TE/Prabhupada 0637 - కృష్ణుడు లేకుండా ఏదీ ఉనికిలో ఉండదు



Lecture on BG 2.30 -- London, August 31, 1973

కాబట్టి ఈ విషయం కృష్ణుడిచే వివరించబడింది, apareyam itas tu viddhi me prakṛtiṁ parāṁ yayedaṁ dhāryate. Jīva-bhūtāṁ mahā-bāho yayedaṁ dhāryate jagat (BG 7.5). కాబట్టి పరమాత్మ మోస్తున్నాడు. అంతా భగవద్గీతలో వివరించారు. అతి బ్రహ్మాండమైన పెద్ద, పెద్ద లోకములు, ఎందుకు గాలి లో బరువు లేకుండా తేలియాడుతున్నాయి? ఇది కూడా వివరించబడింది. Gām āviśya aham ojasā dhārayāmi (BG 15.13). అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఐదు వందల, ఆరు వందల మంది ప్రయాణీకులను తీసుకొని ఒక పెద్ద 747 విమానం తేలియాడుతుంది , ఏ కష్టం లేకుండా ఆకాశంలో ఎగురుతుంది. ఎందుకు? ఎందుకంటే పైలట్ ఉన్నాడు. యంత్రం కాదు. ఇది అతి పెద్ద యంత్రం అని భావించకండి; అందువలన అది ఎగురుతుంది. లేదు. పైలట్ ఉన్నాడు. యంత్రం కూడా ఉంది, కాని తేలియాడటము యాంత్రిక అమరికపై ఆధారపడి ఉండటము వలన కాదు, కానీ పైలట్ మీద ఆధారపడి ఉంది. ఏదైనా అసమ్మతి ఉందా? పైలట్ లేకపోతే, మొత్తం యంత్రం వెంటనే పడిపోతుంది. తక్షణమే. అదేవిధముగా, భగవద్గీత లో ఉన్న ప్రకటన, gām āviśya aham ojasā. Kṛṣṇa కృష్ణుడు మహా లోకములోకి ప్రవేశిస్తాడు. ఆయన లోపల ఉన్నాడు... Aṇḍāntara-stha-paramāṇu-cayāntara-stham. ఇది బ్రహ్మ సంహితలో చెప్పబడింది.

eko 'py asau racayituṁ jagad-aṇḍa-kotiṁ
yac chaktir asti jagad-aṇḍa-cayā yad-antaḥ
aṇḍāntara-stha-paramāṇu-cayāntara-sthaṁ
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.35)

ఈ భౌతికవిశ్వంలో కృష్ణుడు ప్రవేశించకుండా, ఏమీ పని చేయలేదు. అండాంతరస్థ. ఈ విశ్వంలో, ఆయన గర్బోదకశాయి విష్ణువుగా ఉన్నాడు. అందువలన విశ్వం ఉంది. అండాంతరస్థ. విశ్వం లోపల చాలా పదార్థాలు ఉన్నాయి, నేను చెప్పేదానికి అర్థం, విలక్షణతలు, జీవులు. ఈ పరమాణువు కూడా. శాస్త్రం చెప్తుంది పరమాణువులో కూడా, ఆయన, పరమాత్మా గా, ప్రతిఒక్కరి శరీరంలో ఉన్నాడు. జీవుల దేహాలలోనే కాకుండా, పరమాణువులో, అణువులోనూ ఉంటాడు. వారు ఇప్పుడు అణుశక్తిని అధ్యయనం చేస్తున్నారు. అయినా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విభజించడం, విభజించడం, విభజించడం. భగవంతుడు ఉన్నాడని వారు తెలుసుకోలేక పోయారు, అక్కడ కృష్ణుడు ఉన్నాడని.

నేను చెప్పేదానికి అర్థం , కృష్ణుడు లేకుండా ఏదీ ఉండదు. అందువల్ల, కృష్ణ చైతన్యంలో ఉన్నతుడైన వ్యక్తి, ఆయన కృష్ణుడిని మాత్రమే చూస్తాడు. బాహ్య వస్త్రం కాదు. ఎందుకంటే కృష్ణుడు లేకుండా ఏదీ ఉనికిలో ఉండదు. చైతన్య-చరితామృతంలో, ఇది చెప్పబడింది: sthāvara-jaṅgama dekhe రెండు రకాలైన జీవులు ఉన్నాయి: కదిలేవి కదలకుండాఉండేవి. నాన్ మూవింగ్ అంటే స్థావర... మూవింగ్ అంటే జంగమ. స్థావర - జంగమ. స్థావర కదిలేవి కాదు. కాబట్టి రెండు రకాలైన జీవులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ రెండు రకాల జీవులను చూడవచ్చు, వాటిలో కొన్ని కదులుతున్నాయి, వాటిలో కొన్ని కదలకుండా ఉంటాయి. కానీ ఒక మహా-భాగవత రెండు జీవులను చూస్తాడు, కదిలేవి మరియు కదలకుండా ఉండేవి కానీ ఆయన కదిలేవి లేదా కదలకుండా ఉండేవి అని చూడడు. ఆయన కృష్ణుడిని చూస్తాడు. ఎందుకంటే కదిలేవి అంటే జీవ శక్తి అని ఆయనకు తెలుసు. కాబట్టి జీవ శక్తి, ఇది కూడా కృష్ణుడి శక్తి. కదలకుండా ఉండేది పదార్థము. అది కూడా కృష్ణుడి శక్తి