TE/Prabhupada 0680 - మనము ఈ నేల మీద కూర్చొని ఉన్నాము, కాని వాస్తవానికి మనము కృష్ణునిలో కూర్చుంటున్నాము



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969


కాబట్టి "వాస్తవమైన యోగి నన్ను అన్ని జీవులలో గమనిస్తాడు. నాలో ప్రతి ఒక్కరిని కూడా చూస్తాడు . "ఎలా," నాలో "? ఎందుకంటే మీరు ఏం చూస్తున్నారో అదంతా, అది కృష్ణుడు. మీరు ఈ నేలమీద కూర్చొని ఉంటారు కాబట్టి మీరు కృష్ణుడిపై కూర్చొని ఉంటారు. మీరు ఈ కార్పెట్ మీద కూర్చొని ఉంటారు, మీరు కృష్ణుడిపై కూర్చొని ఉంటారు. అది మీరు తెలుసుకోవాలి. ఈ కార్పెట్ ఎలా కృష్ణుడు? ఎందుకంటే కార్పెట్ కృష్ణుడి శక్తితో తయారు చేయబడింది.

వివిధ రకాలు ఉన్నాయి - parāsya śaktir vividhaiva śrūyate ( CC Madhya 13.65 purport) - దేవాదిదేవుడు వివిధ శక్తులను కలిగి ఉన్నాడు. ఆ వివిధ శక్తుల నుండి, మూడు ప్రాధమిక విభాగాలు ఉన్నాయి. భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి తటస్త శక్తి. మనము జీవులము మనం తటస్త శక్తి. మొత్తం భౌతిక ప్రపంచమంతా భౌతిక శక్తి. అక్కడ ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచం. మనము తటస్తముగా ఉంటాము. అందువలన మనం భౌతిక శక్తిలో అయినా కూర్చుని ఉన్నాము మార్జినల్ అంటే ఈ విధముగా లేదా ఆ విధముగా అని అర్థం. మీరు ఆధ్యాత్మికంగా తయారవుతుండవచ్చు లేదా మీరు భౌతికత్వంలో ఉండవచ్చు మూడవ ప్రత్యామ్నాయం లేదు. మీరు భౌతికవాదిగా లేదా ఆధ్యాత్మికవాదిగా తయారవుతారు. కాబట్టి, ఎంత మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామో, మీరు భౌతిక శక్తి మీద కూర్చుని ఉంటారు, కావున మీరు కృష్ణునిలో కూర్చుని ఉంటారు. ఎందుకంటే కృష్ణుని నుండి శక్తి విడిపోదు. ఈ కాంతి వలె, ఈ మంట, అందులో వేడి మరియు వెలుగు ఉంది. రెండు శక్తులు. అగ్ని నుండి వేడి వేరు చేయబడదు, అగ్ని నుండి ప్రకాశం వేరు చేయబడదు. కాబట్టి ఒక కోణంలో వేడి కూడా అగ్ని, ప్రకాశం కూడా అగ్ని. అదేవిధముగా ఈ భౌతిక శక్తి కూడా కృష్ణుడు. కాబట్టి మనము ఈ నేల మీద కూర్చొని ఉన్నాము, కాని వాస్తవానికి మనము కృష్ణునిలో కూర్చుంటున్నాము. ఇది తత్వము.

కాబట్టి,"... ప్రతీదీ నాలో ఉండటం కూడా చూస్తారు. నిజానికి, ఆత్మ-సాక్షాత్కారం పొందిన మనిషి ప్రతిచోటా నన్ను చూస్తాడు. " అది ప్రతిచోటా చూడటము. ప్రతి దానిని చూడటము , కృష్ణుని సంబంధములో అంటే, మీరు కృష్ణున్ని ప్రతిచోటా చూస్తారని అర్థం. ఇది భగవద్గీతలో యథాతథముగా నేర్పబడినది: raso 'ham apsu kaunteya ( BG 7.8) నేను నీటి రుచిని. అన్ని జీవులూ నీరు ఎందుకు త్రాగుతాయి? జంతువులు, పక్షులు, మృగములు, మనిషి, మానవుడు, ప్రతి ఒక్కరూ నీటిని త్రాగుతారు. కాబట్టి నీరు చాలా అవసరం. కృష్ణుడు చాలా నీటిని నిల్వచేసాడు. మీరు చూడండి? నీటి అవసరం, చాలా ఉంది. వ్యవసాయం కోసం, (ఉతకడం) శుభ్రపరచడం కోసం, త్రాగడానికి. అందువల్ల ఒక గ్లాసు నీరు లభించకపోతే అతను చనిపోతాడు. ఆ అనుభవము, ఎవరైతే యుద్ధములో ఉన్నారో... నీరు ఎంత విలువైనదో వాళ్ళు అర్థం చేసుకోగలరు . పోరాటంలో వారికి దప్పిక వేసినప్పుడు, అపుడు నీరు లేకపోతే, వారు చనిపోతారు. కాబట్టి ఎందుకు నీరు చాలా విలువైనది? ఎందుకంటే నీటికీ మంచి రుచి ఉంటుంది. నీవు ఎంతో దాహంతో ఉండి ఒక గ్రుక్క నీటిని నీవు త్రాగగానే "ఓ భగవంతుడా ధన్యవాదాలు." అంటారు కాబట్టి కృష్ణుడు ఇలా అంటున్నాడు, "ఆ రుచిని నేను. జీవం ఇస్తున్న ఆ నీటి రుచి నేను." అని కృష్ణుడు చెప్పారు. కాబట్టి మీరు ఈ తత్వశాస్త్రాన్ని తెలుసుకున్నట్లయితే, మీరు ఎప్పుడు నీటిని తాగినా మీరు కృష్ణుడిని చూస్తారు. మీరు నీళ్ళు ఎప్పుడు త్రాగకపోయినా? ఇది కృష్ణ చైతన్యము. Raso 'ham apsu kaunteya prabhāsmi śaśi-sūryayoḥ. నేను సూర్యుని యొక్క చంద్రుని యొక్క వెలుగును. కాబట్టి రాత్రిపూట లేదా పగటిపూట, మీరు సూర్యకాంతిని లేదా చంద్రకాంతిని తప్పకుండా చూస్తారు. కావున మీరు కృష్ణుడిని ఎలా మరచిపోగలరు? మీరు నీటిని తాగితే, లేదా సూర్యకాంతి చూసినా, లేదా చంద్రకాంతిని చూసినా, లేదా ఏదైనా ధ్వని విన్నా... Śabdo ‘ham ( SB 11.16.34) చాలా విషయములు ఉన్నాయి. ఇది నాలుగవ అధ్యాయంలో మీరు చదివారు, కృష్ణుడు అన్నింటా ఎలా వ్యాప్తి చెందుతున్నాడు. అందువల్ల కృష్ణుడిని ఈ విధముగా చూడాలి. అప్పుడు మీరు యోగ పరిపూర్ణమును పొందుతారు. ఇక్కడ చెప్పబడింది: "ఒక నిజమైన యోగి నన్ను అన్ని జీవులలోనూ గమనిస్తాడు మరియు ప్రతి ఒక్కరిని నాలో చూస్తాడు. నిజానికి, ఆత్మ-సాక్షాత్కారం పొందిన మనిషి ప్రతిచోటా నన్ను చూస్తాడు. "