TE/Prabhupada 0749 - కృష్ణుడు బాధ పడుతూ ఉన్నాడు. కావున మీరు కృష్ణ చైతన్య వంతులు అవ్వండి



Lecture on SB 1.7.7 -- Vrndavana, April 24, 1975


ప్రభుపాద: ప్రజలు అపవిత్రముగా ఉండటము వలన బాధపడుతున్నారు. అందువల్ల భగవంతుణ్ణి అర్థం చేసుకోలేరు, కృష్ణుడు అంటే ఏమిటి, ఆతను తన అపవిత్రపు పనులను అపి వేస్తే తప్ప.

yeṣāṁ tv anta-gataṁ pāpaṁ
janānāṁ puṇya-karmaṇām
te dvandva-moha-nirmuktā
bhajante māṁ dṛḍha-vratāḥ
(BG 7.28)

ఇది సూత్రము, మీరు మనుష్యులను వారి దుర్మార్గపు కార్యక్రమాలలో ఉంచలేరు, అదే సమయంలో ఆయన ధర్మముగా ఉంటాడు, లేదా భగవంతుని చైతన్యము కలిగి ఉంటాడు అని కాదు. అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. కాబట్టి చైతన్య మహాప్రభు పవిత్రముగా ఉండటానికి చాలా సులభమైన పద్ధతిని సూచించాడు. ఇది హరే కృష్ణ మహా మంత్రాన్ని కీర్తన, జపము చేయడము. Ceto-darpaṇa-mārjanam ( CC Antya 20.12) వాస్తవమైన వ్యాధి మన హృదయంలోనే ఉంది. Hṛd-roga-kāma. Hṛd-roga-kāma ( CC Antya 5.45–46) మనకు వ్యాధి ఉంది, హృదయ జబ్బు ఉంది. అది ఏమిటి? కామ, కామ కోరికలు. దీనిని హృద్-రోగ-కామా అని పిలుస్తారు. కాబట్టి ఈ హృదయపు జబ్బు, హృద్-రోగ-కామాను నయం చేయవలసి ఉంటుంది. హరే కృష్ణ మంత్రాన్ని వినడం మరియు కీర్తన చేయడము ద్వారా ఇది జరుగుతుంది. Ceto-darpaṇa-mārjanam. హృదయం సరిగ్గా ఉంది కానీ అది భౌతికముగా మురికి విషయాలతో కప్ప బడి ఉంది, అవి మూడు గుణాలు: సత్వ, రజో, తమో-గుణములు. కానీ కేవలము శ్రీమద్-భాగవతం వినడం ద్వారా, హరే కృష్ణ చైతన్యము మంత్రాన్ని వినడము ద్వారా, మీరు పవిత్రము చేయబడతారు. Nityaṁ bhāgavata-sevayā. Naṣṭa-prāyeṣu abhadreṣu nityaṁ bhāgavata-sevayā ( SB 1.2.18) Nityaṁ bhāga... మనము ఈ అవకాశాన్ని తీసుకుంటే... ప్రజలందరికి ఈ అవకాశాన్ని ఇవ్వడానికి కేవలం ప్రపంచవ్యాప్తంగా కేంద్రాలను తెరుస్తున్నాం, nityaṁ bhāgavata-sevayā. Anartha upaśamaṁ sākṣād bhakti-yogam ( SB 1.7.6) అప్పుడు, కృష్ణుడి గురించి వినడం ద్వారా హృదయం పవిత్రము అయిన వెంటనే... చైతన్య మహాప్రభు సిఫార్సు చేసినారు yāre dekha, tāre kaha kṛṣṇa-upadeśa ( CC Madhya 7.128) ఈ శ్రీమద్-భాగవతము కూడా కృష్ణ-ఉపదేశ, ఎందుకంటే శ్రీమద్-భాగవతం వినడం ద్వారా, మీరు కృష్ణుడిపై ఆసక్తి కలిగి ఉంటారు. కృష్ణుడి గురించి ఉపదేశము, అది కూడా కృష్ణుడి-ఉపదేశము మరియు ఉపదేశము , కృష్ణుడు ఇచ్చిన ఉపదేశము, అది కూడా కృష్ణుడి-ఉపదేశము.

కాబట్టి ఇది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం, మీరు వెళ్ళి ప్రచారము చేయండి కృష్ణుని -ఉపదేశము గురించి ప్రచారం చేయండి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. కృష్ణ చైతన్యమును ఎలా వ్యాప్తి చేయాలని మన వారి అందరికి బోధిస్తున్నాము. అప్పుడు anartha upaśamaṁ sākṣāt. అప్పుడు ఆయనకు ఉన్న అన్ని కలుషితమైన అవాంఛనీయ విషయములు ఆగి పోతాయి అప్పుడు పవిత్రమైన చైతన్యము... పవిత్రమైన చైతన్యం అంటే కృష్ణ చైతన్యము. పవిత్రమైన చైతన్యము అంటే అర్థము చేసుకోవడము నేను కృష్ణునితో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాను. ఉదాహరణకు నా వేలు చాలా సన్నిహితముగా నా శరీరం తో అనుసంధానించబడినట్లు. సన్నిహితంగా... వేలుకు కొద్దిగా నొప్పి ఉంటే, నేను చాలా కలత చెందుతాను నేను ఈ వేలుతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాను కనుక అదేవిధముగా, మనము కృష్ణునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాము, మనము పతనము అయినాము. అందువల్ల కృష్ణుడు కూడా కొంచము బాధను కలిగి ఉంటాడు, అందువల్ల ఆయన క్రిందికి వస్తారు:

paritrāṇāya sādhūnāṁ
vināśāya ca duṣkṛtām
dharma-saṁsthāpanārthāya
sambhavāmi yuge yuge
(BG 4.8)

కృష్ణుడు బాధ పడుతూ ఉన్నాడు. కావున మీరు కృష్ణ చైతన్య వంతులు అవ్వండి, అప్పుడు కృష్ణుడు ఆనందం అనుభవిస్తారు. ఇది కృష్ణ చైతన్యము ఉద్యమము.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద