TE/Prabhupada 0736 - మనం విడిచిపెట్టాలి ఇవి అన్ని పిలవబడే లేదా మోసం చేసే మతపరమైన పద్ధతులు



Arrival Lecture -- Calcutta, March 20, 1975


శ్రీమద్-భాగవతము ఏ ఒక్క నిర్దిష్టమైన మతము యొక్క పేరును పేర్కొనలేదు. అది ఇలా చెబుతోంది, "ఆ ధర్మము, మతము యొక్క పద్ధతి, మొదటి తరగతిది," sa vai puṁsāṁ paro dharmaḥ ( SB 1.2.6) "సర్వోత్క్రష్టమైనది." ఈ హిందూ ధర్మము, ముస్లిం ధర్మము, క్రిస్టియన్ ధర్మము , అవి అన్నీ ప్రాకృత, ప్రాపంచికముగా ఉన్నాయి. కానీ మనము వెళ్ళి, అధిగమించాలి, ఈ ప్రాకృత , లేదా మతము యొక్క ప్రాపంచిక భావనను - మనము హిందువులము, "మనము ముస్లింలము," "మనము క్రైస్తవులము." కేవలము బంగారం వలె . బంగారం ఎప్పుడు బంగారమే. బంగారం హిందూ బంగారం లేదా క్రిస్టియన్ బంగారం లేదా మహమ్మదీయ బంగారం కాదు. ఎవరూ ... ఎందుకంటే బంగారం ముద్ద ఒక హిందూ లేదా ముస్లింలో చేతిలో ఉంది, ఎవరూ చెప్పరు, "ఇది ముస్లిం బంగారం," "ఇది హిందూ బంగారం." అందరూ ఇలా చెబుతారు, "ఇది బంగారం." కాబట్టి మనము బంగారం ఎంపిక చేసుకోవాలి - హిందూ బంగారం లేదా ముస్లిం బంగారం లేదా క్రిస్టియన్ బంగారం కాదు. భగవంతుడు కృష్ణుడు చెప్పెను, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja ( BG 18.66) ఆయన ఈ హిందూ ధర్మము లేదా ముస్లిం ధర్మము అని చెప్పటము లేదు. ఇవి కల్పించబడినవి. కాబట్టి మనం పవిత్రమైన స్థానమునకు రావాలి. అక్కడ ఏ హోదా చిహ్నం ఉండని చోటుకు. అహం బ్రహ్మాస్మి: "నేను కృష్ణుడిలో భాగం మరియు అంశ." ఇది వాస్తవమైన ధర్మము. ఈ భావన లేకుండా, ఏ విధమైన కల్పితమైన ధర్మము, అది ప్రాకృత. అది సర్వోత్క్రష్టమైనది కాదు.

కాబట్టి మన కృష్ణ చైతన్య ఉద్యమం ఆధ్యాత్మికము, పరో ధర్మా. Sa vai puṁsāṁ paro dharmaḥ. పరో అనగా "పైన," మత పద్ధతి అని పిలవబడే దానికి అతీతముగా. కాబట్టి ఇది మనము తయారు చేసిన విషయాలు కాదు. ఇది ప్రారంభంలో శ్రీమద్-భాగవతం లో చెప్పబడింది, dharmaḥ projjhita-kaitavaḥ atra ( SB 1.1.2) ఏ రకమైన కైతవః, కపటము కలిగిన లేదా తప్పుడు, భ్రమ, కైతవః. కైతవః అంటే మోసం అని అర్థం. మోసపూరిత రకమైన మతము తిరస్కరించబడింది, దూరంగా విసిరివేయబడినవి, ప్రోజ్జితః. Prākṛṣṭa-rūpeṇa ujjhita. ఉదాహరణకు మనము నేలను ఊడ్చేసినట్లు, మనము దుమ్ము చివరి కణాన్ని కూడా తీసుకొని దానిని త్రోసివేస్తాము, అదేవిధముగా, కృష్ణ చైతన్యవంతుడిగా మారడం అంటే మనం విడిచిపెట్టాలి ఇవి అన్ని పిలవబడే లేదా మోసం చేసే మతపరమైన పద్ధతులు. ఎందుకంటే చాలా విభిన్నమైన కల్పిత మత పద్ధతులను అనుసరించిన అనుభవం చూపెడుతుంది, భగవంతుని ఎలా ప్రేమించాలి అనే స్థితిని ఎవరూ సాధించలేదు . అది ఎవరూ సాధించలేదు. ఇది ఆచరణాత్మక అనుభవం. ఇది ... శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభు, ఆయన ప్రవేశపెట్టారు కానీ భగవంతుడు కృష్ణుడు ఈ సూచన ఇచ్చారు, "ఇది వాస్తవమైన ధర్మము , mām ekaṁ śaraṇaṁ vraja. ఇది ధర్మము . ఏ ఇతర మతము, మతము యొక్క పద్ధతి, భగవంతుని ఎలా ప్రేమించాలి అని అనుచరులకు శిక్షణ ఇవ్వనిది, అది మోసము చేసే మతము. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ప్రేమాపుమార్తో మహాన్. భాగవతము కూడా అదే విషయం చెప్తున్నది. జీవితంలో వాస్తవమైన విజయము సాధించడం అంటే భగవంతుని లేదా కృష్ణుని ఎలా ప్రేమించాలి. అది జీవితం యొక్క అత్యధిక పరిపూర్ణము