TE/Prabhupada 0685 - ఇది మాత్రమే యోగ పద్ధతి, భక్తి-యోగ పద్ధతి, ఇది శీఘ్ర ఫలితం కోసం సాధన చేయవచ్చు



Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969

విష్ణుజన : "సాధారణ ఆచరణాత్మక మార్గాల ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారము గురించి ప్రజలు తీవ్రముగా లేరు, ఈ కష్టమైన యోగ పద్ధతి గురించి ఏం మాట్లాడతాం, జీవన విధానాన్ని నియంత్రించేది, కూర్చునే విధానం స్థలం ఎంపిక, భౌతిక కార్యక్రమాల నుండి మనస్సు యొక్క నిర్లిప్తత. వైరాగ్యం ఆచరణాత్మక వ్యక్తిగా, అర్జునుడు ఈ యోగా విధానాన్ని అనుసరించడం అసాధ్యమని అనుకున్నాడు. "

ప్రభుపాద: అవును. ఆయన ఒక నకిలీ యోగిగా మారడానికి తయారుగా లేడు, తప్పుడు యోగిగా కాదు, కేవలం కొంత కసరత్తు సాధన ద్వారా. ఆయన ఒక నటించే వాడు కాదు. మాయా భక్తి కలవాడు కాదు. ఆయన చెప్పాడు, "నేను ఒక కుటుంబం మనిషిని, నేను ఒక సైనికుడను, కాబట్టి అది నాకు సాధ్యం కాదు." ఆయన నిజాయితీగా అంగీకరించాడు. అసాధ్యం అయిన దాన్ని దేనిని అతడు తీసుకోడు. అది కేవలం సమయమును ఉపయోగము లేకుండా వృధా చేసుకోడము. ఎందుకు అలా చేయాలి? కొనసాగించు.

విష్ణుజన: "ఆయనకు అనేక సౌకర్యములు అనుకూలంగా ఇవ్వబడినప్పటికీ అతడు రాజ కుటుంబానికి చెందినవాడు, అనేక లక్షణాల పరంగా అతడు ఉన్నత స్థానములో ఉన్నాడు, ఆయన ఒక గొప్ప యోధుడు, ఆయన గొప్ప ఆయుర్దాయము కలిగి ఉన్నాడు."

ప్రభుపాద: అవును, ఒక విషయం ఏంటంటే వయస్సు. అయిదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడు నివసిస్తున్నప్పుడు, జీవిత కాలము చాలా ఎక్కువగా ఉంది. ఆ సమయంలో ప్రజలు ఒక వేయి సంవత్సరాల వరకు జీవించేవారు. ఉదాహరణకు ప్రస్తుతం ఈ యుగములో పరిమితి వంద సంవత్సరాలు, అదేవిధముగా ద్వాపర-యుగములో వయస్సు పరిమితి ఒక వేయి సంవత్సరాలు. అంతకు ముందు త్రేతా-యుగంలో, వయస్సు పరిమితి పది వేల సంవత్సరాలు. అంతకు ముందు సత్య-యుగములో, వయస్సు పరిమితి వంద వేల సంవత్సరాలు. కాబట్టి వయసు పరిమితి తగ్గుతోంది. కాబట్టి అర్జునుడు, ప్రజలు ఒక వేయి సంవత్సరాలు జీవించి ఉండే సమయంలో ఉన్నా కూడా అప్పటికీ అది అసాధ్యమని అనుకున్నాడు. కొనసాగించు.

విష్ణుజన: "అన్నింటికంటే, ఆయన దేవాదిదేవుడైన కృష్ణుడి యొక్క అత్యంత సన్నిహిత స్నేహితుడు. అయిదు వేల సంవత్సరాల క్రితం అర్జునుడు మన కంటే మెరుగైన సౌకర్యాలను కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఈ యోగ పద్ధతిని తిరస్కరించాడు."

ప్రభుపాద: ఈ యోగా పద్ధతి, ఈ అష్టాంగ యోగ. అవును.

విష్ణుజన : "వాస్తవానికి, ఏ సమయంలో అయినా,ఆయన అది సాధన చేసినట్లు మనము చరిత్రలో ఎక్కడా కనుగొనలేము. అందువల్ల ఈ పద్ధతిని ఈ కలి యుగంలో ముఖ్యంగా అసాధ్యంగా పరిగణించాలి. వాస్తవానికి కొంతమందికి మాత్రమే, అరుదైన వ్యక్తులకు అది సాధ్యము కావచ్చును, కానీ సామాన్య ప్రజలకు ఇది అసాధ్యమైన ప్రతిపాదన. ఇది ఐదువేల సంవత్సరాల క్రితం ఇలా ఉంటే, నేటి రోజు గురించి ఏమి మాట్లాడాలి? వివిధ పాఠశాలలు మరియు సమాజాలు అని పిలవబడే వాటిలో ఈ యోగ పద్ధతిని అనుకరించే వారు, ఆనందముగా ఉన్నప్పటికీ వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వారు చేరుకోవలసిన లక్ష్యం గురించి పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు."

ప్రభుపాద: అవును. కాబట్టి ఈ అష్టాంగ-యోగ సాధ్యం కాదు. అందువలన ఈ యోగ పద్ధతి, భక్తి-యోగ పద్ధతి, ఇది మాత్రమే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది ఈ కీర్తన, భక్తి-యోగ పద్ధతి కొనసాగుతున్నప్పుడు మీరు చూశారు, ఒక చిన్న పిల్లవాడు కూడా, వాడు కూడా చప్పట్లు కొడతాడు. మీరు చూడండి? ఏ శిక్షణ లేకుండా, ఏ చదువు లేకపోయినా, సహజముగా వాడు పాల్గొంటాడు. అందువల్ల భగవంతుడు చైతన్య ఈ యుగములో ఇదే ఏకైక పద్ధతి అని చెప్పారు: harer nāma harer nāma harer nāma eva kevalam ( CC Adi 17.21) కేవలం హరే కృష్ణ, హరే కృష్ణ అని కీర్తన చేస్తూ. కలౌ, ఈ కలి యుగంలో. కలౌ నాస్తేవ, నాస్తేవ, నాస్తేవ: ఏ ఇతర మార్గం, ఏ ఇతర మార్గం, ఏ ఇతర మార్గం లేదు. మీరు ఈ పద్ధతిని తీసుకుంటే, ఈ భక్తి-యోగ పద్ధతి, చాలా సులభమైనది, కేవలం కీర్తన చేయడము మీరు వెంటనే ఫలితాన్ని పొందుతారు. ప్రత్యక్షావగమ ధర్మ్యం. ఏ ఇతర యోగ పద్ధతి, మీరు సాధన చేస్తుంటే, మీరు చీకటిలో ఉన్నారు. మీరు ఎంతవరకు పురోగతి చెందుతున్నారో మీకు తెలియదు. కానీ ఈ పద్ధతిలో, మీరు గ్రహించవచ్చు, అవును, నేను పురోగతి చెందుతున్నాను." ఇది మాత్రమే యోగ పద్ధతి, భక్తి-యోగ పద్ధతి, ఇది శీఘ్ర ఫలితం కోసం సాధన చేయవచ్చు ఈ జీవితం లో కూడా ఆత్మ సాక్షాత్కారం పరిపూర్ణత మరియు విముక్తి పొందవచ్చు ఆయన మరొక జీవితం కోసం వేచి ఉండనవసరం లేదు. ఇది చాలా బాగుంది, కృష్ణ చైతన్యము. కొనసాగించు.