TE/Prabhupada 0775 - కుటుంబం మీద ఆసక్తి గొప్ప అవరోధం కృష్ణ చైతన్యములో ఉన్నతి సాధించే విషయములో



Lecture on SB 7.6.8 -- New Vrindaban, June 24, 1976


ప్రభుపాద: సాధారణముగా, ప్రజలు చాలా మంది కుటుంబము పట్ల అనుబంధము కలిగి ఉంటారు. పాశ్చాత్య దేశాలలో చిన్న పిల్లవాళ్ళు, వారు కృష్ణ చైతన్యమునకు వస్తారు, వారి ఒకే ఒక గొప్ప ఆస్తి వారు కుటుంబమునకు అంతగా అనుబంధము కలిగి ఉండరు. ఇది చాలా మంచి యోగ్యత. ఏదో ఒక్క విధముగా, వారు అయ్యారు. అందుకని కృష్ణునితో వారి అనుబంధం ఎంతో ధృడముగా ఉంది. భారతదేశంలో వారు ఉమ్మడి కుటుంబం మీద ఆసక్తి కలిగి ఉండేవారు. వారికి ఆసక్తి లేదు. వారు ఇప్పుడు డబ్బు కోసము చూస్తున్నారు. నాకు అనుభవము ఉంది. అవును.

కావున కుటుంబం ఆసక్తి గొప్ప అవరోధం కృష్ణ చైతన్యములో ఉన్నతి సాధించే విషయములో, కానీ మొత్తం కుటుంబము కృష్ణ చైతన్య వంతులు అయితే, అది చాలా బాగుంటుంది. ఉదాహరణకు భక్తివినోద ఠాకురా లాగానే. ఆయన ఒక కుటుంబం మనిషి, కానీ, అందరూ - భక్తివినోద ఠాకురా, ఆయన భార్య, ఆయన పిల్లలు... ఉత్తమ పిల్లవాడు మా గురు మహారాజ, ఉత్తమ పిల్ల వాడు... అందువలన ఆయన తన అనుభవం ద్వారా పాడారు, ye dina gṛhe bhajana dekhi gṛhete goloka bhaya. కుటుంబం వారీగా, ప్రతి ఒక్కరూ కృష్ణుని సేవలో నిమగ్నమైనప్పుడు, అది చాలా మంచిది. ఇది సాధారణ కుటుంబం కాదు. ఆ ఆసక్తి సాధారణ ఆసక్తి కాదు. కానీ సాధారణంగా ప్రజలు భౌతికంగా అనుబంధమును కలిగి ఉంటారు.దానిని ఇక్కడ ఖండించారు. Śeṣaṁ gṛheṣu saktasya pramattasya apayāti hi ( SB 7.6.8) వారిని ప్రమట్ట అని పిలుస్తారు. అందరూ ఆలోచిస్తున్నారు "నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా జాతి, నా సమాజం, ఇది ప్రతిదీ. కృష్ణుడు అంటే ఏమిటి? " ఇది మాయ కలిగించిన అతి గొప్ప భ్రాంతి. కానీ ఎవరూ మీకు రక్షణ ఇవ్వలేరు.

dehāpatya-kalatrādiṣv
ātma-sainyeṣv asatsv api
teṣāṁ pramatto nidhanaṁ
paśyann api na paśyati
(SB 2.1.4)

అంతా పూర్తి అవుతుంది. కృష్ణుడు తప్ప మరి ఎవ్వరు మనకు రక్షణ ఇవ్వలేరు. మనము మాయ కోరల నుండి నుండి విముక్తి పొందాలనుకుంటే - janma-mṛtyu-jarā-vyādhi ( BG 13.9) మనము కృష్ణుడి యొక్క కమల పాదముల దగ్గర ఆశ్రయం తీసుకోవాలి, ఆధ్యాత్మిక గురువు ద్వారా, అదే ప్రయోజనము కోసం నిమగ్నమై ఉన్న భక్తులతో కలసి నివసించాలి. ఇది అంటారు... ఖచ్చితమైన పదం ఏమిటి? సఖి లేదా ఏదైన. ఇప్పుడు నేను మర్చిపోతున్నాను. కానీ అదే వర్గం లో మనం నివసించాలి మరియు మన కృష్ణుడి చైతన్యాన్ని అమలు చేయాలి. అప్పుడు ఈ ఇబ్బందులు, gṛheṣu saktasya pramattasya. ఎవరైనా... కర్మిలు అందరు, వారు ఈ కుటుంబ జీవితమునకు అనుబంధమును కలిగి ఉన్నారు, కానీ కుటుంబ జీవితము మంచిది అయితే కృష్ణ చైతన్యం ఉండాలి. Gṛhe vā vanete thāke, hā gaurāṅga bole dāke. అది పట్టింపు లేదు, ఆయన కుటుంబ జీవితంలో ఉన్నా లేదా ఆయన సన్యాస జీవితంలో ఉన్నా, ఆయన ఒక భక్తుడు అయితే, అప్పుడు ఆయన జీవితం విజయవంతమవ్వుతుంది.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ ప్రభుపాద.