TE/Prabhupada 0695 - వారు భగవంతుణ్ణి చౌకగా ఎంపిక చేస్తారు. ఆయన చవక అయ్యాడు నేను భగవంతుడను,నీవు భగవంతుడవు



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


భక్తుడు: "ఈ శ్లోకములో కూడా, భజంతి అనే పదం వాడబడింది. భజంతి దేవాదిదేవుడుకి మాత్రమే వర్తిస్తుంది, అయితే ఆరాధన అనే పదాన్ని దేవతలుకు లేదా ఇతర సాధారణ జీవులకు వర్తింపజేయవచ్చు. అవజానంతి అనే పదం... "ప్రభుపాద: అవజానంతి అంటే నిర్లక్ష్యం చేయడము భగవంతుడు ఏమిటి? నేనే భగవంతుణ్ణి? భగవంతుడు ఏమిటి? నేను ఎందుకు భగవంతుణ్ణి సేవించాలి? ఇది అవజానంతి. ఉదాహరణకు క్రిమినల్ లాగా, "ఓ, ప్రభుత్వం ఏమిటి? నేను నా సొంత వ్యవహారాలను నిర్వహించగలను. నేను ప్రభుత్వం గురించి పట్టించుకోను. ఇది అవజానంతి అంటారు. కానీ మీరు చెప్పలేరు. నేను "నేను ప్రభుత్వాన్ని లెక్క చేయను," సరే, మీరు అది చెప్పవచ్చు, కానీ పోలీసు విభాగం ఉంది. ఇది మీకు బాధను ఇస్తుంది, అది మిమ్మల్ని శిక్షిస్తుంది. భౌతిక ప్రకృతి మిమ్మల్ని మూడు రకాల దుఃఖాలతో శిక్షిస్తుంది. కొనసాగించు. భక్తుడు: "శ్రీమద్-భాగవతం యొక్క ఈ శ్లోకములో ఉపయోగించిన అవజానంతి పదం కూడా భగవద్గీతలో కనుబడుతుంది. అవజానంతి... ప్రభుపాద: మాం మూఢః. శ్రీమద్-భాగవతంలో, ఈ పదం వాడబడింది, avajānanti sthānād bhraṣṭāḥ patanty adhaḥ ( SB 11.5.3) అదేవిధముగా అదే పదాన్ని భగవద్గీతలో ఉపయోగించారు : అవజానంతి మాం మూఢః ( BG 9.11) మూఢః అంటే అర్థం మూర్ఖుడు. మూర్ఖులు వారు మాత్రమే అనుకుంటున్నారు- నన్ను పట్టించుకోరు. మూర్ఖులు. అతనికి తెలియదు అతను బాధపడతాడని, కానీ అతను ఇలా చెప్పటానికి ధైర్యం చేస్తాడు, "నేను పట్టించుకోను..." అది avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam, paraṁ bhāvam ajānantaḥ ( BG 9.11) భగవంతుని యొక్క మహోన్నతమైన స్థితి తెలుసుకోకుండా. చౌకగా, వారు భగవంతుణ్ణి చౌకగా ఎంపిక చేస్తారు. భగవంతుడు చాలా చవక అయ్యాడు. నేను భగవంతుడను, నీవు భగవంతుడవు. భగవంతుడు అంటే అర్థం ఏమిటి? నీకు తెలుసా? మీరు భగవంతుడు అయితే, నేను భగవంతుణ్ణి, అప్పుడు భగవంతుడు అంటే అర్థం ఏమిటి? కాబట్టి, అవజానంతి, ఈ పదం చాలా సముచితమైనది. అవజానంతి అనగా నిర్లక్ష్యమైనది, శ్రద్ధ లేదు. కానీ వారు మూఢాః. వారిని మూర్ఖుడు అని పిలుస్తారు - ఏ జ్ఞానం లేకుండా, అవివేకి అని అర్థం. Avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam ( BG 9.11) కొనసాగించు. భక్తుడు: "కేవలం మూర్ఖులు దుష్టులు మాత్రమే భగవంతుడిని, కృష్ణుడిని ఎగతాళి చేస్తారు. ఇటువంటి మూర్ఖులు భగవద్గీత మీద వ్యాఖ్యానాలను వ్రాయటానికి తమ కర్తవ్యముగా తమంతట తాము తీసుకుంటారు. భగవంతుని పట్ల ఎటువంటి సేవాభావం లేకుండా తత్ఫలితంగా వారు భజంతి పదం, ఆరాధన పదం మధ్య తేడా సరిగ్గా గుర్తించలేరు. కాబట్టి అన్ని రకాల యోగాభ్యాసం యొక్క ఉన్నత స్థితి భక్తి-యోగంలో ఉంది. అన్ని ఇతర యోగాలు భక్తి-యోగ యొక్క స్థితికి రావటానికి మాత్రమే ఉన్నాయి. యోగ అంటే అసలైన అర్థం భక్తి-యోగ. అన్ని ఇతర యోగాలు ఈ గమ్యానికి తీసుకు వెళ్ళే దారులు. కర్మ-యోగం నుండి ప్రారంభమై భక్తి-యోగ ముగింపు వరకు, ఇది ఆత్మ-సాక్షాత్కార దశకు చాలా దూరము ఉన్న మార్గము. ఫలాపేక్ష లేకుండా ఉన్న కర్మ-యోగం ఈ మార్గంలో ప్రారంభము. కర్మ-యోగములో జ్ఞానము మరియు వైరాగ్యము పెరిగినప్పుడు,ఆ స్థితిని జ్ఞాన - యోగ అని పిలుస్తారు. వివిధ భౌతిక పద్ధతుల ద్వారా పరమాత్మ ధ్యానంలో జ్ఞాన -యోగ పెరుగుతున్నప్పుడు, మనస్సు ఆయన మీద ఉన్నప్పుడు, ఇది అష్టాంగ-యోగ అంటారు. ఎవరైనా అష్టాంగ యోగాను అధిగమించినప్పుడు, దేవాదిదేవుడైన కృష్ణుని దగ్గరకు వస్తే. దానిని భక్తి-యోగా అంటారు." ప్రభుపాద: అవును, యోగ పద్ధతి యొక్క క్రమ పురోగతి. కర్మ-యోగా నుంచి జ్ఞాన యోగా వరకు. కర్మ-యోగ అంటే సాధారణ కార్యక్రమాలు ఫలాపేక్ష కార్యక్రమాలు. సాధారణ కార్యక్రమాలు అంటే పాప కార్యక్రమాలను కూడా సూచిస్తాయి, కానీ కర్మ-యోగ అనేది పాప కార్యక్రమాలు కాదు. మంచి మాత్రమే, పవిత్ర కార్యక్రమాలు లేదా నిర్దేశించబడిన కార్యక్రమాలు. దానిని కర్మ-యోగ అని పిలుస్తారు. అప్పుడు, కర్మ-యోగాను ఆచరించడము ద్వారా జ్ఞాన-యోగ స్థితికి వస్తారు. జ్ఞానం నుండి ఈ అష్టాంగ యోగ, ఎనిమిది అంచెల యోగ పద్ధతి - ధ్యాన, ధారణ, ప్రాణామాయ, ఆసన - అటువంటివి, ఎవరైతే అష్టాంగ యోగ సాధన చేస్తున్న వారు. అష్టాంగ యోగా నుండి, విష్ణువు మీద మనసును కేంద్రీకరించడం ద్వారా, భక్తి-యోగ స్థితి వరకు వస్తాడు. ఎవరైనా భక్తి-యోగా స్థితికి వచ్చినప్పుడు, అది యోగా యొక్క పరిపూర్ణ దశ. ఈ కృష్ణ చైతన్యము అంటే ప్రారంభం నుండి ప్రత్యక్షంగా, భక్తి-యోగా అని అర్థం. కొనసాగించు