TE/Prabhupada 0725 - విషయాలు చాలా సులభంగా కొనసాగవు. మాయ చాలా చాలా బలంగా ఉంది



Lecture on SB 7.9.22 -- Mayapur, February 29, 1976


ఇది మానవ జీవితం అని, ఒకరు అర్థం చేసుకున్నప్పుడు... జంతు జీవితం అవి బాధ అంటే ఏమిటో అర్థం చేసుకోలేవు. పిల్లులు కుక్కలు, అవి చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు ఆలోచిస్తున్నవి. కానీ మానవ జీవితం లో వారు అవగాహనకు రావాలి అది వాస్తవమునకు, మనము సంతోషంగా జీవించుట లేదు. మనము అనేక విధాలుగా కాలచక్రం ద్వారా చితకగొట్టబడుతున్నాము. Niṣpīḍyamānam. ఈ జ్ఞానం వచ్చినప్పుడు, అతడు మానవుడు. లేకపోతే అతను జంతువు. అతను నేను బాగున్నాను అని ఆలోచిస్తే... అంటే 99.9 శాతం మంది "నేను బాగా ఉన్నాను." అని ఆలోచిస్తారు. జీవితం యొక్క అత్యంత అసహ్యకర పరిస్థితి లో కూడా, ఉదాహరణకు పంది మరియు కుక్క వలె, అయినప్పటికీ, అతను ఆలోచిస్తున్నాడు, "నేను బాగా ఉన్నాను." ఈ అజ్ఞానం ఎంత కాలము కొనసాగుతుందో, అతను కేవలం జంతువు. Yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke sva-dhīḥ kalatrādiṣu bhauma-ijya-dhīḥ ( SB 10.84.13) ఇది కొనసాగుతోంది. Ātma-buddhiḥ, tri-dhātuke. కఫ, పిత్త, వాయువులతో తయారు చేయబడిన ఈ శరీరం, ప్రతిఒక్కరూ ఆలోచిస్తున్నారు "నేను ఈ శరీరం." మొత్తం ప్రపంచ కొనసాగుతోంది. కేవలం మనము, కృష్ణ చైతన్య ఉద్యమంలో కొందరు సభ్యులము, మనము ఇంటి ఇంటికి వెళ్లి వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాము, "అయ్యా మీరు ఈ శరీరం కాదు." వారు దానిని పట్టించుకోరు. "నేను." "నేను ఈ శరీరం," నేను మిస్టర్ జాన్, " నేను ఇంగ్లీషు వ్యక్తిని, "నేను అమెరికన్," "నేను భారతీయుడిని." "మీరు ఈ శరీరాన్ని కాదు అని అంటున్నారు." చాలా కష్టమైన పని. కృష్ణ చైతన్య ఉద్యమమును, నెట్టడానికి, గొప్ప సహనం, పట్టుదల, ఓర్పు అవసరం. కానీ చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ,

tṛṇād api sunīcena
taror api sahiṣṇunā
amāninā mānadena
kīrtanīyaḥ sadā hariḥ
(CC Adi 17.31)

కాబట్టి ఎవరైతే కృష్ణ చైతన్య ప్రచారం పని సేవ తీసుకున్నారో, వారు ఎల్లప్పుడూ తెలుసుకోవాలి అది విషయాలు సులభంగా కొనసాగవని. మాయ చాలా చాలా బలంగా ఉంది. చాలా చాలా బలంగా ఉంది. అయినా, మనం మాయకి వ్యతిరేకంగా పోరాడాలి. ఇది మాయతో యుద్ధ ప్రకటించడం. మాయ జీవులను తన నియంత్రణలో ఉంచుకుంటుంది, మనము ఆమె వైఖరి నుండి జీవులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము... ఈ తేడా ఉంది. Kālo vaśī-kṛta-visṛjya-visarga-śaktiḥ. ఈ శక్తి, visarga-śaktiḥ, చాలా చాలా బలమైనది, కానీ అది నియంత్రణలో ఉంది. ఇది చాలా, ఆమె చాలా చాలా బలమైనదైనప్పటికీ, కానీ ఆమె కృష్ణుని నియంత్రణలో ఉంది. Mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram ( BG 9.10) ప్రకృతి అద్భుతంగా నడుకుంటున్నప్పటికీ, చాలా, చాలా, నేను చెప్పేదేమిటంటే, ఆమె చేస్తున్నది గొప్ప పని, అది వెంటనే మేఘం వస్తుంది. ఇప్పుడు అది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక్క క్షణంలో అతి పెద్ద, నల్లని మేఘం వచ్చి వెంటనే వినాశనం చేస్తుంది. అది సాధ్యమే. ఇవి మాయ యొక్క అద్భుతమైన కార్యక్రమాలు. ఐనప్పటికీ, ఆమె దేవాదిదేవుని యొక్క నియంత్రణలో ఉంది. మనము ఈ సూర్యుడిని చాలా పెద్దదిగా చూస్తాము, ఈ భూమి కంటే పధ్నాలుగు వందల వేల రెట్లు పెద్దది, మీరు ఉదయం చూస్తారు, ఇది ఎంత త్వరగా పైకి వస్తుందో, తక్షణమే. క్షణానికి పదహారు వేల మైళ్ళ వేగం. ఈ విధంగా ఎలా జరుగుతుంది? Yasyājñayā bhramati saṁbhṛta-kāla-cakro govindam ādi-puruṣaṁ tam ahaṁ... (Bs. 5.52). ఇది గోవిందుని అజ్ఞానుసారం జరుగుతుంది. కాబట్టి అందువలన ఆయన విభు. ఆయన గొప్పవాడు. కానీ ఆయన ఎంత గొప్పవాడు అని మనకు తెలియదు. అందువలన మనం మూర్ఖముగా కొందరు నటించేవారిని, కొందరు మోసగాళ్లను భగవంతుడుగా అంగీకరిస్తాము. భగవంతుడు అంటే అర్థమేమిటో మనకు తెలియదు. కానీ అది జరుగుతోంది. మనము మూర్ఖులము. Andhā yathāndair upanīyamānās. మనము గ్రుడ్డివాళ్లము, మరొక గ్రుడ్డివాడు మనల్ని నడిపిస్తాడు: నేను భగవంతుణ్ణి. మీరు భగవంతులే. అందరూ భగవంతులే. కానీ భగవంతుడు అలాంటివాడు కాదు. ఇక్కడ అది చెప్పబడింది ఆ భగవంతుడు ఎవరంటే... Kālo vaśī-kṛta-visṛjya-visarga-śaktiḥ: ఆయన కాల చక్రం మరియు సృష్టించే శక్తిని తన నియంత్రణలో ఉంచుకుంటాడు. అది భగవంతుడు