TE/Prabhupada 0677 - గోస్వామి అనేది ఒక వంశపారంపర్యలో వచ్చే బిరుదు కాదు. ఇది ఒక అర్హత



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969


ప్రభుపాద: ఇంద్రియాల నియంత్రణలో ఉన్నవాడు, అతడు గో-దాస. గో అంటే ఇంద్రియాలు అని అర్థం. దాస అంటే సేవకుడు. ఎవరైతే ఇంద్రియాలకు గురువో ఆయనను గోస్వామి అని అంటారు. స్వామి అంటే గురువు. గో అంటే ఇంద్రియాలు. మీరు గోస్వామి బిరుదును చూసారు. గోస్వామి అంటే అర్థం ఇంద్రియాల యజమాని అని అర్థం, ఇంద్రియాల యొక్క సేవకుడు కాదు అని అర్థము. ఎంత కాలం ఇంద్రియాల యొక్క సేవకుడుగా ఉంటాడో, ఆయనను ఒక గోస్వామి లేదా స్వామి అని పిలువకూడదు. స్వామి లేదా గోస్వామి , ఒకటే విషయము, వారు ఇంద్రియాలకు గురువు అని అర్థం. అతడు ఇంద్రియాలకు గురువు అయితే తప్ప, ఆయన స్వామి లేదా గోస్వామి అనే బిరుదును స్వీకరించుట మోసం చేయుట అవుతుంది. ఒకరు ఇంద్రియాల యొక్క గురువు అయి ఉండాలి. అది రూప గోస్వామిచే నిర్వచించబడింది. గోస్వామి, రూప గోస్వామి. వారు మంత్రులుగా ఉన్నారు. వారు మంత్రులుగా ఉన్నప్పుడు వారు గోస్వామి కాదు. కాని వారు చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు అయినప్పుడు , సనాతన గోస్వామి, రూప గోస్వామి ఆయన ద్వారా శిక్షణ పొందారు, వారు గోస్వామి అయ్యారు.

గోస్వామి అనేది ఒక వంశపారంపర్యలో వచ్చే బిరుదు కాదు. ఇది ఒక అర్హత. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆధ్వర్యంలో. ఇంద్రియాలను నియంత్రించడంలో పరిపూర్ణత సాధించే వ్యక్తి, ఆయనను స్వామి లేదా గోస్వామి అని అంటారు. కావున ప్రతి ఒక్కరు స్వామి లేదా గోస్వామి కావలెను. అప్పుడు అతడు ఆధ్యాత్మిక గురువుగా మారవచ్చు. స్వామి లేదా ఇంద్రియాలకు యజమాని కాకుండా, ఆధ్యాత్మిక గురువు అవటము బూటకము ఇది కూడా రూప గోస్వామిచే నిర్వచించబడింది. ఆయన చెప్తాడు:

vāco vegaṁ manasaḥ krodha-vegaṁ
jihvā-vegam udaropastha-vegam
etān vegān yo viṣaheta dhīraḥ
sarvām apīmāṁ pṛthivīṁ sa śiṣyāt
(NOI 1)

ఆయన ఆరు ప్రేరణలు,ఉద్రేకాలు, వేగం అని అన్నారు. ఉద్రేకాలు. వేగం , మీరు అర్థం చేసుకోవచ్చు, ఉదాహరణకు మీరు ప్రకృతిచే పిలువబడ్డారు మీరు టాయిలెట్ గదికి వెళ్ళాలి. మీరు ఆపుకోలేరు మీరు సమాధానం చెప్పాలి. దానిని వేగం అని పిలుస్తారు. కావున ఆరు వేగాలు ఉన్నాయి,ఉద్రేకాలు. అది ఏమిటి? వాచో వేగం. వేగం, మాట్లాడాలనే ఉద్రేకము. అనవసరంగా మాట్లాడటం. ఇది మాట్లాడాలనే ఉద్రేకము క్రోధ- వేగం . కొన్నిసార్లు కోపం యొక్క ఉద్రేకము ఉంటుంది. నేను చాలా కోపంగా ఉంటే నన్ను నేను ఆపుకోలేను. నేను చేయకూడనిది నేను చేస్తాను. కొన్నిసార్లు కోపంతో, తన స్వంత మనుషులను చంపేస్తాడు. దీనిని వేగం అని పిలుస్తారు. ఉద్రేకము కాబట్టి మాట్లాడలనే ఉద్రేకము, కోపము యొక్క ఉద్రేకము,... అదేవిధముగా మనస్సు యొక్క ఉద్రేకము. మనస్సు నిర్దేశిస్తుంది, "మీరు ఒక్కసారిగా అక్కడకు వెళ్లాలి." తక్షణమే. మాట్లాడే ఉద్రేకము, కోపము యొక్క ఉద్రేకము, మనస్సు యొక్క ఉద్రేకము తరువాత నాలుక యొక్క ఉద్రేకము. జిహ్వ- వేగం అంటే నాలుక. నేను అలాంటి మంచి వాటిని రుచి చూడాలనుకుంటున్నాను. కొన్ని రసగుల్లాలను లేదా నేను చాలా ఇష్టపడే వాటిని ఏమైనా. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని నియంత్రించుకోవాలి . తను అనవసరంగా మాట్లాడటం నియంత్రించుకోవాలి. మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి, మనస్సు యొక్క నిర్దేశాలను. యోగ అభ్యాసం మనస్సు పై మాత్రమే ఉంది. కాని మన కృష్ణ చైతన్య ఆచరణలో ఉన్నాయి... మనస్సు తప్ప చాలా ఇతర విషయాలు ఉన్నాయి.

ఉదాహరణకు కోపం, నాలుక వలె. అప్పుడు జిహ్వ- వేగం . అప్పుడు ఉదర-వేగం. నాలుక నుండి కొద్దిగా క్రిందకు రండి. ఉదర అంటే పొట్ట పొట్ట ఇప్పటికే నింపబడి ఉంది, అయినప్పటికీ నేను దాన్ని ఇంకా నింపాలి అని అనుకుంటున్నాను. అది వేగం అని పిలుస్తారు, పొట్ట యొక్క ఉద్రేకము నాలుక , పొట్ట యొక్క ఉద్రేకము చాల ఎక్కువగా ఉంటే, వాటి క్రింద తరువాత, జననేంద్రియము, జననేంద్రియము యొక్క ఉద్రేకము. అప్పుడు నాకు కొంత మైథున సుఖము అవసరం. నేను మరింత తిన్నా, నేను నా నాలుకను అనవసరముగా ఉపయోగిస్తే, నా మనస్సును ఏదైనా లేదా అన్నింటినీ చేయడానికి అనుమతించినట్లయితే, అప్పుడు నా జననేంద్రియాలను నేను నియంత్రించలేను. నాకు నియంత్రించలేని మైథున కోరిక కలుగుతుంది. ఈ విధముగా చాలా ఉద్రేకములు ఉన్నాయి. రూప గోస్వామి చెప్తాడు ఈ ఉద్రేకాల యంత్రం మీద నియంత్రణ కలిగి ఉన్నవాడు, ఆయన ఆధ్యాత్మిక గురువు అవవచ్చు. ఆధ్యాత్మిక గురువు అంటే తయారు చేయబడినది కాదు. అతడు దీనిని నేర్చుకొని ఉండాలి. ఈ ఉద్రేకాలను ఎలా నియంత్రించుకోవాలి. Etān vegān yo viṣaheta dhīraḥ (Nectar of Instruction 1). ఈ ఉద్రేకాలను నియంత్రించగలవాడు, అతడు ధీరః, స్థిరముగా ఉంటాడు, pṛthivīṁ sa śiṣyāt: ఆయన ప్రపంచ వ్యాప్తంగా శిష్యులను చేయవచ్చు. మొత్తము. అవును.

కాబట్టి ప్రతిదీ శిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అది యోగ పద్ధతి. యోగ అంటే, మొత్తం యోగ పద్ధతి అంటే శిక్షణ. మన ఇంద్రియాలు, మన మనస్సు, మన ఇది, అది, కావున చాలా విషయాలు. అప్పుడు మనము ఆత్మ స్థితిలో స్థిరపడతాము. మీరు కేవలం పదిహేను నిమిషాల ధ్యానం ద్వారా తెలుసుకుంటారు అని అనుకుంటున్నారా? రోజు అంతా అర్థం లేనివి చేస్తాను? కాదు. దీనికి శిక్షణ అవసరం. మీరు జీవిత సమస్యలను పరిష్కరించబోతున్నారు మీరు చాలా నాణ్యత లేకుండా చేయాలనుకుంటున్నారా? లేదు, అప్పుడు మీరు మోసం చేయబడతారు. మీరు దాని కోసం చెల్లించాలి, కష్టపడాలి. మీకు మంచి విషయము కావాలంటే అప్పుడు మీరు దాని కోసం చెల్లించాలి, శ్రమించాలి. కానీ చైతన్య మహాప్రభు దయ వలన, చెల్లింపు చాలా సులభం చేయబడింది. హరే కృష్ణ కీర్తన చేయండి . ప్రతిదీ చాలా సులభం అవుతుంది. ఈ నియంత్రణ పద్ధతి అంతా, యోగ పద్ధతి యొక్క పరిపూర్ణము, చాలా సులభం అవుతుంది. అది చైతన్య మహాప్రభు యొక్క దయ. Ihā haite sarva-siddhi haibe tomāra (Caitanya-bhāgavata 23.78). చైతన్య మహా ప్రభు దీవెన ఇచ్చారు మీరు ఈ సూత్రం అనుసరిస్తే, కీర్తన చేయడము, అప్పుడు మీరు ఆత్మ-సాక్షాత్కారము యొక్క సమస్త పరిపూర్ణతను పొందుతారు.అది సత్యము.

ఈ యుగము కోసం, ప్రజలు చాలా పతితులైనప్పుడు, ఏ ఇతర పద్ధతి విజయవంతం కాదు. ఈ పద్ధతి మాత్రమే పద్ధతి. ఇది చాలా సులభం ఉత్కృష్టమైనది, సమర్థవంతమైనది ఆచరణాత్మకమైనది, ఎవరైనా గ్రహించవచ్చు. Pratyakṣāvagamaṁ dharmyam ( BG 9.2) భగవద్గీతలో మీరు ఆచరణాత్మకంగా అనుభవించవచ్చని చెప్పబడింది ఇతర పద్ధతిలో, మీరు ఆచరణాత్మకంగా అనుభవించలేరు, మీరు ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నారో . కాని ఈ పద్ధతి, మీరు అనుసరిస్తే, కొన్ని రోజుల పాటు, మీరు తెలుసుకుంటారు "అవును, నేను పురోగతి చెందుతున్నాను" అని . ఉదాహరణకు మీరు భుజిస్తే, మీ ఆకలి తీరింది అని అర్థం చేసుకుంటారు. అదేవిధముగా మీరు కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ఈ సూత్రాన్ని అనుసరిస్తే, మీరు ఆత్మ సాక్షాత్కారము విషయములో ఉన్నత స్థానముకు వెళ్ళుతున్నారని మీకు మీరుగా చూస్తారు. కొనసాగండి.

విష్ణుజన: "మనస్సును నియంత్రించుకున్న వ్యక్తి, అందువలన ఇంద్రియాలను కూడా అతనిని గోస్వామి లేదా స్వామి అని పిలుస్తారు. మనస్సు చేత నియంత్రించబడేవానిని గో-దాస అని పిలుస్తారు, లేదా ఇంద్రియాల యొక్క సేవకుడు. ఒక గోస్వామికి ఇంద్రియాల ఆనందం యొక్క ప్రమాణము తెలుసు. ఆధ్యాత్మిక ఇంద్రియ ఆనందములో, హృషీకేశుని యొక్క సేవలో ఇంద్రియాలు నిమగ్నమయ్యాయి లేదా ఇంద్రియాల మహోన్నతమైన యజమాని - కృష్ణుడి సేవలో. పవిత్రము చేయబడిన ఇంద్రియాలతో కృష్ణుడికి సేవలను అందించడము కృష్ణ చైతన్యము. పూర్తి నియంత్రణలోకి ఇంద్రియాలను తీసుకురావటానికి ఇది మార్గము. ఇంకా ఏమి ఉంది, అది యోగాభ్యాసం యొక్క అత్యధిక పరిపూర్ణత.