TE/Prabhupada 0744 - కానీ మీరు కృష్ణుడిని చూసిన వెంటనే, నీవు నీ శాశ్వత జీవితాన్ని పొందుతావు



Lecture on SB 7.9.53 -- Vrndavana, April 8, 1976


కాబట్టి ప్రహ్లాద మహారాజ తన తండ్రి చే చాలా విధాలుగా శిక్షింపబడ్డాడు, కానీ ఆయన కృష్ణుడిని మర్చిపోలేదు. ప్రేమ స్థిరముగా ఉంది. అందువల్ల కృష్ణుడు చాలా ఆనంద పడినాడు , prīto 'ham. Prīto 'ham. Prahlāda bhadraṁ ( SB 7.9.52) కావున... Mām aprīṇata āyuṣman ( SB 7.9.53) ఆయుస్మాన్, వరము: "ఇప్పుడు నీవు ఎలా దీర్ఘ కాలం జీవించవచ్చు," లేదా "శాశ్వతముగా జీవించడము", ఆయుస్మాన్ . ఆయుస్ అంటే జీవిత కాల వ్యవధి. ఒకరు కృష్ణుడి దగ్గరకు చేరుకున్నప్పుడు... Mām upetya kaunteya duḥkhālayam aśāśvatam, nāpnuvanti. Duḥkhālayam ( BG 8.15) ఎంత కాలము మనము ఈ భౌతిక శరీరమును కలిగి ఉంటామో, భౌతిక ప్రపంచములో , అది దుఃఖాలయం అశాశ్వతము ఇది పూర్తిగా బాధాకరమైన స్థితిలో ఉంది, అదే సమయంలో శాశ్వతము కాదు. మనము బాధాకరమైన పరిస్థితిని అంగీకరించినప్పటికీ... అందరూ జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వృద్ధుడు చనిపోవటానికి ఇష్టపడడు. ఆయన డాక్టర్ దగ్గరకు వెళతాడు, ఆయన తన జీవితాన్ని కొనసాగించడానికి కొంత ఔషధమును తీసుకుంటాడు. కానీ ఆయన జీవించడానికి అనుమతించబడదు. అశాశ్వతము . మీరు చాలా గొప్ప వ్యక్తి కావచ్చు, మీరు చాలా మాత్రలు తీసుకోవచ్చు, మీ జీవితం పొడిగించటానికి చాలా ఇంజక్షన్లు తీసుకోవచ్చు, కానీ అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. కానీ మీరు కృష్ణుడిని చూసిన వెంటనే, నీవు నీ శాశ్వత జీవితాన్ని పొందుతావు. శాశ్వత జీవితము మనము కలిగి ఉన్నాము. మనము శాశ్వతమైన వారము. Na hanyate hanyamāne śarīre ( BG 2.20) మనము శరీరం యొక్క నాశనం తరువాత మరణించడము లేదు. మనము మరొక శరీరమును పొందుతాము. ఇది మన వ్యాధి. మీరు కృష్ణుడిని చూసినప్పుడు, మీరు కృష్ణుడిని అర్థం చేసుకున్నప్పుడు... చూడకుండానే, మీరు కేవలము కృష్ణుడిని అర్థం చేసుకుంటే, అప్పుడు నీవు శాశ్వతంగా ఉంటావు.

Janma karma ca me divyaṁ
yo jānāti tattvataḥ
tyaktvā dehaṁ punar janma
naiti...
( BG 4.9)

కృష్ణుడు చెప్తాడు. కేవలం కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. కృష్ణుడిని అర్థం చేసుకోవడము కూడా కృష్ణుడిని చూడడము, ఆయన పరిపూర్ణము - వ్యత్యాసము లేదు. భౌతిక ప్రపంచంలో వలె మీరు ఏదో అర్థము చేసుకుంటారు కానీ మీరు చూడలేరు. ఇది ద్వంద్వము. కానీ సంపూర్ణములో, మీరు కృష్ణుణ్ణి అర్థం చేసుకుంటే, మీరు కృష్ణుణ్ణి వింటే, మీరు కృష్ణుడిని చూసినట్లయితే, మీరు కృష్ణుడితో కలిసి ఆడుకుంటే, వారు అందరూ ఒకటే. దీనిని సంపూర్ణము అని పిలుస్తారు. ద్వంద్వత్వం లేదు.

మీరు కేవలం కృష్ణుడిని అర్థం చేసుకుంటే, దివ్యమ్, దైవ స్వభావం... కేవలం కృష్ణుడు మనకు లాగా లేడని మీరు అర్థం చేసుకుంటే: కృష్ణుడికి భౌతిక శరీరం లేదు, కృష్ణుడు దుఃఖముగా లేడు, కృష్ణుడు సంతోషంగా ఉన్నాడు-కేవలం కొన్ని విషయాలు, మీరు కృష్ణుడి స్వభావమును నమ్మితే - వెంటనే మీరు భగవత్ ధామమునకు తిరిగి బదిలీ అవ్వడానికి అర్హత పొందుతారు, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళటము. ఇది కృష్ణ చైతన్యము, చాలా బాగుంది. కృష్ణుడు తనను తాను వివరిస్తున్నాడు, మీకు నమ్మకము కలిగితే, అవును, కృష్ణుడు చెప్పినది, అది సరైనది. అర్జునుడు చెప్పినట్లుగా, sarvam etam ṛtaṁ manye yad vadasi keśava: ( BG 10.14) మీరు చెప్పినది ఏదైనా నేను మొత్తం అంగీకరిస్తాను. తగ్గింపు లేదు, లేదు... Sarvam etam ṛtaṁ manye: "నీవు చెప్పినది ఏదైనా, నేను నమ్ముతున్నాను, నేను తీసుకున్నాను... నేను..." ఇది కృష్ణుడు. కృష్ణుడు ఏదో చెపుతున్నాడు, నేను ఏదో అర్థం చేసుకున్నాను. మీరు మీ లక్షలాది సంవత్సరాలు గడుపుతూ ఉండండి. అది ఎప్పటికీ సాధ్యపడదు. ఆయన చెప్పినట్లుగా మీరు కృష్ణుడిని అర్థం చేసుకోవాలి. అందువల్ల మనము భగవద్గీతని యధాతథముగా ఇస్తున్నాము. అది వాస్తవమైన అవగాహన