TE/Prabhupada 0691 - మా సమాజంలో దీక్షను తీసుకోవాలని కోరుకునే ఎవరికైనా, మేము నాలుగు సూత్రాలను పెడతాము



Lecture on BG 6.35-45 -- Los Angeles, February 20, 1969


భక్తుడు: "కృష్ణ చైతన్యము అన్ని కాలుష్యాల నుండి విముక్తి పొందిన సంపూర్ణ దశ ఇది భగవద్గీతలో ధృవీకరించబడింది. అనేక, అనేక జన్మలు పవిత్ర కార్యక్రమాలను చేసిన తరువాత ఒక వ్యక్తి పూర్తిగా అన్ని కాలుష్యములు మరియు భ్రాంతిని కలిగించే ద్వంద్వముల నుండి విముక్తి పొందినప్పుడు, అతడు అప్పుడు భగవంతుని యొక్క దివ్యమైన సేవలో ప్రేమతో నిమగ్నమవ్వుతాడు."

ప్రభుపాద: అవును. Yeṣāṁ tv anta-gataṁ pāpam ( BG 7.28) భగవద్గీతలో ఖచ్చితమైన శ్లోకము అనేది yeṣāṁ tv anta-gataṁ pāpam. Pāpam అంటే పాపం. పాపములను పూర్తిగా ముగించిన వ్యక్తి ... Janānāṁ puṇya-karmaṇām: కేవలం పవిత్ర కార్యక్రమాలను అమలుచేసిన వ్యక్తులు. అటువంటి వ్యక్తి కృష్ణ చైతన్యములో స్థిరపడతాడు ఏ విధమైన ద్వంద్వములు లేకుండా. మన మనస్సు చంచలముగా ఉంటుంది కనుక , కాబట్టి ద్వంద్వములు ఎల్లప్పుడూ వస్తాయి. నేను దాన్ని అంగీకరిoచాలా లేదా వద్దా అని నేను కృష్ణ చైతన్యవంతుడిని అవుతానా లేదా మరొక చైతన్యవంతుడిని అవుతానా, ఈ సమస్యలు ఎల్లప్పుడూ ఉన్నాయి. కానీ గత జీవితంలో పవిత్రమైన కార్యక్రమాలను చేయడము వలన ఉన్నతి సాధిస్తే అప్పుడు ఆయన నిలకడగా స్థిరపడతాడు, "నేను కృష్ణ చైతన్యవంతుడిని అవుతాను." కాబట్టి ఈ పద్ధతి, హరే కృష్ణ కీర్తన పద్ధతి, మీ పూర్వ జన్మలో లేదా ఈ జన్మలో మీరు చాలా పవిత్రంగా నడుచుకోకపోయిన కూడా , అది పట్టింపు లేదు. మీరు ఈ సరళమైన పద్ధతిని తీవ్రంగా తీసుకుంటే, హరే కృష్ణ జపము,కీర్తన, మీరు వెంటనే పవిత్రమవ్వుతారు కానీ ధృడ నిర్ణయంతో, మీరు ఇంకా ఏ విధమైన అపవిత్రమైన కార్యక్రమాలను చేయరు

ఉదాహరణకు మా సమాజంలో మేము నాలుగు పరిమితులను పాటిస్తాము. మా సమాజంలో దీక్షను తీసుకోవాలని కోరుకునే ఎవరికైనా, మేము నాలుగు సూత్రాలను పెడతాము. అక్రమ లైంగిక జీవితం వద్దు, లైంగిక జీవితం వద్దు అని మేము చెప్పము. అక్రమ లైంగిక జీవితం వద్దు. మీరు మీరే వివాహం చేసుకోండి, పిల్లల కొరకు మీరు లైంగిక జీవితం కలిగి ఉండవచ్చు. మరొక ప్రయోజనము కోసం కాదు. కావున, అక్రమ లైంగిక జీవితం వద్దు, మత్తు పదార్థములు వద్దు. మా విద్యార్థులు, వారు పొగ కూడా త్రాగరు, వారు టీ, కాఫీ కూడా తీసుకోరు. కాబట్టి ఇతర విషయాల గురించి ఏమి మాట్లాడాలి, కాబట్టి వారు పవిత్రముగా ఉన్నారు. జూదం ఆడరాదు, జంతు ఆహారము తీసుకోకూడదు. అంతే. మీరు కేవలము ఈ నాలుగు సూత్రాలను అనుసరిస్తే, మీరు తక్షణమే పవిత్రముగా ఉంటారు. తక్షణమే. ఏ తదుపరి ప్రయత్నము లేకుండా. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమం చాలా బాగుంది మీరు చేరిన వెంటనే మీరు వెంటనే పవిత్రమవుతారు కానీ మళ్ళీ కలుషితం అవ్వద్దు. కాబట్టి ఈ నియమములు. ఈ నాలుగు రకాల చెడ్డ అలవాట్ల వలన మన కాలుష్యం మొదలవుతుంది. కానీ మనము మానుకుంటే, అప్పుడు కలుషితము అనే ప్రశ్నే లేదు. నేను కృష్ణ చైతన్యమును తీసుకున్న వెంటనే నేను స్వేచ్ఛను పొందుతాను. నేను ఈ నాలుగు అధర్మాలను అంగీకరించకుండా జాగ్రత్తగా ఉంటే, అప్పుడు నేను స్వేచ్ఛగా ఉoటాను. నేను కల్మషములు లేకుండా కొనసాగుతాను. ఇది పద్ధతి. కాని మీరు అనుకుంటే, కృష్ణ చైతన్యము నన్ను కల్మషము లేకుండా చేస్తుంది, కాబట్టి ఈ నాలుగు అధర్మాలలో నేను నిమగ్నమవుతాను, నేను కీర్తన చేయడము ద్వారా స్వేచ్ఛను పొందుతాను అంటే అది మోసము చేయడము. అది అనుమతించబడదు. ఒకసారి మీరు విముక్తులు అయితే, కానీ మళ్లీ చేయకండి. కానీ మీరు అనుకుంటే "నేను చేస్తాను, నేను స్వేచ్ఛను పొందుతాను ..."

కొన్ని మతపరమైన పద్ధతులలో మీరు అన్నిరకాల పాపాలకు పాల్పడండి అని చెప్పబడింది చర్చికి వెళ్ళండి కేవలం అంగీకరిoచండి, మీరు విముక్తులు అవుతారు. కాబట్టి ఈ చేయడం మరియు ఒప్పుకోవడం, చేయడం మరియు ఒప్పుకోవడం జరుగుతోంది. కానీ ఇక్కడ, లేదు. మీరు విముక్తులైతే, అది సరే. కానీ మళ్ళీ చేయవద్దు. అది ఒప్పుకోవటములో ఉద్దేశ్యం. నేరాంగీకారం, మీరు "నేను ఈ పాపములును చేసాను" అని మీరు ఒప్పుకుంటే, మరలా ఎందుకు చేయాలి? పాపము అని మీరు అంగీకరిస్తే, జేబులు కత్తిరించుట అనేది పాపము, ఉదాహరణకు తీసుకోండి. కాబట్టి మీరు ఒప్పుకోవడo ద్వారా మీరు విముక్తి పొoదారు, అప్పుడు మరలా మళ్ళీ ఎందుకు చేస్తావు? దీనికి కొంచము బుద్ధి అవసరం. నేను అంగీకరిస్తున్నాను నేను ఒప్పుకోవడం ద్వారా, మీరు విముక్తులు అయ్యారు అని కాదు నేను ఈ విధానమును కొనసాగిస్తాను మరియు మళ్ళీ అంగీకరిoచి మరియు విముక్తి పొందుతాను. కాదు ఇది మంచిది కాదు. ఇది మంచిది కాకపోతే, మీరు అంగీకరించారు అది మంచిది కాదని , అప్పుడు మీరు దాన్ని మళ్లీ చేయకూడదు. అది ఉద్దేశ్యం. మీరు దానిని చేసి మరియు అంగీకరిస్తారు, అది చేసి, అంగీకరిస్తారు, అది చేసి, అంగీకరిస్తారు. ఈ పని మంచిది కాదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలెను, కృష్ణ చైతన్య ఉద్యమం, ఈ నాలుగు అధర్మాలలో , మీరు పరిమితి లేకుండా నిమగ్నమైతే, అప్పుడు మీరు కలుషితమవుతారు కాని మీరు ఈ నాలుగు సూత్రాలను అమలు చేయడంలో జాగ్రత్త తీసుకుంటే... మీకు లైంగిక జీవితం కలిగి ఉండ కూడదు అని మేము చెప్పడము లేదు. మీరు కలిగి ఉండండి. కానీ ఈ ప్రయోజనము కోసం, ఆ ప్రయోజనము కోసం కాదు. అదే విధముగా మీరు తినండి కానీ మీరు ఈ విధముగా తినoడి. ఆ విధముగా కాదు.

కావున రక్షించుకోండి, కృష్ణుడు కూడా అర్జునుడిని రక్షించుకొమ్మని సలహా ఇచ్చాడు. కాబట్టి రక్షించుకోవడము కూడా నిషేధించబడలేదు, అది సరైన కారణము కోసమైతే. కాబట్టి ఈ విధముగా , మనము కృష్ణ చైతన్యమునకు వస్తే, వెంటనే మనము అన్ని కాలుష్యముల నుండి స్వేచ్చను పొందుతాము. మనము ఈ నాలుగు సూత్రాల యొక్క జాగ్రత్త తీసుకుంటే, అప్పుడు మన జీవితం పవిత్ర మవుతుంది మరణం వరకు ఈ పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తే, మీరు తప్పకుండా భగవత్ రాజ్యమునకు బదిలీ చేయబడతారు చదవడము కొనసాగించు. ఇది భగవద్గీతలో చెప్పబడింది - మీరు ఇప్పటికే చదివారు: tyaktvā dehaṁ punar janma naiti ( BG 4.9) ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, ఆ వ్యక్తి, కృష్ణ చైతన్యములో సంపూర్ణముగా ఉన్న వ్యక్తి, ఆయన ఈ భౌతిక ప్రపంచంలో పాల్గొనడానికి మళ్లీ రాడు. ఒక మంచి కుటుంబానికి వస్తున్న ఈ యోగి, పవిత్రమైన కుటుంబానికి లేదా ధనవంతులైన కుటుంబానికి, వారు తిరిగి వస్తున్నారు. మీరు కృష్ణ చైతన్యమును సంపూర్ణము చేసుకున్నట్లైతే ఇక తిరిగి రారు. నీవు ఆధ్యాత్మిక ఆకాశంలో గోలోక వృందావనములో ఉన్నారు. కాబట్టి మనం తిరిగి మళ్ళి రాకూడదు. ఎందుకంటే నేను తిరిగి మళ్ళీ వస్తే, ఉదాహరణకు, నాకు చాలా మంచి అవకాశం వచ్చింది అనుకుందాం. మంచి కుటుంబములో నేను జన్మించాను, ధనము కలిగిన కుటుంబములో కాని నేను దానిని సరిగా వినియోగించుకోలేక పోతే, మరలా నేను వెళ్తాను, వేరే విధమైన జీవితానికి నేను అధోగతి చెందుతాను. ఎందుకు మనము ఈ ప్రమాదం తీసుకోవాలి? ఈ జీవితంలో కృష్ణ చైతన్యమును పూర్తి చేసుకోవడము మంచిది. ఇది చాలా సులభం. ఇది చాలా కష్టము కాదు. కేవలం కృష్ణుడి యొక్క ఆలోచనలలో మీరు మిమ్మల్ని ఉంచుకోండి. అంతే. ఇది చాలా సులభమైన విషయము. అప్పుడు మీకు ఆధ్యాత్మిక ఆకాశంలో మీ తదుపరి జన్మ హామీ ఇవ్వబడుతుంది - భగవత్ రాజ్యంలో లేదా గోలోక వృందావనములో. అవును. (ముగింపు)