TE/Prabhupada 0643 - కృష్ణ చైతన్యములో ఉన్నత స్థితిలో ఉన్న వారు, వారు కృష్ణుడి కోసం పని చేయాలి



Lecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969


ప్రభుపాద: అవును?

భక్తుడు: ప్రభుపాద, ఇది భగవద్గీతలో వ్రాయబడింది, మనము ఇప్పుడు చదివాము విశ్వాసము ఉండటము గురించి. మనకు కృష్ణుడు సమకూరుస్తాడు అని అంతేగాక, గీతలో చెప్పబడినది, తమకు తాము సహాయం చేసుకొనేవారికి దేవుడు సహాయం చేస్తాడని చెప్పబడింది.

ప్రభుపాద: అవును. భక్తుడు: ఇప్పుడు, మనం ఏమి చేయాలి అని ఎలా నిర్ణయించాలి?

ప్రభుపాద: తమకు తాము సహాయము చేసుకొనటము అంటే కృష్ణుడి పర్యవేక్షణలో మీరు ఉండటము. అది మీకు మీరు సహాయం చేసుకొనుట. మీరు అనుకుంటే, " నేను నన్ను రక్షించుకోగలను", అప్పుడు మీరు మీకు సహాయం చేసుకోలేరు. ఉదాహరణకు ఈ వేలు వలె, అది ఆరోగ్యముగా, పని చేస్తున్నంత వరకు, ఏదైనా ఇబ్బంది ఉంటే, నేను దాని కోసం వేల డాలర్లు ఖర్చు చేయవచ్చు. కాని ఈ వేలు నా శరీరం నుండి కత్తిరించినట్లయితే, మీరు మీ పాదాలతో ఈ వేలును నలిపివేస్తే, నేను దానిని పట్టించుకోను. అదేవిధంగా, తనను తాను సహాయము చేసుకోవటము అంటే సరైన స్థానంలో తనని ఉంచుకోవడము, కృష్ణుడి యొక్క భాగముగా. అది నిజమైన సహాయం. లేకపోతే మీరు ఎలా సహాయపడగలరు? వేలు, చేయి యొక్క సరైన స్థితిలో ఉండి మొత్తం శరీరం కోసం పనిచేయడం ద్వారా తనకు తాను సహాయ పడుతుంది. అది సరైన పరిస్థితి. కానీ వేలు అలా భావిస్తే, నేను ఈ శరీరం నుండి వేరు అయ్యి, నాకు నేను సహాయం చేసుకుంటాను, అది చనిపోతుంది. మీరు ఆలోచించిన వెంటనే, "నేను స్వతంత్రంగా జీవిస్తాను, కృష్ణుడు అంటే పట్టింపు లేకుండా, "అది నా మరణము, నేను కృష్ణుడి యొక్క భాగముగా నన్ను నేను వినియోగించుకుంటే, అది నా జీవితము.

కాబట్టి తనకి తాను సహాయము చేసుకోవటము అంటే తనను తాను తెలుసుకోవటము ఆ విధముగా పని చేయటము. ఇది సహాయము చేయటము అంటే. తన స్థానమేమిటో తెలుసుకోకుండా, తనకు తాను ఎలా సహాయము చేసుకోగలడు? ఇది సాధ్యం కాదు. అవును?

భక్తుడు: అప్పుడు మనం ఎల్లప్పుడూ విచక్షణతో, ఎల్లవేళలా కృష్ణుడిని సేవించడానికి ప్రయత్నించాలి మరియు కృష్ణుడు మనకు సేవ చేయకుండా. కృష్ణుని సేవ చేయడానికి ప్రయత్నించాలి అని ఎల్లప్పుడూ భావించాలి, మనము దీనిని చేస్తాము కృష్ణుడు మనకు సమకూరుస్తాడు, కృష్ణుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పకూడదు.

ప్రభుపాద: మీరు కృష్ణుడికి సేవ చేస్తున్నారు, అంటే మీరు చేస్తున్నారు. సేవ చేయడము అంటే చేయడము. సేవ చేయడము అంటే ఏమిటి? వాస్తవానికి మీరు ఎవరికైనా సేవ చేస్తున్నప్పుడు, మీరు ఏమైనా చేయటము లేదా? మీరు ఎలా కృష్ణుడికి సేవ చేస్తున్నారు? మీరు కృష్ణ చైతన్యమును ప్రచారము చేయడానికి వెళ్తున్నారు, మీరు వంట చేస్తున్నారు, మీరు శుభ్రపరుస్తున్నారు, మీరు చాలామంది ఉన్నారు, ఏదో చేస్తున్నారు. కావున కృష్ణుడికి సహాయం చేయడం అంటే సేవ చేయడము. కృష్ణుడికి సహాయపడటం అంటే కేవలము కదలకుండా కూర్చోవటము కాదు. అవి కృష్ణ చైతన్య కార్యక్రమాలు. మీరు పని చేయడానికి మీ దగ్గర ఏ ఆస్తి ఉన్నా, కృష్ణుడి కోసము ఉపయోగించుకోండి. అది భక్తి. ఇప్పుడు మనకు ఉన్నాయి, మనకున్న ఆస్తులు ఏమిటి? మనకు మనస్సు ఉన్నది. సరే, కృష్ణుడి గురించి ఆలోచించండి. మనకు ఈ చేయి ఉంది - కృష్ణుడి కోసం దేవాలయమును కడగండి లేదా వంట చేయండి మనకు కాళ్ళు ఉన్నాయి - కృష్ణుడి దేవాలయానికి వెళ్ళండి. మనకు ఈ ముక్కు ఉన్నది - , కృష్ణుడికి ఇచ్చిన పువ్వులను వాసన చూడండి. కావున మీరు నిమగ్నం అవచ్చు. కాబట్టి కృష్ణ చైతన్యము అంటే పని చేయడము, పని. అర్జునుడు, ఆయన యుద్ధము చేయడానికి తిరస్కరిస్తున్నాడు. కృష్ణుడు ఆయనని యుద్ధము చేయడానికి ఉత్సాహ పరుస్తున్నాడు. ఇది మొత్తం భగవద్గీత. కృష్ణ చైతన్యము అంటే పని లేకపోవటము అని అర్థం కాదు. కృష్ణ చైతన్యములో నిమగ్నం అవడమంటే కృష్ణుడి కోసం పని చేయడము. కృష్ణుడి కోసం కృష్ణుడు చెప్పలేదు. అయితే ఈ అధ్యాయంలో, కృష్ణుడు కొంత చెప్తాడు ... అర్జునుడితో ఎన్నడూ చెప్పలేదు: "నా ప్రియమైన మిత్రుడా అర్జునా, నీవు ఈ ప్రపంచము గురించి పట్టించుకోవద్దు. కూర్చుని నా మీద ధ్యానము చేయి ". మీరు భగవద్గీతలో చూసినారా? ఈ ధ్యానం అంటే అర్థం లేని పనులను, కదలకుండా కూర్చోవడము ఆపడము కాని కృష్ణ చైతన్యములో ఉన్నత స్థితిలో ఉన్న వారు, వారు కృష్ణుడి కోసం పని చేయాలి. ఉదాహరణకు పిల్లవాడిలాగానే. కేవలం ఇంటిని కలవర పెడుతున్నట్లు. తల్లి చెప్పుతుంది, "నా ప్రియమైన బాలుడా, ఇక్కడ కూర్చొని ఉండు." ఆయన చక్కగా పని చేస్తే, "అవును," తల్లి అడుగుతుంది, "నా ప్రియమైన పుత్రుడా, నీవు దీన్ని చేయాలి, నీవు దానిని చేయాలి, నీవు దానిని చేయాలి." కాబట్టి అర్థం లేనివి చేస్తున్నావు కనుక కదలకుండా కూర్చో. అర్థము ఉన్న వాటిని చేయటము వలన కాదు. అర్థంలేని వాటి కొరకు, ఎంత సేపు వాడు క్రింద కూర్చుని ఉంటే, కనీసం వాడు ఏ అర్థంలేనివి చేయకుండా ఉంటే, అంతే. అర్థంలేని వాటిని నిరాకరణ. అది సానుకూలము కాదు. ఇక్కడ సానుకూల కార్యక్రమాలు ఉన్నాయి.

కాబట్టి నిరాకరణ జీవితం కాదు. సానుకూల జీవితమే జీవితము. దీన్ని చేయకండి, ఇది జీవితం కాదు. "దీన్ని చేయండి," ఇది జీవితం. కాని సరిగ్గా చేయటానికి, కొన్ని విషయాలు ఉన్నాయి. "చేయవద్దు." చేయవద్దు అనేది జీవితం కాదు, "చేయండి" అనేది జీవితం. భగవద్గీత మొత్తం "చేయండి." "నా కోసం పోరాడండి." చేయవద్దు. అనేది లేదు "నన్ను ప్రేరేపించవద్దు" అని అర్జునుడు కోరుకున్నాడు. కృష్ణుడికి అది ఇష్టం లేదు. మీరు ఆర్యన్ కాని వారి లాగా మాట్లాడుతున్నారు. Kutas tvā kaśmalam idam. Anārya-juṣṭam ( BG 2.2) ఈ రకమైన మాటలు ఆర్యన్ కాని వారు మాట్లాడతారు. ఆయన ఆర్యన్ కాని వాడు అని నిందించబడ్డాడు. Anārya. కాబట్టి కృష్ణ చైతన్యము ఖాళీగా కూర్చోవటము అని అర్థం కాదు, లేదు. మనకు కృష్ణుడి లీలలు మొత్తం ఉన్నాయి పూర్తిగా కార్యక్రమాలతో ఉన్నాయి. మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఎల్లప్పుడూ నృత్యం చేస్తాడు. మీరు ఇరవై నాలుగు గంటలు అక్కడ నృత్యం చేసి అక్కడే తినాలి. కూర్చోవాలని ఎక్కడ ఉన్నది? కూర్చోవటము అనే ప్రశ్నే లేదు. మీరు గోపికలు ధ్యానం చేస్తున్నారని ఎప్పుడైనా విన్నారా? కూర్చోoడి. (నవ్వు) నువ్వు విన్నావా? భూమిపై, కృష్ణుడు... చైతన్య మహాప్రభు? ఆయన చేసాడు, ఆయన ఏమి చేసాడు, నృత్యం చేశాడు, "హరే కృష్ణ." మీరు చూడoడి? మీరు చూడండి స్పూర్తిని, మీరు ఆత్మ, నీవు నిన్ను నిశ్శబ్దంగా ఎలా ఉండగలవు? అది సాధ్యం కాదు. అర్జునుడు నిరాకరించారు, ఎప్పుడు ... అర్జునుడికి సిఫార్సు చేసినప్పుడు మీరు ఈ అధ్యాయంలో కనుగొంటారు, నా ప్రియమైన అర్జునా, నీవు ధ్యానం చేయి. ఆయన వెంటనే నిరాకరించాడు. నా ప్రియమైన కృష్ణ, నాకు అది సాధ్యం కాదు. నాకు అది సాధ్యం కాదు. అది వాస్తవం. ఎలా ఆయనకి సాధ్యము అవుతుంది? ఆయన గృహస్థుడు, ఆయన రాజ్యం కోరుకున్నాడు, ఆయన దేశమును పాలించాలని కోరుకున్నాడు. ఎలా, ఆయనకు ధ్యానం కోసం సమయం ఎక్కడ ఉంది? ఆయన మొహమాటము లేకుండా నిరాకరించాడు. "నా ప్రియమైన కృష్ణ, ఇది నాకు సాధ్యము కాదు." ఆయన అన్నాడు మనస్సును నియంత్రించడము అనేది: vāyor iva suduṣkaram. గాలిని నియంత్రించడము ఎంత కష్టమో అంత కష్టము. అది వాస్తవము. మీరు కృష్ణుడి మీద మనస్సును నిమగ్నము చేయాలి. అప్పుడు అది నియంత్రించబడుతుంది. లేకపోతే, కృత్రిమముగా మీరు నియంత్రించలేరు. అది అసాధ్యం. అర్జునుడు చెప్పాడు, ఇతరుల గురించి ఏమి మాట్లాడాలి? అర్జునా అర్జునుడు ఎవరు? స్వయముగా కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. ఆయన సాధారణ మనిషి అని మీరు అనుకుంటున్నారా? అది అసాధ్యమని ఆయన అన్నారు. Vāyor iva suduṣkaram ( BG 6.34)

ఆయన ఇదే ఉదాహరణను ఇచ్చాడు. Cañcalaṁ hi manaḥ kṛṣṇa pramāthi balavad dṛḍham ( BG 6.34) నా ప్రియమైన కృష్ణా, నీవు మనస్సుని నియంత్రించమని నన్ను అడుగుతున్నావు. ఇది చాలా శక్తివంతమైనది, కలతచెందినది, - నేను అనుకుంటున్నాను గాలి నియంత్రించడము మనస్సును నియంత్రించడము వంటిది . తీవ్రమైన గాలి ఉంటే, మీరు దాన్ని నియంత్రించ గలరా? అందువలన ఆయన ఈ ఉదాహరణను ఇచ్చాడు. మీరు కృష్ణుడి కమల పాదములపై మీ మనస్సును నిమగ్నము చేస్తే మీరు మీ మనస్సుని నియంత్రించ గలరు, అంతే. మీ మనసులో ఎటువంటి చెత్త రాదు. కేవలం కృష్ణుడు మాత్రమే. అది ధ్యానం యొక్క పరిపూర్ణత