TE/Prabhupada 0653 - భగవంతుడు ఒక వ్యక్తి కాకుంటే, అప్పుడు ఆయన కుమారులు ఎలా వ్యక్తులు అవుతారు



Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969


భక్తుడు: "పద్మ పురాణములో ఇది చెప్పబడినది, శ్రీ కృష్ణుడి నామము, రూపం, లక్షణాలు మరియు లీలల యొక్క దివ్యమైన స్వభావమును ఎవరూ గ్రహించలేరు తన యొక్క, భౌతికంగా కలుషితమైన భావాలతో. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా భగవంతుడు యొక్క దివ్యమైన సేవ ద్వారా సంతృప్తి చెందినప్పుడు, భగవంతుడు యొక్క దివ్యమైన నామము, రూపం, లక్షణము మరియు లీలలు ఆయనకి వెల్లడి అవుతాయి."

ప్రభుపాద: అవును, ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు, కృష్ణుని, మనము కృష్ణుడిని మహోన్నతమైన భగవంతుడిగా అంగీకరిస్తున్నాము. ఇప్పుడు, కృష్ణుడిని భగవంతుడిగా మనము ఎలా అంగీకరిస్తాము? ఇది వేదముల సాహిత్యంలో, ఉదాహరణకు బ్రహ్మ సంహితలో పేర్కొనబడింది, īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ (BS 5.1). ఊహించుకోవటము... తమో మరియు రజో గుణములలో ఉన్నవారు, వారు భగవంతుడు రూపాన్ని ఊహించుకుంటారు. వారు గందరగోళంలో ఉన్నప్పుడు, "భగవంతుడు వ్యక్తి కాదు, అది అంతా నిరాకారము లేదా శూన్యము" అని అంటారు. అది నిరాశ. కానీ వాస్తవానికి, భగవంతుడుకి రూపం ఉంది. ఎందుకు ఉండకూడదు? వేదాంతం చెప్తుంది, janmādy asya yataḥ ( SB 1.1.1) మహోన్నతమైన పరమ వాస్తవము అనేది ఎవరి నుండి లేదా దేని నుండి ప్రతిదీ వస్తుందో? ఇప్పుడు మనకు రూపాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా, తప్పకుండా కలిగి ఉండాలి... మనము మాత్రమే కాదు, జీవులు వివిధ రకాలు ఉన్నాయి. అవి ఎక్కడ నుండి వస్తాయి? ఈ రూపము ఎక్కడ నుండి ప్రారంభమయినది? ఇది చాలా లోకజ్ఞానము, జ్ఞానము ప్రశ్న. భగవంతుడు ఒక వ్యక్తి కాకుంటే, అప్పుడు ఆయన కుమారులు ఎలా వ్యక్తులు అవుతారు? మీ తండ్రి ఒక వ్యక్తి కాకపోతే, మీరు ఎలా ఒక వ్యక్తి అవుతారు? ఇది చాలా లోకజ్ఞానము, జ్ఞానము ప్రశ్న. నా తండ్రికి రూపం లేకపోతే, నాకు ఈ రూపము ఎక్కడ నుండి వచ్చింది? కానీ ప్రజలు ఊహించుకుంటారు, వారు విసుగు చెందినప్పుడు, ఈ రూపం సమస్యాత్మకంగా ఉందని వారు చూసినప్పుడు, అందువలన భగవంతుడు రూపము కలిగి లేరు అని అనుకుంటారు. ఇది రూపం కలిగి ఉండటము యొక్క వ్యతిరేక భావన. కానీ బ్రహ్మ సంహిత కాదు అని చెప్తుంది. భగవంతుడుకి రూపం ఉంది, కానీ అతడు సచ్చిదానంద విగ్రహ Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ (BS 5.1). సత్,చిత్, ఆనంద. సత్ అంటే శాశ్వతమైనది సత్ అంటే అర్థం శాశ్వతమైనది, చిత్ అంటే అర్థం జ్ఞానం, ఆనంద అంటే అర్థం ఆనందం. కాబట్టి భగవంతునికి రూపం ఉంది, కానీ ఆయనకు ఉన్న రూపము సంపూర్ణమైన ఆనందంతో ఉంటుంది, సంపూర్ణమైన జ్ఞానముతో ఉంటుంది, మరియు శాశ్వతమైనది. ఇపుడు మీ శరీరముతో పోల్చుకోండి. మీ శరీరం శాశ్వతమైనది కాదు లేదా సంపూర్ణమైన ఆనందముతో లేదా సంపూర్ణమైన జ్ఞానముతో లేదు. అందువలన భగవంతుడికి రూపం ఉంది, కానీ ఆయనకు వేరొక రూపం ఉంది. కానీ మనము ఆయన రూపము గురించి మాట్లాడిన వెంటనే, మనము ఈ రూపం ఇలా ఉండాలి అని అనుకుంటాము. అందువలన వ్యతిరేకంగా, ఏ రూపం లేదు అంటారు. అది జ్ఞానం కాదు. ఇది జ్ఞానం కాదు. అందువలన పద్మపురాణములో మీరు అర్థం చేసుకోలేరని చెప్పబడింది, రూపం, నామము, లక్షణము, భగవంతుని వస్తువులు గురించి ఈ భౌతిక భావాలతో. Ataḥ śrī-kṛṣṇā-nāmādi na bhaved grāhyam indriyaiḥ ( SB 1.1.1) మీ ఇంద్రియ కల్పన ద్వారా, మీ ఇంద్రియాలు అసంపూర్ణంగా ఉన్నందున, మీరు భగవంతుని గురించి ఎలా కల్పన చేయగలరు? అది సాధ్యం కాదు. అప్పుడు ఎలా సాధ్యమవుతుంది?Sevonmukhe hi jihvādau. మీరు మీ ఇంద్రియాలకు శిక్షణ ఇస్తే, మీరు మీ ఇంద్రియాలను పవిత్రము చేసుకుంటే, పవిత్రము చేయబడిన ఇంద్రియాలు భగవంతుడుని చూడడానికి మీకు సహాయం చేస్తాయి.

ఉదాహరణకు మీకు ఏదైనా వ్యాధి వస్తే, మీ కంటిపై కంటిశుక్లం, మీరు చూడలేరని అర్థం కాదు. మీ కళ్ళు కంటిశుక్లం వలన బాధపడుతున్నందున, మీరు చూడలేరు. అంటే చూడడానికి ఏమీ లేదని అర్థం కాదు. మీరు చూడలేరు. అదేవిధముగా, మీరు ఇప్పుడు భగవంతుడు రూపం ఎలా ఉంటుంది అని అర్థము చేసుకోలేరు, కానీ మీ కంటిశుక్లం తొలగించబడినట్లయితే, మీరు చూడగలరు. అది అవసరం. Premāñjana-cchurita-bhakti-vilocanena santaḥ sadaiva hṛdayeṣu vilokayanti (BS 5.38). బ్రహ్మ సంహిత ఇలా చెప్తుంది, భక్తులు ఎవరికైతే భగవంతుని ప్రేమ అనే లేపనముతో అద్దబడిన కళ్ళు ఉన్నాయో, అలాంటి వ్యక్తులు తన హృదయం లోపల, భగవంతుణ్ణి, కృష్ణుడిని, ఎల్లప్పుడూ, ఇరవై నాలుగు గంటలు చూస్తుంటారు. అంతే కానీ... కావున మీరు మీ ఇంద్రియాలను పవిత్రము చేసుకోవాలి. అప్పుడు మీరు భగవంతుడు రూపాన్ని అర్థం చేసుకోగలుగుతారు, భగవంతుడు నామము ఏమిటి, భగవంతుడు లక్షణము ఏమిటి, భగవంతుడు సామగ్రి ఏమిటి. భగవంతుడుకి ప్రతిదీ ఉంది. ఈ విషయాలు వేదముల సాహిత్యంలో చర్చించబడినవి.

ఉదాహరణకు apāni-pādo javana-gṛhīta. భగవంతునికి చేతులు లేదా కాళ్ళు లేవని చెప్పబడింది. కానీ ఆయన మీరు అర్పించే దేనినైనా అంగీకరించగలడు. భగవంతుడుకి కళ్ళు మరియు చెవులు లేవు, కానీ ఆయన ప్రతిదీ చూడగలడు ఆయన ప్రతిదీ వినగలడు. కాబట్టి ఇవి విరుద్ధమైనవి. అంటే, మనము ఎప్పుడైనా చూడటము గురించి మాట్లాడినట్లితే మనము ఎవరైనా ఇటువంటి కళ్ళు కలిగి ఉండాలి అని అనుకుంటాము. ఇది మన భౌతిక భావన. భగవంతునికి కళ్ళు ఉన్నాయి, ఆయన చీకటిలో కూడా చూడగలడు. మీరు చీకటిలో చూడలేరు. కాబట్టి ఆయనకు వేరే రకమైన కళ్ళు ఉన్నాయి భగవంతుడు వినగలడు. మీరైతే… భగవంతుడు తన రాజ్యంలో ఉన్నాడు, ఇది లక్షలాది మైళ్ల దూరంలో ఉంది, కానీ మీరు ఏదైనా మాట్లాడితే, గుసగుసలాడితే, కుట్ర చేస్తే, ఆయన వినగలడు. ఎందుకంటే ఆయన మీలో కూర్చొని ఉన్నాడు. కాబట్టి మీరు భగవంతుడు చూడటం భగవంతుడు వినటము లేదా భగవంతుడు తాకటమును నివారించలేరు.