TE/Prabhupada 0720 - మీరు కృష్ణ చైతన్యము ద్వారా మీ కామ కోరికలను నియంత్రించుకోండి



Lecture on BG 16.10 -- Hawaii, February 6, 1975


కుక్క చాలా గర్వంగా ఉంటుంది, మొరుగుతుంది, "భౌ! భౌ! భౌ!" నేను బంధించబడి ఉన్నాను అని దానికి తెలియదు. (నవ్వుతూ) అది ఎంత వెర్రిది అంటే, యజమాని పిలిచిన వెంటనే - "ఇక్కడకు రా." (నవ్వు) కాబట్టి మాయ యజమాని : "ఓ మూర్ఖుడా, ఇక్కడకు రా." "అవును వస్తున్నాను." మనము ఆతనిని చూస్తాము, గర్వముగా,: "నేను ఏదో సాధించాను." ఈ కుక్కల నాగరికత, నష్ట-బుద్ధయా, తెలివిని అంతా కోల్పోయింది... తక్కువ తెలివైన వారు వీరందరిని పిలుస్తారు. Kāmaṁ duṣpūram. కాబట్టి కామమ్, కామ కోరికలు... ఈ శరీరము వలన కామ కోరిక ఉంది. మనము దానిని తిరస్కరించలేము. కానీ దాన్ని చేయకండి duṣpūram - ఎప్పటికీ సంతృప్తి చెందదు. తరువాత ముగిసిపోతుంది. దీనిని పరిమితం చేయండి. దీనిని పరిమితం చేయండి. అందువల్ల, వేదముల నాగరికత ప్రకారం, కామ కోరిక ఉంది, కానీ మీరు ఒక మంచి బిడ్డను పొందే ఉద్దేశ్యంతో తప్ప మీరు ఉపయోగించ కూడదు. ఇది pūram అని అంటారు, అనగా పరిమితం.

కాబట్టి బ్రహ్మచారి ఆ విధముగా విద్యావంతుడు అవుతాడు. ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆయన ఒక యువతిని చూడడు. ఆయన కనీసము చూడడు కూడా. ఇది బ్రహ్మచారి. ఆయన చూడడు. ఆ విధముగా ఆయన బ్రహ్మచారి జీవితాన్ని కొనసాగిస్తాడు, ఆ విధముగా ఆయన శిక్షణ పొందుతాడు. Naiṣṭhika-brahmacārī. ఆయనకు సాధ్యం కాకపోతే, అతడు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. దీనిని గృహస్థ జీవితం, గృహస్థుల జీవితం అని పిలుస్తారు. ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు, ఇది యవ్వనంలో ఉన్న సమయం, అందుచే తన కామ కోరికలు చాలా బలంగా ఉంటాయి. నియంత్రించలేని వ్యక్తికి... అందరికి కాదు. అనేక మంది నైష్టిక - బ్రహ్మచారి ఉన్నారు . నైష్టిక- బ్రహ్మచారి -బ్రహ్మచారి- జీవితం అంతా బ్రహ్మచారి. కానీ ఈ యుగములో అది సాధ్యం కాదు, బ్రహ్మచారి అవ్వటానికి అవకాశం లేదు. సమయం మారినది, ఈ యుగము. అందువల్ల మీరు కృష్ణ చైతన్యము ద్వారా మీ కామ కోరికలను నియంత్రించవచ్చు. లేకపోతే అది సాధ్యం కాదు.

Yad-avadhi mama cetaḥ kṛṣṇa-padāravinde. ఒక చక్రవర్తి ఉన్నాడు, ఆయన రాజు, కాబట్టి సహజంగా ఆయన కూడా కామంతో ఉన్నాడు. అందువలన ఆయన ఈ జీవితాన్ని వదిలిపెట్టాడు, భక్తుడు అయ్యాడు. ఆయన సంపూర్ణంగా స్థిరముగా ఉన్నపుడు, ఆయన ఇలా చెప్పాడు, యమునాచార్య- ఆయన రామానుజాచార్య గురువు- అందువలన ఆయన yad-avadhi mama cetaḥ kṛṣṇa-padāravinde అని చెప్పారు: కృష్ణుడి యొక్క కమల పాదాల సేవలో నిమగ్నమవ్వాలని నా మనస్సును శిక్షణ ఇచ్చినప్పటి నుండి, yad-avadhi mama cetaḥ kṛṣṇa-padāravinde nava-nava-dhāmany udyataṁ rasa, రోజువారీ నేను కృష్ణుడికి సేవలను చేస్తున్నాను, నేను కొత్త, క్రొత్త ఆనందాన్ని పొందుతున్నాను. ఆధ్యాత్మిక జీవితం అంటే... ఒక వ్యక్తి నిజానికి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నట్లయితే ఆయన పొందుతాడు ఆధ్యాత్మికం ఆనందం, ఆధ్యాత్మిక పరమానందమును, మరింత మరింత సేవించడం ద్వారా, కొత్త కొత్త. అది ఆధ్యాత్మిక జీవితం. అందువల్ల యమునాచార్య అన్నారు, yad-avadhi mama cetaḥ kṛṣṇa-padāravinde nava-nava-dhāmany udyataṁ rantum āsīt: నేను కృష్ణుడి కమల పాదములకు సేవను చేస్తూ ప్రతి క్షణం ఆధ్యాత్మిక ఆనందాన్ని అర్ధము చేసుకుంటున్నాను, tad-avadhi, "అప్పటి నుండి," bata nārī-saṅgame... కొన్నిసార్లు మనము లైంగిక జీవితం గురించి ఆలోచిస్తూ సూక్ష్మ ఆనందాన్ని అనుభవిస్తాము. ఇది నారి సంగమ అని పిలువబడుతుంది. నారి అంటే స్త్రీ, సంగమ అంటే కలయిక. కాబట్టి ఆచరణలో ఉన్నవారికి, వాస్తవానికి ఏ కలయిక లేనప్పుడు, కలయిక గురించి వారు ఆలోచిస్తారు. కాబట్టి యమునాచార్య ఇలా చెబుతున్నారు, "వాస్తవానికి మహిళతో కలయిక కాదు, కానీ కలయిక గురించి నేను ఆలోచించినప్పుడు, tad-avadhi bata nārī-saṅgame smaryamāne, smaryamāne, "కేవలం ఆలోచించినంత మాత్రమునే," భవతి ముఖ- వికారః , "ఓ, వెంటనే నేను విసుగు చెందుతున్నాను: 'అహ్, ఈ అసహ్యపు విషయము ఏమిటి?'" Suṣṭhu niṣṭhī..(ఉమ్మేసే ధ్వని చేస్తున్నారు) ఇది పరిపూర్ణంగా ఉంది. (నవ్వు) ఇది పరిపూర్ణత. అవును. ఎంత కాలము మనం ఆలోచిస్తామో, సూక్ష్మమైన మైథునము అని పిలుస్తారు, ఆలోచించడం. వారు లైంగిక సాహిత్యాన్ని చదువుతారు. అది సూక్ష్మ మైథునము . స్థూల మైథునము మరియు సూక్ష్మ మైథునము. కాబట్టి ఈ కామ కోరికల నుండి పూర్తిగా విముక్తి పొందాలి, వీటిలో చిక్కుకోకూడదు, ఎప్పటికీ సంతృప్తి పర్చలేరు, సంతృప్తి పరచలేని, duṣpūram