TE/Prabhupada 0764 - కార్మికులు భావించారు, ఏసుక్రీస్తు ఈ కార్మికులలో ఒకరు



Lecture on SB 2.3.14-15 -- Los Angeles, May 31, 1972


కాబట్టి పట్టణ పట్టణానికి, గ్రామ గ్రామానికి వెళ్ళండి. కృష్ణ చైతన్యమును ప్రచారం చేయండి. వారిని బ్రతికించండి, ఈ నిరాశ నిలిపివేయబడుతుంది. సమాజంలోని నాయకులు, రాజకీయ నాయకులు, వారు ఎక్కడికి వెళ్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇలా చెప్పబడింది, కథా హరి - కథోదర్కాః సతాం స్యుః సదసి ధ్రువం ( SB 2.3.14) అందువల్ల మనము ఈ హరి-కథ గురించి చర్చిస్తే.... మనం శ్రీ మద్భాగవతము గురించి చర్చిస్తున్నాము, హరి-కథ. కాబట్టి కథా, హరి-కథా, ఉదర్కాః సతం స్యుః సదసి ధ్రువం. ఇది భక్తుల మధ్య చర్చించబడినది‌, అప్పుడు వారు అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకం, శ్రీమద్భాగవతం, భక్తులలో విలువను కలిగి ఉంది. ఇతరులకు, వారు వితరణ చేయవచ్చు. వారు చూస్తారు "ఇది ఏమిటి? సంస్కృత శ్లోకము, ఏదో వ్రాయబడి ఉంది. కాగితపు ముక్క." మీరు చూడండి. ఈ వార్తా పత్రిక మాదిరిగా, మనకు, కాగితపు ముక్క. మనము దానిని పట్టించుకోము. కానీ వారు వారి ఛాతి మీద చాలా జాగ్రత్తగా వుంచుకుంటారు, " ఓ‌, ఇది చాలా బాగుంది." (నవ్వు)

పాశ్చాత్య దేశాలలో వార్తాపత్రిక చాలా ప్రజాదరణ పొందింది. ఒక పెద్దమనిషి నాకు ఈ కథ చెప్పాడు, షెఫీల్డ్ లో ఒక క్రైస్తవ పూజారి క్రైస్తవ మతాన్ని బోధించుటకు వెళ్లాడు. షెఫీల్డ్, ఇది ఎక్కడ ఉంది? ఇంగ్లాండులో? కాబట్టి పనివారు, కార్మికులు, 'వారికి బోధిస్తున్నాడు “ప్రభువైన ఏసుక్రీస్తు నిన్ను రక్షిస్తాడు”. మీరు ప్రభువైన ఏసుక్రీస్తు ఆశ్రయం తీసుకోకపోతే, అప్పుడు మీరు నరకమునకు వెళ్తారు'. మొదట ఆయన, “యేసుక్రీస్తు ఎవరు? ఆయన నంబరు ఏమిటి?" అంటే ఆయన, వారు భావించారు, “ఏసుక్రీస్తు ఈ కార్మికుల మధ్యలో ఒకరు, ప్రతి కార్మికునికి ఒక సంఖ్య ఉంది, (నవ్వు) కాబట్టి ఆయన సంఖ్య ఏమిటి? కాబట్టి “కాదు, యేసుక్రీస్తు, ఆయన భగవంతుని కుమారుడు, కాబట్టి ఆయనకు సంఖ్య లేదు. ఆయన కార్మికుడు కాదు.” అప్పుడు “నరకము అంటే ఏమిటి?” అప్పుడు వివరించాడు, " నరకము చాలా తడిగా, చాలా చీకటిగా ఉంటుంది.” ఇంకా అలా,అలా. వారు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే వారు గనులలో పని చేస్తున్నారు. అది ఎల్లప్పుడూ చీకటిగా తడిగా ఉంటుంది. (నవ్వు) (ప్రభుపాద నవ్వుతారు) కాబట్టి నరకానికి దీనికి వ్యత్యాసం ఏమిటి? గని అని పిలవబడేది ఏమిటి? వారు నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ పూజారి చెప్పినప్పుడు, “అక్కడ వార్తాపత్రిక ఉండదు,” ఓ, ఓ‌, భయంకరము!" (నవ్వు) వార్తాపత్రిక లేదు. (ప్రభుపాద నవ్వుతారు) అందువలన, మీ దేశంలో, చాలా గొప్ప, గొప్ప, నేను చెప్పాలనుకున్నది, వార్తాపత్రికల సమూహం, అవి పంపిణీ చేయబడుతున్నాయి.