పుడు కొనసాగండి. మీరు చాలా విజయాలను సాధించారు. ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళండి. Nāca: "మీరు నృత్యం చేయండి." Gāo: మీరు పాడండి కీర్తన చేయండి," bhakta-saṅge, “భక్తుల సమాజంలో. " ఒక వృత్తిని చేయవద్దు, కానీ భక్త- సంగే. ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించే నిజమైన వేదిక ఇది. నరోత్తమ దాస ఠాకూరా కూడా ఇలా చెప్పారు

tāñdera caraṇa-sevi-bhakta-sane vāsa
janame janame mora ei abhilāṣa

నరోత్తమ దాస ఠాకూరా ఏమని అన్నారంటే “జన్మ తర్వాత జన్మ” ఎందుకంటే భక్తుడు, భగవంతుడి ధామమునకు వెళ్లాలి అని ఆశ పడడు. లేదు ఎక్కడైనా. అది పట్టింపు లేదు.అతను కేవలం దేవాది దేవుడిని కీర్తిస్తూ ఉండాలి అని కోరుకుంటాడు. అదే అతని పని. కీర్తన చేయడము, నృత్యం చేయడము మరియు భక్తియుక్త సేవలను చేయడము ఒక భక్తుని యొక్క వ్యాపారము కాదు వైకుంఠం లేదా గోలోక వృందావనముకు వెళ్లేందుకు కాదు. అది కృష్ణుడి కోరిక. “అతను నన్ను ఇష్టపడితే, నన్ను తీసుకొని వెళ్తారు.” భక్తి వినోద ఠాకూర్ చెప్పినట్టుగా : icchā yadi tora. Janmāobi yadi more icchā yadi tora, bhakta-gṛhete janma ha-u pa mora. ఆ భక్తుడు ఏమని ప్రార్థన మాత్రము చేస్తాడు అంటే... అతను కృష్ణుణ్ని అభ్యర్థన చేయడు దయచేసి నన్ను వైకుంఠం లేదా గోలోక వృందావనముకు తీసుకెళ్లండి. లేదు. నేను మళ్ళీ జన్మించాలని మీరు అనుకుంటే, అది సరయినదే. కానీ నాది ఒకే ఒక అభ్యర్థన ఏమిటంటే నన్ను భక్తుల ఇంట్లో పుట్టే విధంగా చేయండి . అంతే. “నేనెప్పుడు నిన్ను మరచి పోకుండా ఉండాలి” ఇది ఒక్కటే భక్తుడు యొక్క ప్రార్థన