TE/Prabhupada 0773 - మన శ్రద్ధ ఎల్లప్పుడూ, మనము ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాం అని ఉండాలి



Lecture on SB 2.3.19 -- Los Angeles, June 15, 1972


ప్రద్యుమ్న: 153 వ పేజీ, భాష్యములో, రెండవ పేరాలో: ఒంటె ఒక రకమైన జంతువు, ఇది ముళ్ళను తిని సంతోషాన్ని పొందుతుంది. అదేవిధముగా, కుటుంబ జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకునే వ్యక్తి లేదా ప్రపంచ జీవితాపు ఆనందం అని పిలవబడే దానిని ఒంటెతో పోల్చవచ్చు. భౌతిక జీవితం పూర్తిగా ముళ్ళతో నిండి ఉంది, కాబట్టి వేదములలో ఇవ్వబడిన నిబంధనల ద్వారా మాత్రమే జీవించాలి, కేవలం చెడ్డ బేరం యొక్క ఉత్తమ ఉపయోగం కోసం. "

ప్రభుపాద: మీరు ముళ్ళు ఉన్న మార్గము గుండా వెళ్తుంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ముళ్ళు మీ వస్త్రములో గుచ్చుకుంటాయి. మీరు అసౌకర్యంగా ఉంటారు. ఇది వేదాలలో చెప్పబడినది, kṣurasya dhārā niśitā duratyayā (Kaṭha Upaniṣad 1.3.14). మనము రేజర్ తో గడ్డము చేసుకుంటున్నట్లుగా, రేజర్ చాలా పదునైనది. కాబట్టి మనము రేజర్ను జాగ్రత్తగా ఉపయోగించ గలిగితే, మనము బుగ్గలను చాలా శుభ్రముగా ఉంచుకుంటాము, ఆ పని జరుగుతుంది. కానీ కొంచము అశ్రద్ధతో ఉంటే, వెంటనే తెగి, అక్కడ రక్తం ఉంటుంది. కొంచము అశ్రద్ధ. ఆ ఉదాహరణ ఇవ్వబడింది. Kṣurasya dhārā niśitā duratyayā durgaṁ pathas tat kavayo vadanti. మోక్షానికి మార్గం చాలా కష్టము. మనము భగవత్ ధామమునకు తిరిగి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నట్లుగానే, తిరిగి భగవంతుడు, కృష్ణుని దగ్గరకు . మార్గం చాలా కష్టమైనది. Kṣurasya dhārā niśitā duratyayā durgam. దుర్గమ్ అంటే దాటడము చాలా కష్టము. కానీ కొంచము శ్రద్ధ మిమ్మల్ని కాపాడుతుంది. కొంచము శ్రద్ధ, "నేను చాలా ప్రమాదకరమైన మార్గం గుండా వెళుతున్నాను, కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. " మన శ్రద్ధ ఎల్లప్పుడూ, మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాం.

అది చాలా సులభం. మనము ఖచ్చితముగా నియమ నిబంధనలు పాటిస్తూ కనీసం పదహారు మాలలను జపము చేయాలి. అది మనలని రక్షిస్తుంది. కానీ మనము ఈ సూత్రాల పట్ల శ్రద్ధగా లేకుండా ఉంటే, అప్పుడు ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంది. అన్ని చోట్ల చాలా ముళ్ళు ఉన్నాయి. లేదా అదే ఉదాహరణ. Kṣurasya dhārā. మీరు గడ్డము చేసుకుంటే మీ ముఖం చాలా పరిశుభ్రంగా ఉంటుంది, కానీ కొంచము అశ్రద్ధతో ఉంటే, వెంటనే రక్తం వస్తుంది. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కొనసాగించు. ప్రద్యుమ్న: "భౌతిక జీవితంలో ఒకరు తన రక్తం పీల్చుకోవటం ద్వారా నిర్వహించబడుతున్నారు అంతిమ భౌతిక ఆనందము యొక్క ఆకర్షణ కేంద్ర విషయము లైంగిక జీవితం. లైంగిక జీవితాన్ని ఆస్వాదించడము తన రక్తాన్ని పీల్చుకోవడం, ఈ సంబంధములో వివరించడానికి ఇంకా ఎక్కువ ఏమి లేదు. ఒంటె కూడా తన రక్తాన్ని పీల్చుకుంటుంది. ముళ్ళ కొమ్మలను నమలుతున్నప్పుడు ఒంటె తింటున్న ముళ్లు ఒంటె నాలుకను కత్తిరిస్తాయి. కావున ఒంటె యొక్క నోటిలో రక్తం ప్రవహిస్తుంది. తాజా రక్తంతో కలిసిన ముళ్ళు వివేకములేని ఒంటెకు రుచిని ఇస్తాయి, అందువలన అది తప్పుడు ఆనందం తో ముళ్ళు- తినే కార్యమును ఆనందిస్తుంది. అదేవిధముగా, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, చాలా కష్టపడి పని చేస్తారు వేర్వేరు మార్గాలలో ప్రశ్నార్థకమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి, వారి రక్తం కలిపిన వారి కర్మ యొక్క ముళ్ళ ఫలితాన్ని తింటున్నారు. అందువల్ల భాగవతము ఈ వ్యాధి ఉన్న వ్యక్తులను ఒంటెలతో పాటు ఉంచింది. "

ప్రభుపాద: డబ్బు మరియు ఇంద్రియాలను అనుభవించడం కోసం వారు ప్రమాదం, చాలా ప్రమాదం తీసుకుంటారు. దొంగ, దొంగతనము చేసే వారు తమ జీవితాన్ని పణంగా పెడతారు. వారు ఒక వ్యక్తి ఇంటికి దొంగిలించడానికి వెళతారు, ఇది తెలిసినదే అతడు చేస్తాడు అది బయటపడిన వెంటనే వెంటనే, అతడు వచ్చి, ఇంటి యజమాని వెంటనే అతనిని కాల్చవచ్చు. ఆ ప్రమాదం ఆతను తీసుకున్నాడు. కాబట్టి దొంగలు, దొంగతనము చేసే వారు మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరు. ఇది చెప్పబడింది padaṁ padaṁ yad vipadām ( SB 10.14.58) ప్రతి దశలో ప్రమాదం ఉంది. ప్రతి అడుగులో మనము చాలా వేగంగా మన మోటర్ వాహనాలను నడుపుతున్నాము, డెబ్బై మైళ్ళు, వంద మైళ్ల వేగముతో, కానీ ఏ క్షణం అయినా గొప్ప ప్రమాదం ఉండవచ్చు. కాబట్టి వాస్తవానికి భౌతిక జీవితంలో ఏ శాంతి ఉండదు. అది సాధ్యం కాదు. Samāśritā ye pada-pallava-plavam ( SB 10.14.58) అందువల్ల భగవంతుని యొక్క కమల పాదముల వద్ద ఆశ్రయం తీసుకోవాలి. మనము సంతోషంగా ఉండాలని కోరుకుంటే, మనము శాంతిగా ఉండాలని కోరుకుంటే,అప్పుడు ఇది ఏకైక మార్గం మాత్రమే