TE/Prabhupada 0697 - దయచేసి మీ సేవలో నన్ను నిమగ్నము చేయండి, అంతే. అది మన కోరిక కావాలి



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


ప్రభుపాద: చెప్పండి.

భక్తుడు: మనము భజ శ్రీ కృష్ణ చైతన్య పాడుతున్నప్పుడు, మనము చెప్తున్నాము "శ్రీ కృష్ణ చైతన్యను పూజించండి " అని చెప్తున్నాము. మనము చెప్తున్నాము, కాబట్టి...

ప్రభుపాద: భజ, అవును. భజ అంటే కేవలం ఆయన సేవలో నిమగ్నము అవ్వటము. అంటే, ఆరాధన సహజముగా వస్తుంది. మీరు సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఆరాధన అప్పటికే ఉంది.

భక్తుడు: (స్పష్టముగా లేదు)

ప్రభుపాద: hmm?

భక్తుడు: ప్రేరణ ఏమిటంటే ఆరాధన చేయడములో, భక్తియుక్త సేవలో మార్గం కోసము.

ప్రభుపాద: అవును. అది మాత్రమే ఉద్దేశ్యం. కృష్ణుడితో మన ఉద్దేశము... చైతన్య మహాప్రభు మనకు నేర్పించారు, మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు భౌతికముగా ఏ వస్తువు కోసం ప్రార్థించకూడదు. చైతన్య మహాప్రభు ఈ విధముగా భగవంతున్ని ప్రార్థిస్తున్నాడు: na dhanaṁ na janaṁ na sundarīṁ kavitāṁ vā jagad-īśa kāmaye ( CC Antya 20.29 Siksastaka 4) నా ప్రియమైన ప్రభు, జగద్- ఈశా. జగత్ అంటే విశ్వం. ఈశా అంటే నియంత్రికుడు. కాబట్టి విశ్వం యొక్క నియంత్రికుడు, జగద్- ఈశా . కృష్ణుడు లేదా రామ అని చెప్పడానికి బదులు... దీనిని, ఏ సామాన్యుడు అయినా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఒక నియంత్రికుడు ఉండాలి, అతడు జగద్-ఈశా. మొత్తం విశ్వం యొక్క నియంత్రికుడు. అందువలన ఆయన, "విశ్వం యొక్క నా ప్రియమైన నియంత్రికుడా," ప్రభు అని. Na dhanaṁ na janaṁ na sundarīṁ na kavitāṁ vā jagad-īśa kāmaye. నేను మీ నుండి ఏ సంపదను ప్రార్థించను, లేదా అనుచరులను ఎంత మందిని అయినా, లేదా ఏ చక్కని అందమైన స్త్రీని అయినా. "ఇవి అన్ని భౌతిక కోరికలు ప్రజలు సాధారణంగా ఈ భౌతిక ప్రపంచం లోపల ఒక గొప్ప నాయకుడు అవ్వాలని కోరుకుంటారు. కొంత మంది ఫోర్డ్ లేదా రాక్ఫెల్లర్ వలె చాలా ధనవంతుడు కావాలని ప్రయత్నిస్తున్నారు, కొంత మంది అధ్యక్షుడు కావాలని ప్రయత్నిస్తున్నారు, కొంత మంది అటువంటి విషయములకు ప్రయత్నిస్తున్నారు, చాలామంది మంచి నాయకుడిగా ఉండటానికి, కావున వేలాదిమంది ప్రజలు అనుసరించటానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇవి అన్ని భౌతిక కోరికలు. "కొంత డబ్బు ఇవ్వండి, నాకు కొందరు అనుచరులను ఇవ్వండి, నాకు ఒక మంచి భార్యను ఇవ్వండి, "అంతే, కానీ చైతన్య మహా ప్రభు నిరాకరిస్తాడు. ఆయన చెప్పాడు "నాకు ఈ అన్ని విషయాలు అవసరము లేదు. "న జనం న ధనం. ధనం అంటే సంపద మరియు జనం అంటే అనుచరులు. న సుందరీమ్ కవితాం, "లేదా అందమైన భార్య." అప్పుడు మీరు దేని కోసము ఆరాధిస్తున్నారు? మీరు దేని భక్తుడు అవుతున్నారు? ఆయన చెప్తాడు mama janmani janmanīśvare ( CC Antya 20.29) ఆయన ముక్తికోసం కూడా అడగడం లేదు. ఎందుకంటే యోగులు, వారికి ముక్తి కావాలి, వారికి కోరిక ఉంది. భౌతిక వ్యక్తులు, వారికి కోరిక ఉంది, "నేను ఇది కోరుకుంటున్నాను, నేను అది కోరుకుంటున్నాను, నేను అది కోరుకుంటున్నాను." ఆధ్యాత్మిక వ్యక్తులు అని పిలవబడే వారు, వారు కూడా విముక్తిని కోరుకుంటారు. ఇది కూడా కోరికే. కానీ చైతన్య మహాప్రభు చెప్తారు "ఈ స్వభావం కలిగినది ఏదైనా నాకు ఇష్టం లేదు. కేవలం నేను మీ సేవలో నిమగ్నమవ్వాలి అని కోరుకుంటున్నాను. "జన్మని జన్మని - జన్మ జన్మ లకి అనగా, ఆయన"నా జన్మమరణముల యొక్క ఈ వ్యాధిని ఆపండి" అని కూడా అనలేదు. ఇది భక్తి-యోగ దశ. ఎటువంటి కోరిక లేదు. కేవలం ఒక్కటే ప్రార్థన ఏమిటంటే మీ సేవలో నన్ను నిమగ్నం చేయండి. (విరామం)

అందువల్ల మన హరే కృష్ణ కీర్తన కూడా అదే విషయము. ఇది కూడా చైతన్య మహాప్రభువుచే నేర్పించబడినది. హరే అంటే భగవంతుడు యొక్క శక్తిని సూచిస్తుంది; కృష్ణుడు, భగవంతుడు; రామ, భగవంతుడు. ఎందుకు? దయచేసి మీ సేవలో నన్ను నిమగ్నము చేయండి, అంతే. అది మన కోరిక కావాలి. దయచేసి మీ సేవలో నన్ను పాల్గొననివ్వండి. మొత్తం వ్యాధి ఏమిటంటే మనము భగవంతుడికి సేవ చేయడము మర్చిపోయాము. ఎందుకంటే మనము ఆలోచిస్తున్నాము, "నేను భగవంతుణ్ణి, వేరే భగవంతుడు ఏమిటి నేను సేవ చేయడానికి? నేను భగవంతుణ్ణి. "ఇది మాత్రమే వ్యాధి. అత్యంత భ్రమ నేను మొదటి అధ్యక్షుడు, మంత్రి, రాక్ఫెల్లర్, ఫోర్డ్, ఇది, అది అవ్వడానికి ప్రయత్నిస్తాను నేను విఫలమైనప్పుడు, అప్పుడు నేను భగవంతుడిగా మారాలనుకుంటున్నాను. అంటే మరొక అధ్యక్షుడిగా, మీరు చూస్తున్నారా? కాబట్టి భక్తి-యోగాలో అలాంటి కోరిక లేదు. కేవలం సేవ మాత్రమే. అధ్యక్ష పదవులు అన్ని విఫలమయినప్పుడు, నేను అత్యధిక అధ్యక్షుడిని, భగవంతుణ్ణి కావాలని కోరుతాను. మీరు చూడండి? కోరిక ఉంది, వ్యాధి ఉంది. వారు తెలుసుకోలేరు, వారికి తెలియదు నా వ్యాధి ఇంకా ఉన్నది అని తెలియదు. నేను అత్యధికంగా ఉండాలని కోరుతున్నాను. కానీ భక్తి-యోగా కేవలం వ్యతిరేకం. సేవకునిగా మారడానికి. సేవకుడు యొక్క సేవకుడు ( CC Madhya 13.80) కేవలము వ్యతిరేకము. భగవంతుడు లేదా అధ్యక్షుడు లేదా ఇది కావాలనే ప్రశ్నే లేదు నేను సేవ చేయాలనుకుంటున్నాను, అంతే.అది కీలకమైన పరీక్ష. సేవ వాస్తవ స్వభావం. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో కూడా మీరు సేవ చేస్తున్నారు. మీరు అధ్యక్షుడు కావాలనుకుంటే, ఓటర్లకు చాలా సార్లు నేను వాగ్దానం చేయాలి, "నేను మీకు సేవను అందిస్తాను." సేవ యొక్క వాగ్దానం లేకుండా, అధ్యక్ష పదవి రావడము అనే ప్రశ్నే లేదు. నిజానికి నా స్థితి సేవ చేయడము. నేను రాష్ట్రపతి లేదా మంత్రి లేదా ఇది లేదా అది అయినా. అది వారు అర్థం చేసుకోరు. నేను అత్యంత అధికారము గల వ్యక్తిని అయినప్పటికీ, అధ్యక్షుడిని - ఓ, నేను నా ప్రజలకు సేవ చేయవలసి ఉంటుంది, లేకపోతే వెంటనే వారు నన్ను దించేస్తారు. అందువలన నా వాస్తవమైన స్థితి సేవ. కానీ ఇక్కడ సేవ చాలా ప్రమాదకరమైనది - కొద్దిగా సేవలో వ్యత్యాసం ఉన్నట్లయితే, వెంటనే అధ్యక్షుడు తొలగించబడతారు. ఎందుకు మీ అధ్యక్షుడు మిస్టర్ కెన్నెడీని తొలగించారు? ఎందుకంటే కొందరు ప్రజలు ఇష్టపడలేదు మీకు చక్కని సేవను చేస్తున్నారు అని. ఇది మూల వాస్తవం. కావున మీరు సేవ ద్వారా ఇక్కడ సంతృప్తి పర్చలేరు. భారతదేశంలో మన గాంధీ, ఆయన కూడా చంపబడ్డాడు. ఆయన జీవితమంతా సేవలను అందించాడు, కానీ ఆ సమయంలో ప్రజలు ఇష్టపడలేదు. ఓ, మీరు ఆ సేవను అందించడం లేదు. కాబట్టి ఇది పరిస్థితి. అందువల్ల తెలుసుకోవడానికి వ్యక్తికి తగినంత తెలివి ఉండాలి ఈ భౌతిక లక్ష్యములకు ఇంకా సేవ చేయకూడదు. నేను భగవంతునికి సేవ చేయాలి. అది జీవితము యొక్క పరిపూర్ణత.