TE/Prabhupada 0768 - ముక్తి అంటే భౌతిక శరీరం ఇక ఉండదు. దీనిని ముక్తి అని పిలుస్తారు



Lecture on BG 8.1 -- Geneva, June 7, 1974


ప్రభుపాద: ఇది కృష్ణ చైతన్యము యొక్క అంతిమ ముగింపు, అది అంత - కాలే, మరణ సమయంలో... జీవితం చివరి దశలో, అంత-కాలే చ మామ్, "నన్ను," నా యందు, అంత-కాలే చ మామేవ ( BG 8.5) "తప్పకుండా," స్మరణ్, "గుర్తుపెట్టుకోవడం." శ్రీ విగ్రహారాధన ముఖ్యంగా ఈ ప్రయోజనము కోసం ఉన్నది, కావున మీరు రాధా కృష్ణుల యొక్క శ్రీ విగ్రహాలను పూజించాలి, సహజంగా మీరు మీ హృదయము లోపల ఎల్లప్పుడూ రాధా-కృష్ణుల గురించే ఆలోచించడానికి సాధన చేయబడతారు. ఈ అభ్యాసం అవసరం. Anta-kāle ca mām eva smaran muktvā ( BG 8.5) ఇది ముక్తి. ముక్తి అంటే భౌతిక శరీరం ఇక ఉండదు. దీనిని ముక్తి అని పిలుస్తారు. మనము ఇప్పుడు ఈ భౌతిక శరీరముతో బద్ధులమై ఉన్నాము. ఈ భౌతిక ప్రపంచంలో, మనము ఒకటి తరువాత మరొక శరీరం మారుస్తున్నాము, కానీ దానిలో ముక్తి లేదు. ఏ విముక్తి లేదు. ముక్తి అంటే... కేవలం శరీరాన్ని మార్చడం ద్వారా ముక్తులము కాము. ముక్త అంటే మనం ఈ శరీరాన్ని మారుస్తాము, ఇక మరే భౌతిక శరీరాన్నీ అంగీకరించడానికి కాదు, కానీ మనము మన స్వంత ఆధ్యాత్మిక శరీరములో ఉంటాము. ఉదాహరణకు మీరు వ్యాధి కలిగి ఉన్నట్లయితే, మీరు జ్వరంతో బాధపడుతున్నారు, కాబట్టి అక్కడ ఇక జ్వరం లేనప్పుడు, కానీ మీరు మీ వాస్తవ ఆరోగ్యకరమైన శరీరంలో ఉంటారు, అది ముక్తిగా పిలువబడుతుంది. ఈ ముక్తి అంటే అది నిరాకారము అవటము కాదు. కాదు అదే ఉదాహరణ: మీరు జ్వరం నుండి బాధపడుతున్నారు. జ్వరం నుంచి స్వేచ్ఛ పొందడం వల్ల మీరు నిరాకారమవుతారని అర్థం కాదు. నేను నిరాకారముగా ఎందుకు మారతాను? నా రూపం ఉంది, కానీ నా రూపం జ్వరం, జ్వరసంబంధమైన పరిస్థితిలో ఇబ్బంది పడలేదు. దీనిని ముక్తి అని పిలుస్తారు. రోగ-ముక్తా, వ్యాధి నుండి స్వేచ్ఛ కలిగి ఉండటము. అందువల్ల దీనిని ముక్త్వా కలేవరం అని పిలుస్తారు. పాము లాగే. అవి కొన్నిసార్లు శరీరం యొక్క బయటి పొరను వదలి వేస్తాయి. మీరు చూసారా?

భక్తులు: అవును, అవును.

ప్రభుపాద: కానీ ఆయన శరీరంలో ఉంటాడు. ఆయన శరీరంలో ఉంటాడు. కానీ అదనపు పొరను అది కలిగి ఉంది, అది దానిని పెంచినది, అది కూడా పోతుంది ఒకసారి అది వదలి వేసినప్పుడు. ప్రతిదీ, ప్రతి విద్య, ప్రకృతి అధ్యయనం లో ఉంది. మనము చూడగలం, పాము పొరను వదలి వేస్తాయి, కానీ అది తన రూపంలో ఉంటుంది. అదేవిధముగా, మనము... ముక్త్వా కలేవరం అంటే ఈ అదనపు అని అర్థం... ఉదాహరణకు ఈ దుస్తుల్లాగానే, ఇది కప్పివేస్తుంది. నేను దానిని వదలి వేయగలను, కానీ నా వాస్తవ శరీరంలో నేను ఉంటాను. అదేవిధముగా, ముక్తి అనగా... నా వాస్తవ శరీరం పొందుతాను. ఇది ఈ భౌతికపు పూతతో కప్పబడి ఉంటుంది. కాబట్టి ఇక భౌతిక పూత లేనప్పుడు, దీనిని ముక్తి అని పిలుస్తారు. మీరు కృష్ణుడి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు అది సాధించవచ్చు, తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు, భగవద్ధామము తిరిగి చేరుకున్నప్పుడు. ఆ సమయంలో, మీరు నిరాకారము కాదు. రూపం ఉంటుంది. నేను వ్యక్తిగత రూపమును కలిగి ఉన్నాను కనుక, అదేవిధముగా, నేను కృష్ణుడి దగ్గరకు వెళ్లినప్పుడు, కృష్ణుడు ఆయన కూడా వ్యక్తిగత రూపం కలిగి ఉన్నాడు, నాకు కూడా నా వ్యక్తిగత రూపం ఉంది... Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). ఆయన అన్ని జీవులలో ముఖ్యుడు. కాబట్టి దీనిని ముక్తి అని పిలుస్తారు.

మీ మరణం సమయంలో మీరు కృష్ణుడిని గుర్తుంచుకోగలిగితే మీరు ముక్తిని పొందుతారు. కాబట్టి ఇది సాధ్యమే. మనము కృష్ణుడి గురించి ఆలోచించడము సాధన చేసినట్లైతే, సహజంగా, మరణం సమయంలో, ఈ శరీరం యొక్క ముగింపు సమయంలో, మనము కృష్ణుడిని గురించి ఆలోచించటానికి చాలా అదృష్ట వంతులమైతే, ఆయన రూపమును, అప్పుడు మనం భౌతికం నుంచి విడుదలవుతాము, ఇక ఈ భౌతిక శరీరమే ఉండదు. ఇది కృష్ణ చైతన్యము. సాధన చేయండి