TE/Prabhupada 0707 - ఎవరైతే ఉత్సాహంతో లేరో సోమరిగా ఉంటారో వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళరు



Lecture on SB 3.26.30 -- Bombay, January 7, 1975


అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు paras tasmāt tu bhāvaḥ anyaḥ: ( BG 8.20) అక్కడ మరొక భావ ప్రకృతి ఉంది. ప్రకృతి ఏమిటి? Sarveṣu naśyatsu na vinaśyati: ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచం, ఈ భౌతిక సృష్టి, అద్భుతమైన ప్రపంచం, నాశనము అయినప్పుడు, అది ఉంటుంది. అది నాశనము కాదు. " అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎడారిలో ఎండమావుల వలె. ఎడారిలో నీరు విస్తారంగా ఉన్నట్లు కొన్నిసార్లు మీరు చూస్తారు. జంతువు నీటి కోసము పరిగెడుతుంది, దాహంతో ఉండటము వలన, కానీ అక్కడ నీరు లేదు. అందువలన జంతువు చనిపోతుంది. కానీ మానవుడు జంతువులా ఉండకూడదు. వారు వారి ప్రమాణాన్ని పెంచుకోవాలి. వారు ప్రత్యేక చైతన్యము కలిగి ఉన్నారు. ఈ సాహిత్యాలు, భగవంతుడు ఇచ్చిన వేదముల సాహిత్యాల ద్వారా వారు వారి అవగాహన ప్రమాణమును పెంచుకోవచ్చు. వ్యాసదేవ కృష్ణుడి అవతారం, అందువలన ఆయన వేదముల సాహిత్యం ఇచ్చాడు. అందువలన ఆయన నామము వేదవ్యాస, భగవంతుని అవతారం, వేదవ్యాస. Mahā-muni-kṛte kiṁ vā paraiḥ. అక్కడ కల్పనల అవసరం లేదు. కేవలం గురు శిష్య పరంపరలో వ్యాసదేవుడిని అనుసరించండి. వ్యాసదేవుని యొక్క శిష్యుడు నారద ముని. నారద ముని యొక్క శిష్యుడు వ్యాసదేవ. కాబట్టి ఈ పరంపర పద్ధతిలో మనకు జ్ఞానం లభిస్తే, అది పరిపూర్ణ జ్ఞానం. కావున మనము దాన్ని అంగీకరించాలి. నిశ్చయాత్మిక.

అందువల్ల రూప గోస్వామి చెబుతాడు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థానము వెళ్లడానికి, మొదటి సూత్రం ఉత్సాహం. ఉత్సాహత్. ఉత్సాహః అంటే ఉత్సాహం: అవును, కృష్ణుడు చెప్పారు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) నేను దానిని అంగీకరించి మరియు ఉత్సాహంగా పని చేస్తాను ఆ సూత్రము మీద." కృష్ణుడి చెప్పినట్లుగా కృష్ణుడు చెప్పారు, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) , మనము దీన్ని చేయాల్సి ఉంటుంది, ఉత్సాహంగా దీన్ని అమలు చేయాలి: అవును, నేను ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తాను. మన్మనాః. కృష్ణుడు నేరుగా చెప్పారు. మన్మనాః భవ మద్భక్తాః, మీరు కేవలం నా భక్తుడవు కమ్ము. కాబట్టి మనము ఉత్సాహముగా ఉండాలి, "అవును, నేను కృష్ణుడి భక్తుడను అవుతాను." Man-manā bhava mad-bhakto mad-yājī. కృష్ణుడు చెప్పెను, "నన్ను పూజించు", కాబట్టి కృష్ణుడిని పూజించడానికి మనము చాలా ఉత్సాహంగా ఉండాలి, మంగళ హారతి చేయండి, ఉదయాన్నే నిద్ర లేవండి. ఇవన్నీ ఉత్సాహం క్రింద ఉన్నాయి, ఉత్సాహ. ఎవరైతే ఉత్సాహంతో లేరో, సోమరితనం, మందంగా ఉండే వారు, వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థానమునకు రాలేరు. కేవలం నిద్ర, వారు చేయలేరు. ఒకరు తప్పనిసరిగా, చాలా ఉత్సాహముగా, సానుకూలంగా ఉండాలి. ఉత్సహాద్ ధైర్యాత్. ధైర్య అంటే సహనం, అంతే కానీ "నేను గొప్ప ఉత్సాహంతో భక్తియుక్త సేవను చేస్తున్నాను కనుక...." అందువల్ల మీరు ఇంతకు మునుపే పరిపూర్ణ స్థితి మీద ఉన్నారు, కానీ మీరు అసహనానికి గురైనట్లయితే "ఎందుకు నేను పరిపూర్ణతను పొందటము లేదు? కొన్నిసార్లు మాయ ఎందుకు నన్ను తన్నుతుంది? " అవును. అది అలవాటు. అది కొనసాగుతుంది. ఇది ఆగిపోతుంది. నిశ్చయాత్. ధైర్యాత్, నిశ్చయాత్, అది ఎప్పుడైతే "కృష్ణుడు చెప్పారు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) ఇప్పుడు నేను అన్నింటినీ విడిచి పెట్టాను. నాకు ఇతర వృత్తిపరమైన బాధ్యతలు లేవు. కేవలం కృష్ణుడిని సేవిస్తాను. కాబట్టి ఎప్పుడైతే నేను దానిని తీసుకుంటానో, అప్పుడు నిశ్చయ, కృష్ణుడు పరిపూర్ణంగా నాకు రక్షణ కల్పిస్తాడు. దానిని "నిశ్చయ" అంటారు. నిరాశ చెందకండి. కృష్ణుడు ఒక మోసము చేసే వక్త కాదు. ఆయన చెప్పారు, ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi.