TE/Prabhupada 0688 - మాయా శక్తికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించడము



Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969


ఇప్పటి వరకు యోగాభ్యాసం గురించి ఆలోచించినట్లైతే, కృష్ణుడు మరియు అర్జునుడి మధ్య చర్చగా వివరించబడింది. ఇప్పుడు, నేను యోగ సాధన చేస్తున్నాను అని అనుకుందాము - నిజమైన యోగ అంటే, ఈ కపటపు యోగ కాదు. నేను సరిగా చేయలేక పోతే, నేను విఫలమౌతాను. అప్పుడు ఫలితం ఏమిటి? నేను నా పనులను వదిలివేస్తానని అనుకుందాం, నా సాధారణ వృత్తిని నేను విడిచిపెడతాను. నేను యోగ సాధన ప్రారంభించాను. కానీ ఎట్లగైతేనే ఇది పూర్తికాలేదు, అది వైఫల్యం చెందినది. అప్పుడు ఫలితం ఏమిటి? అది అర్జునుడిచే ప్రశ్నించబడింది. అది కృష్ణుడిచే జవాబు ఇవ్వబడుతుంది. అది ఏమిటి? చదవడము కొనసాగించు. "అర్జునుడు చెప్పాడు ..."

భక్తుడు: "అర్జునుడు ఇలా అన్నాడు: 'విశ్వాసము గల మనిషి దీనిని పూర్తి చేయలేకపోతే వాని గమ్యం ఏమిటి? ప్రారంభంలో ఆత్మ-సాక్షాత్కారము పద్ధతిని తీసుకున్న వ్యక్తి, కానీ తర్వాత లౌకిక భావన వలన దానిని విడిచిపెడితే అందువలన యోగ పరిపూర్ణతను సాధించలేకపోయిన అతని గమ్యము ఏమిటి? ' ( BG 6.37) " భాష్యము: "ఈ మార్గము ... ఈ ఆత్మ-సాక్షాత్కార మార్గము లేదా యోగ పద్ధతి భగవద్గీతలో వివరించబడింది. ఆత్మ-సాక్షాత్కారము యొక్క ప్రాధమిక సూత్రం జీవి ఈ భౌతిక శరీరము కాదు, కానీ ఆయన దాని నుండి భిన్నమైనవాడు, ఆయన ఆనందం శాశ్వత జీవితంలో ఉంది, ఆనందం మరియు జ్ఞానం. "

ప్రభుపాద: ఇప్పుడు, ఆత్మ-సాక్షాత్కారములో ఈ దశకు వచ్చే ముందు, అతడు దానిని ఒప్పుకోవాలి ఇది భగవద్గీత యొక్క ఆరంభం, ఆయన ఈ శరీరం కాదని. జీవి ఈ భౌతిక శరీరం కాదు కానీ దాని నుండి భిన్నమైనవాడు అని, ఆయన ఆనందము శాశ్వత జీవితంలో ఉంది. ఈ జీవితం శాశ్వతమైనది కాదు. యోగ పద్ధతి యొక్క పరిపూర్ణము అనగా శాశ్వత జీవితం, ఆనందకరమైన జీవితం, పూర్తి జ్ఞానం పొందడం. అది పరిపూర్ణము. కాబట్టి మనము ఆ లక్ష్యముతో ఏ యోగ పద్ధతి అయినా దానిని అమలుపరచాలి. కొవ్వు తగ్గించడానికి నేను యోగా తరగతికి హాజరు కావడం కాదు లేదా నా శరీరాన్ని ఇంద్రియ తృప్తి కోసము ఆరోగ్యముగా ఉంచుకోవడానికి కాదు. ఇది యోగ పద్ధతి ముగింపు కాదు. కానీ ప్రజలకు అలా బోధిస్తారు.", మీరు ఈ యోగ పద్ధతిను పాటిస్తే ..." అది మీరు చేయవచ్చు. మీరు ఏదైనా వ్యాయామ పద్ధతిలో పాల్గొంటే, మీ శరీరం ఆరోగ్యముగా ఉంటుంది. శరీర వ్యాయామ పద్ధతులు చాలా ఉన్నాయి, sandow పద్ధతి, ఈ బరువు-ఎత్తే పద్ధతి, ఈ... అనేక క్రీడా పద్ధతిలు ఉన్నాయి, అవి శరీరాన్ని చాలా ఆరోగ్యముగా ఉంచుతాయి. అవి చాలా చక్కగా ఆహారాన్ని జీర్ణం చేస్తాయి, అవి కొవ్వును తగ్గిస్తాయి. వీటి ప్రయోజనము కోసం యోగా సాధన అవసరం లేదు. వాస్తవమైన ప్రయోజనము ఇక్కడ ఉంది - నేను ఈ శరీరం కాదని అర్థము చేసుకోవటము. నాకు శాశ్వతమైన ఆనందం కావాలి. నాకు పూర్తి జ్ఞానం కావాలి; నాకు శాశ్వత జీవితం కూడా కావాలి. ఇది యోగ పద్ధతి అంతిమ ముగింపు. చదవడము కొనసాగించు.

భక్తుడు: "ఇవి శరీరము మరియు మనస్సుకు రెండింటికి అతీతము. ఆత్మ సాక్షాత్కారము కావాలంటే, జ్ఞాన మార్గమును అనుసరించాలి అష్టాంగ యోగ పద్ధతి అభ్యాసము, లేదా భక్తి-యోగ. ఈ పద్ధతిలన్నిటిలో ప్రతి ఒక్క జీవి తన యొక్క స్వరుప స్థానమును గ్రహించవలసి ఉంది, దేవుడుతో తనకున్న సంబంధం, ఆయన కోల్పోయిన సంబంధమును పునఃస్థాపించగల కార్యక్రమాలను కృష్ణ చైతన్యము యొక్క అత్యుత్తమ పరిపూర్ణ దశను సాధించడం. పైన పేర్కొన్న మూడు పద్ధతులను అనుసరించి, ఒకరు ముందుగానే లేదా తరువాత అయినా మహోన్నతమైన లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటారు ఇది రెండవ అధ్యాయములో భగవంతుడి ద్వారా నొక్కి చెప్పబడినది. ఒక చిన్న ప్రయత్నం అయినా ఆధ్యాత్మిక మార్గమైన భక్తి-యోగములో ఈ యుగమునకు ప్రత్యేకంగా సరిపోతుంది, ఎందుకంటే అది భగవంతుడి సాక్షాత్కారము యొక్క ప్రత్యక్ష పద్ధతి. రెట్టింపుగా హామీ ఇవ్వాలంటే, అర్జునుడు తన ముందు ప్రకటనను నిర్ధారించమని భగవంతుడు కృష్ణుడిని అడుగుతున్నాడు. ఒకరు ఆత్మ-సాక్షాత్కారము యొక్క మార్గాన్ని హృదయపూర్వకంగా అనుసరించవచ్చు. కానీ విజ్ఞానము పెంపొందిచుకునే పద్ధతి మరియు అష్టాంగ యోగ పద్ధతి సాధన ఈ యుగమునకు చాలా కష్టము. అందువల్ల ఒకరు హృదయపూర్వకంగా ప్రయత్నిoచినప్పటికీ, అనేక కారణాల వల్ల విఫలం అవవచ్చు. ప్రాధమిక కారణం వ్యక్తులు ఈ విధానం అనుసరించడం గురించి తగినంత తీవ్రముగా లేకపోవటము ఆధ్యాత్మిక మార్గమును అనుసరించుట అంటే ఏది ఏమైనా భ్రాంతి కలిగించే శక్తిపై యుద్ధాన్ని ప్రకటించటము

ప్రభుపాద: మనము ఈ ఆత్మ-సాక్షాత్కర పద్ధతిని అంగీకరించినప్పుడు, ఇది ఆచరణాత్మకముగా మాయా శక్తికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించడము, మాయ. కాబట్టి మాయ యొక్క ప్రశ్న, లేదా పోరాటం లేదా యుద్ధం యొక్క ప్రశ్న ఉన్నప్పుడు, మాయ చాలా కష్టములను మన దారిలో ఉంచుతుంది. ఇది ఖచ్చితము. అందువలన వైఫల్యం యొక్క అవకాశం ఉంది, కానీ ఒకరు చాలా స్థిరముగా ఉండాలి. చదవడము కొనసాగించు.

భక్తుడు: "ఒక వ్యక్తి మాయ యొక్క బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, పర్యవసానంగా ఆమె అభ్యాసకుడిని వివిధ ఆకర్షణీయ ప్రలోభముల ద్వారా ఓడించటానికి ప్రయత్నిస్తుంది. ఒక బద్ధజీవుడు ఇప్పటికే భౌతిక శక్తి యొక్క గుణాల వలన ప్రలోభములో ఉన్నాడు, ఆధ్యాత్మిక అభ్యాసాన్ని చేస్తున్నప్పుడు మళ్ళీ అటువoటి ప్రలోభమునకు లోనయ్యే అవకాశం ఉంది. దీనిని యోగ yogāc calita-mānasaḥ: అని పిలుస్తారు "

ప్రభుపాద: Calita-mānasaḥ. Calita-mānasaḥ అంటే యోగా అభ్యాసం నుండి మనస్సును మరల్చడము అని అర్థం. Yogāc calita-mānasaḥ. Yogāt అంటే యోగ సాధన చేయడము మరియు calita అంటే మళ్లింపు అని అర్థము. Mānasaḥ అంటే మనసు. Yogāc calita-mānasaḥ కాబట్టి చాలా అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికీ అనుభవం ఉన్నది. మీరు ఏదైనా పుస్తకం చదవడానికి ప్రయత్నిస్తున్నారు, ఏకాగ్రతతో కానీ మనస్సు అనుమతించడం లేదు, అది కలత చెందింది. మనస్సును నియంత్రించడానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది వాస్తవమైన సాధన. చదవడము కొనసాగించు.

భక్తుడు: "... ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలగిన వ్యక్తి. అర్జునుడు ఆత్మ సాక్షాత్కారము యొక్క మార్గం నుండి విచలనము వలన ఫలితాలను తెలుసుకోవటానికి ఉత్సుకతతో ఉన్నాడు. "

ప్రభుపాద: అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎవరైనా ఏదో విధమైన యోగ సాధనను ప్రారంభించవచ్చు, అష్టాంగ యోగ పద్ధతి లేదా జ్ఞాన-యోగ పద్ధతి, తత్వపరంగా కల్పనలు చేయడం, భక్తి-యోగ పద్ధతి, భక్తియుక్త సేవ. యోగ పద్ధతిని పూర్తి చేయుటలో విఫలమైతే, దాని ఫలితం ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, ఇది అర్జునుడిచే అడగబడింది, కృష్ణుడు దీనికి సమాధానమిస్తాడు. (విరామం)