TE/Prabhupada 0722 - సోమరితనము ఉండకూడదు. ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండండి



Arrival Lecture -- Mexico, February 11, 1975, (With Spanish Translator)


నేను చాలా ఆనందంగా ఉన్నాను, అందరూ కృష్ణుడి భాగము మరియు అంశ. మీరు కృష్ణ చైతన్యమును అర్థం చేసుకోవడానికి వచ్చారు. సూత్రాలకు కట్టుబడి ఉండండి, అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. సూత్రం మనల్ని పవిత్రం చేసుకోవడం. ఎలా అయితే ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆయన నియంత్రణ సూత్రం ద్వారా తనను తాను పవిత్రం చేసుకోవాలి, ఆహారం ద్వారా, ఔషధం ద్వారా, అదే విధముగా, ఈ భౌతిక వ్యాధి వచ్చింది, భౌతిక శరీరం ద్వారా కప్పబడి ఉంది, దుఃఖం యొక్క లక్షణం జన్మించడము, మరణం, వృద్ధాప్యము మరియు వ్యాధి. కాబట్టి ఎవరైతే ఈ భౌతిక బంధనము నుండి బయట పడుటకు తీవ్రంగా ఉన్నారో ఇంకా జన్మ, మరణము, వృద్ధాప్యము మరియు వ్యాధి నుండి విముక్తి కొరకు అందువలన అతడు ఈ కృష్ణ చైతన్యమును తీసుకోవాలి. ఇది చాలా సులువు మరియు సులభం. మీకు తెలియకపోతే, మీరు విద్యావంతులు కాకపోతే, మీకు ఆస్తి లేకపోతే, మీరు కేవలం హరేకృష్ణ మహా - మంత్రాన్ని జపించండి. మీరు చదువుకున్నట్లయితే, తార్కికుడు, తత్వవేత్త, మీరు పుస్తకాలను చదువుకోవచ్చు, వీటిలో ఇప్పటికే వున్నవి, యాభై వరకు ఉన్నాయి. నాలుగు వందల పేజీలవి సుమారు 75 పుస్తకాలు ఉన్నాయి, తత్వవేత్త, శాస్త్రవేత్త, విద్యావేత్తను ఒప్పించేందుకు. (కృష్ణ చైతన్యము ఏమిటి అని) ఇది ఆంగ్లంలో ఇతర ఐరోపా భాషల్లో కూడా ప్రచురించబడినది. దాని ప్రయోజనాన్ని తీసుకోండి. ఈ ఆలయంలో విగ్రహారాధనతో పాటుగా ఐదు గంటల తరగతులు నిర్వహించండి. పాఠశాలలు కళాశాలల్లో ఎలాగయితే రోజువారీ తరగతులు ఉంటాయో, నలభై ఐదు నిమిషాల తరగతి. తరువాత ఐదు లేక పది నిమిషాలు విరామం, మళ్ళీ 45 నిమిషాల తరగతి, ఈ విధముగా, కాబట్టి మనము అధ్యయనం చేయడానికి తగినంత విషయాన్ని కలిగి ఉన్నాము. మనము ఈ పుస్తకాలు అన్నీ అధ్యయనం చేస్తే, వాటిని పూర్తి చేయడానికి కనీసం 25 సంవత్సరాలు తీసుకుంటుంది. కాబట్టి మీరు అందరూ యువకులు. పుస్తకాలు చదవడానికి మీ సమయాన్ని వినియోగించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. జపములో, దేవతారాధనలో, ప్రచారము చేయుటలో, పుస్తకాలను వితరణ చేయుటలో. సోమరితనము ఉండకూడదు. ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండండి. అప్పుడు అది కృష్ణ చైతన్యము.

కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు,

māṁ hi pārtha vyapāśritya
ye 'pi syuḥ pāpa-yonayaḥ
striyaḥ vaiśyās tathā śūdrās
te 'pi yānti parāṁ gatim

( BG 9.32)

ఈ పురుషుడు అనుమతించబడాలి, ఈ స్త్రీ అనుమతించబడదు. అను ఎటువంటి వివక్షత లేదు. కృష్ణుడు చెప్తారు "ఎవరినైనా"- striyah vaisyas tatha sudras. కృష్ణ చైతన్యము తీసుకునే ఎవరైనా, అతడు భౌతిక బంధనము నుండి విముక్తి పొందుతాడు. వెనక్కు తిరిగి, భగవంతుని దగ్గరకు, తిరిగి ఇంటికి వెళతాడు. కాబట్టి ఈ ఉద్యమం గురించి తీవ్రంగా పరిగణించండి మరియు సూత్రాన్ని అమలు చేయండి, మాంసం తినకూడదు, అక్రమ లైంగికత ఉండకూడదు, మత్తు ఉండకూడదు. జూదం ఉండకూడదు మరియు పదహారు మాలలు జపించండి