TE/Prabhupada 0703 - మీరు మీ మనస్సుతో కృష్ణున్ని గ్రహించినట్లయితే అపుడు అది సమాధి



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


భక్తుడు: ప్రభుపాద? ఎనిమిది అంగాల యోగ పద్ధతి పరిపూర్ణతలో వచ్చిన సమాధి మరియు భక్తియోగ యొక్క సమాధి రెండూ ఒకటేనా?

ప్రభుపాద: అవును. సమాధి అంటే మనస్సుతో విష్ణువును గ్రహించటం. అది సమాధి. అందువల్ల మీరు మీ మనస్సుతో కృష్ణున్ని గ్రహించినట్లయితే అపుడు అది సమాధి. (విరామం) ఏదైనా ప్రశ్న ఉందా? ఆయన అడుగుతాడు. సరే.

యువకుడు: స్వామీజీ? మీరు ఇలా అన్నారు, ఎప్పుడు, మీరు చాలా ఎక్కువగా తిన్నట్లయితే మీరు చెల్లించాలి. కానీ భక్తుల గురించి ఎలా? వారు చాలా ప్రసాదం తిన్నప్పుడు ఏమవుతుంది?

ప్రభుపాద: మీరు మరింత తినాలనుకుంటున్నారా?

యువకుడు: నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.....

ప్రభుపాద: మీరు అనుకుంటున్నారా మీరు ఎక్కువ తింటున్నారు అని? కాబట్టి మీరు ఎక్కువ తినవచ్చు.

యువకుడు: నేను అనుకున్నాను, నేను తినగలను...

ప్రభుపాద: అవును, మీరు ఎక్కువ తినవచ్చు అవును, తినటంలో రెండు రకాల తప్పులు ఉన్నాయి అని వైద్య సలహా ఉంది. అతిగా తినటం మరియు తక్కువగా తినటం. కాబట్టి తక్కువ తినటం అనే తప్పు ముసలి వారి కోసం చాలా మంచిది. ఎక్కువ తినడం అనే తప్పు అబ్బాయిలకు, అది మంచిది. కాబట్టి మీరు ఎక్కువ తినవచ్చు. నావల్ల కాదు.

యువకుడు: తమాల మరియు విష్ణు జన గురించి ఏమిటి? (నవ్వు)

ప్రభుపాద: అతను చేయకూడదు. నువ్వు చేయగలవు. నీవు ఎంత కావాలంటే అంత తినవచ్చు. ఉచితముగా (నవ్వు)