TE/Prabhupada 0746 - మీరు హరే కృష్ణ కీర్తన చేసిన వెంటనే , మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు



Lecture on SB 1.8.22 -- Los Angeles, April 14, 1973


మీరు హరే కృష్ణ కీర్తన చేసిన వెంటనే , మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు. మీరు కమల పుష్పమును చూసిన వెంటనే, ఈ శ్లోకమును మీరు వినిన వెంటనే... ఈ సంస్కృత శ్లోకము మనము అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మన పుస్తకాలను విక్రయించడం కోసం మాత్రమే కాదు. మీలో ప్రతి ఒక్కరికి... మనము మళ్లీ మళ్లీ ఈ శ్లోకమును తిరిగి చెప్తున్నాము, తద్వారా మీరు ఈ మంత్రాలను కీర్తన చేయాలి అని ఆశిస్తున్నాను. పుస్తకం ఉంచుకోవడము కాదు... "నేను చాలా జ్ఞానము ఉన్న పండితుడను." ఏ విధమైన జ్ఞానము కలిగిన విద్వాంసుడు? "నేను పుస్తకం కనుగొంటే, అప్పుడు నేను మాట్లాడగలను." ఇది పాండిత్యము కాదు. మీరు కీర్తన లో ఉండాలి.

అందువలన మన డల్లాస్ పిల్లలలో కేవలం సంస్కృత భాషను నేర్చుకోవడమే బోధిస్తున్నాము. వారికి వేరే ఏ పని చేయడానికి లేదు. వారు సాంకేతిక నిపుణులుగా లేదా ప్రతి ఒక్కరికి సేవకునిగా ఉండరు. కాదు కృష్ణ చైతన్యమును ప్రచారము చేయగల ఒకానొక తరము మనకు కావాలి. వారు ఇంగ్లీష్ మరియు సంస్కృతం నేర్చుకుంటే, వారు ఈ పుస్తకం చదవగలరు, అది సరిపోతుంది. మనకు ఇంక ఏమీ అవసరం లేదు. సమాచారము అంతా ఉన్నది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా, జ్ఞానం ఏదైతే ఉందో, శ్రీమద్-భాగవతం లో, ప్రతిదీ ఉంది. సాహిత్యం ఉంది, కవిత్వం ఉంది, తత్వము ఉంది, ధర్మము ఉంది, భగవంతుని ప్రేమ ఉంది, ఖగోళ శాస్త్రము ఉంది. అంతా ఉంది. శ్రీమద్-భాగవతము amalaṁ purāṇam. Vidyā bhāgavatāvadhiḥ. ఒకరు శ్రీమద్-భాగవతం చదివినట్లయితే, ఆయన విద్య ఉన్నతమైనది. Vidyā bhāgavatāvadhiḥ.. అంతిమమైనది ఏదో ఉంది. ఉన్నతమైనది కావున విద్య కోసం, విద్య, ఈ శ్రీమద్-భాగవతం. ఒకరు శ్రీమద్-భాగవతం అధ్యయనం చేస్తే, ఆయన ప్రతి విషయములో బాగా ప్రావీణ్యం పొందుతాడు.

కాబట్టి మేము మీ దేశంలో కొత్త తరాన్ని సృష్టించాలనుకుంటున్నాము, అందువల్ల భవిష్యత్తులో శ్రీమద్-భాగవతంలో అనర్గళముగా మాట్లాడే వక్త ఉంటాడు మరియు దేశమంతటా ప్రచారము చేస్తాడు, మీ దేశం రక్షించబడుతుంది. ఇది మన కార్యక్రమం. మీ దేశమును దోచుకోవడానికి మేము ఇక్కడకు రాలేదు, కానీ మీకు వాస్తవమైనది కొంత ఇవ్వాలని. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. కాబట్టి శ్రీమద్-భాగవతం చదవండి, శ్లోకాలు చాలా సరళంగా ఉచ్చరించండి. అందువలన మనము తిరిగి పలుకుతున్నాము. మీరు రికార్డులను వినండి మరియు తిరిగి చెప్పడానికి ప్రయత్నించండి. కేవలం మంత్రాన్ని జపించడము ద్వారా, మీరు పవిత్రము చేయబడతారు. కేవలం కీర్తన ద్వారా... మీరు కనీసము ఒక్క పదాన్ని అర్థం చేసుకోక పోయినా, మీరు కేవలము కీర్తన చేస్తే, ఈ తరంగము ఎంతో శక్తిని కలిగి ఉంది. Śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ puṇya-śravaṇa-kīrtanaḥ ( SB 1.2.17) మీరు ఈ శ్లోకమును కేవలం కీర్తన చేస్తే పలికితే , ఈ శ్లోకాలు, ఈ శ్లోకాలు, ఇవి పుణ్య- శ్రవణ - కీర్తనః. ఉంది, అవగాహన అనే ప్రశ్నే లేదు. పుణ్య- శ్రవణ - కీర్తనః - పుణ్య పవిత్రము అని అర్థం, శ్రవణ అంటే శ్రవణము చేయడము, కీర్తన అంటే కీర్తన. ఈ శ్లోకమును కీర్తన చేస్తున్న వాడు ఈ శ్లోకమును విన్నవాడు, ఆయన సహజముగా పవిత్రము అవుతాడు. పవిత్రము అవుతాడు. పవిత్రము అవ్వడానికి ఒకరు చాలా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది, దీన్ని చేయండి, దాన్ని చేయండి కానీ మీరు కేవలము శ్రీమద్-భాగవతమును వింటే, భగవద్గీత. అందువలన, ప్రతి ఆలయంలో ఒక దృఢమైన సూత్రం, శ్రవణము చేయడము కీర్తన చేయడము గురించి తరగతి ఉండాలి. కీర్తన, శ్రవణము లేకుండా, నాయకుడిగా మారడం అసాధ్యం. మీరు, మీరు భౌతిక ప్రపంచంలో నాయకుడు కావచ్చు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కాదు